Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సమైక్య గర్జన సభపై పునరాలోచనలో గంటా

$
0
0

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: విశాఖ సమైక్య గర్జన సభ వివాదాస్పదంగా మారుతోంది. సభకు హాజరయ్యే విషయమై మంత్రి గంటా శ్రీనివాసరావు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. నాన్ పొలిటికల్ జెఎసి ఆధ్వర్యంలో ఆర్‌కె బీచ్‌లో ఈనెల 21న భారీ జనసందోహంతో సభ నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సభ నిర్వహణ వెనుక మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారన్నది రాజకీయ పార్టీల వాదన. ఈ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు జరిగిన తొలి సమావేశానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిడిపి, లోక్‌సత్తా పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈ సభను గంటా శ్రీనివాసరావు లీడ్ చేస్తున్నారన్న భావనతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. అది జెఎసి సభ కాదని, కాంగ్రెస్ సభ అంటూ విమర్శలు కూడా గుప్పించింది. వైకాపా ఈ నిర్ణయం తీసుకోవడంతో, టిడిపి కూడా ఈ సభకు వెళ్లాలా? వద్దా? అన్న ఆలోచనలో పడింది. దీనిపై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయమై గురువారం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమ ఆరంభంలో నాన్ పొలిటికల్ జెఎసికి గంటా శ్రీనివాసరావే ఊపిరిపోసినా, వారు నిర్వహించే కార్యక్రమాల్లో ఈయన పాల్గొంటున్నారే తప్పు, తనకు తానుగా ఏ కార్యక్రమాన్ని ఇప్పటి వరకూ రూపకల్పన చేయలేదు. ఇటీవల విలేఖరుల సమావేశంలో కూడా గంటా మాట్లాడుతూ తనకు, నాన్ పొలిటికల్ జెఎసికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

విశాఖ సమైక్య గర్జన సభ వివాదాస్పదంగా మారుతోంది.
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>