విజయనగరం, సెప్టెంబర్ 18: సమైక్యాంధ్ర కోసం అనేక మంది ఉద్యమాలు చేపడుతుండగా, మరికొందరు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌గజపతిరాజు విమర్శించారు. బుధవారం ఎల్‌ఐసి కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా విభజనకు ముందర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ రాష్ట్రంలోని 23 జిల్లాల్లో పర్యటించి నివేదికను ప్రభుత్వానికి అందజేయగా వాటిలో ఒక భాగంలోని నివేదికను గోప్యంగా ఉంచిందన్నారు. కాగా, మిగిలిన భాగాల్లో సూచించిన వాటిపైన ఎటువంటి చర్చ లేకుండా తెలంగాణా ఇచ్చేస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొనడం విచిత్రంగా ఉందన్నారు. కాగా, ఇక్కడ సమైక్యాంధ్ర కోసం పోరాటం సాగిస్తున్న వారిపై కేసులు పెట్టడం శోచనీయమన్నారు. ఒకప్పుడు రాష్ట్రాలను భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించారని, నేడు భాషాప్రయుక్త రాష్ట్రాలను విడగొట్టడంలో ఏ సిద్దాంతాన్ని అనుసరించి చేస్తున్నారో తమకు అర్ధం కావడం లేదన్నారు. పార్టీ ఆరోగ్య విభాగం ఉపాధ్యక్షుడు డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ రాజీనామా చేయడాన్ని ప్రస్తావించగా మెడికల్ జెఎసి కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టినపుడు ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా ఉండకూడదన్న ఆశయంతో ఆయన రాజీనామా చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐవిపి రాజు, మద్దాల ముత్యాలరావు, విజ్జపు ప్రసాద్, ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే కొంత మంది ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి యడ్ల ఆదిరాజు విమర్శించారు. బుధవారం ఇన్‌కంటాక్స్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ మండలాల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి పర్యటించినపుడు అడ్డుకున్నారని వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకు చెబుతున్నారని ఆరోపించారు.
సమాజంలో మార్పునకు ‘తాపి’ కృషి
విజయనగరం, సెప్టెంబర్ 18: పట్టణంలోని అభ్యుదయ రచనల ద్వారా తాపి ధర్మారావు కీర్తిప్రతిష్టలు గడించారని విజయనగరం జిల్లా రచయితల సంఘం కార్యదర్శి కెకె రఘునందన అన్నారు. బుధవారం పట్టణంలోని ఎలియన్స్, సాగిసీతారామరాజు స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాపి తన రచనలతో సమాజంలో మార్పునకు కృషి చేశారన్నారు. సామాన్య జనానికి కూడా తాపి రచనలు ఆకట్టుకున్నాయన్నారు. ఆంధ్ర సాహిత్య సమాజం అనే సంస్థను స్థాపించి తాపి ధర్మారావు సాహిత్యానికి ఎంతో కృషి చేశారని వివరించారు. రాజు, రామ్మూర్తి, గురుప్రసాద్ పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర కోసం అనేక మంది ఉద్యమాలు చేపడుతుండగా
english title:
s
Date:
Thursday, September 19, 2013