ఏలూరు, సెప్టెంబరు 18 : జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా డి లీలావతి బుధవారం ఏలూరులో బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ జిల్లాలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జడ్జి లీలావతి బదిలీపై ఏలూరు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామానికి చెందిన లీలావతి అమలాపురంలో న్యాయవాదిగా పనిచేశారు. అంచెలంచెలుగా పదోన్నతులు పొందారు. 2012లో వరంగల్ జిల్లా జడ్జిగా లీలావతి పనిచేశారు. అంతకుముందు విశాఖపట్నం, నెల్లూరులలోని న్యాయస్థానాల్లో వివిధ స్థాయిల్లో న్యాయమూర్తిగా పనిచేశారు. బుధవారం ఏలూరులో మొదటి అదనపు డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా జిల్లా జడ్జిగా లీలావతి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జడ్జి లీలావతి మాట్లాడుతూ బార్ అసోసియేషన్, జడ్జిలు సమన్వయంతో పనిచేసే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందించడంతోపాటు చట్టాలపై గ్రామస్థాయిలో ప్రజల్లో చైతన్యం పెంచేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టిన లీలావతిని న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా డి లీలావతి బుధవారం ఏలూరులో
english title:
j
Date:
Thursday, September 19, 2013