జొహెన్నస్‌బర్గ్, మార్చి5: యువరాజ్ సింగ్ ఫౌండేషన్‌కు వితరణను ఇవ్వనున్నట్లు దక్షిణాఫ్రికా మేటి ఆల్‌రౌండర్ జాక్ కాలిస్ ప్రకటించాడు. మార్చి 30న భారత్‌తో జరిగే టి-20లో కాలిస్‌ను సన్మానించనున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా (సిఎస్‌ఎ) ప్రకటించింది. ఈ సందర్భంగా కాలిస్ తాను యువరాజ్ ఫౌండేషన్‌కు సాయం చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. అనారోగ్యంతో యువీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాడనీ, తమ జట్టు, సిఎస్‌ఎ అంతా కలసి యువీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని చెప్పాడు. గత సంవత్సరం డర్బన్‌లో జరిగిన టి-20 మ్యాచ్‌కు ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ కొనసాగింపనీ, ప్రతి సంవత్సరం ఇలా ఒక మ్యాచ్ జరిగేవిధంగా బిసిసిఐతో ఒప్పందం కుదిరిందనీ సిఎస్‌ఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గెరాల్డ్ మజోలా పేర్కొన్నాడు. ‘కాలిస్ దక్షిణాఫ్రికా క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా 30న జరిగే టి-20 మ్యాచ్ సందర్భంగా అతన్ని సముచితంగా గౌరవిస్తాం. అతడు దక్షిణాఫ్రికా క్రికెట్‌కు రోల్ మోడల్‌గా నిలిచాడు’ అని మజోలా తెలిపాడు. తనకు ఇటువంటి గుర్తింపును ఇవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కలిస్ చెప్పాడు.
జొహెన్నస్‌బర్గ్, మార్చి5: యువరాజ్ సింగ్ ఫౌండేషన్‌కు వితరణను ఇవ్వనున్నట్లు
english title:
uv
Date:
Tuesday, March 6, 2012