ముంబయి, మార్చి 5: దక్షిణాఫ్రికాలో భారతీయులు అడుగుబెట్టి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత్, సఫారీ జట్టు మధ్య ఏకైక టి-20 మ్యాచ్‌ను జొహెన్నస్‌బర్గ్‌లో మార్చి 30న నిర్వహించనున్నారు. ‘ఆసియా కప్‌లో పాల్గొన్న జట్టు స్వల్ప మార్పులతో మార్చి 28న దక్షిణాఫ్రికాకు బయల్దేరుతుంది. దక్షిణాఫ్రికాలో భారతీయలు అడుగుబెట్టి 150 సంవత్సరాలు పూర్తయినందుకు గుర్తుగా ఒక టి-20 మ్యాచ్ ఆడాల్సిందిగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు పంపిన ఆహ్వాన్ని బిసిసిఐ అంగీకరించింది’ అని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. టి-20లకు దూరంగా ఉంటున్న సీనియర్ ఆటగాడు సచిన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. అతని స్థానంలో రాబిన్ ఊతప్ప జట్టులో ఎంపికయ్యే అవకాశం ఉంది. ఆసియా కప్ ఈ నెల 11 నుంచి 22 వరకు జరుగుతుంది. దక్షిణాఫ్రికాలో 30న జరిగే టి-20 మ్యాచ్ తర్వాత ఏప్రిల్ 4న ఐపిఎల్-5 ప్రారంభమవుతుంది.
దక్షిణాఫ్రికాలో భారతీయులు అడుగుబెట్టి 150 సంవత్సరాలు పూర్తయిన
english title:
bharat
Date:
Tuesday, March 6, 2012