లాహోర్, మార్చి 5: బంగ్లా క్రికెట్ బోర్డు (బిసిబి)కు చెందిన ఉన్నత భద్రతాధికారుల బృందం పాకిస్తాన్ చేస్తున్న భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. దాంతో వచ్చే నెలలో పాక్‌లో బంగ్లాదేశ్ పర్యటనకు మార్గం సుగమమయినట్లేనని పాక్ బోర్డు భావిస్తోంది. బిసిబి అధ్యక్షుడు ముస్త్ఫా కమల్ నేతృత్వంలో బంగ్లా అధికారులు ఇస్లామాబాద్, లాహోర్, కరాచీల్లో పర్యటించారు. బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లేముందు పాక్‌లోని భద్రతా ఏర్పాట్లపై సంతృప్తిని వెలిబుచ్చారు. త్వరలో పాక్‌లో అంతర్జాతీయ క్రికెట్ జరగాలని కోరుకుంటున్నందున తమ జట్టును పంపాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. 2009లో శ్రీలంక జట్టుపై తాలిబన్లు దాడిచేసినప్పటి నుంచి పాక్‌లో మరే జట్టు పర్యటించలేదు. బిసిబి అధికారులు బంగ్లాదేశ్ ప్రభుత్వానికీ, బోర్డు సభ్యులకూ ఒక నివేదికను అందజేస్తారు. ఈ నివేదిక ఆధారంగా బంగ్లా ప్రభుత్వం తమ జట్టు పర్యటనపై ఒక నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఐసిసి కూడా పాక్‌లో మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగడానికి తన అనుమతిని తెలపాలి. ఐసిసి కూడా పాక్‌లో పరిస్థితులను పరిశీలించడానికి అధికారుల బృందాన్ని పంపే అవకాశం ఉంది.
భద్రతా ఏర్పాట్లపై అధికారుల సంతృప్తి
english title:
pak
Date:
Tuesday, March 6, 2012