అడిలైడ్, మార్చి 5: కామనె్వల్త్ బ్యాంక్ (సిబి) ట్రై సిరీస్ వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు మరో మెట్టు దూరంలో నిలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు మంగళవారం అడిలైడ్ ఓవల్ మైదానంలో జరిగే రెండో ఫైనల్‌లో శ్రీలంక జట్టుతో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 50 నిముషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ‘బెస్ట్ఫా త్రీ’ ఫైనల్స్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి ఫైనల్‌లో శ్రీలంక జట్టుపై 15 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యత సాధించిన ఆస్ట్రేలియా జట్టు మంగళవారం అడిలైడ్‌లోనూ విజేతగా నిలిచి మరో ఫైనల్ మిగిలి ఉండగానే టైటిల్ వేటను పూర్తిచేయాలని ఎదురుచూస్తోంది. అయితే తొలి ఫైనల్‌లో ఆసీస్ బౌలర్లు విఫలమై శ్రీలంక లోయర్ మిడిలార్డర్, టెయిలెండింగ్ బ్యాట్స్‌మన్లకు భారీగా పరుగులను సమర్పించుకోవడం కంగారూలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 163 పరుగులు సాధించి కెరీర్‌లోనే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు నమోదు చేయడంతో ఆస్ట్రేలియా జట్టు ఆరు వికెట్ల నష్టానికి 321 పరుగుల భారీ స్కోరు సాధించి పటిష్ట స్థితిలో నిలిచినప్పటికీ, శ్రీలంక లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ నువాన్ కులశేఖర (73) దూకుడుగా ఆడి కంగారూలకు దడ పుట్టించాడు. అతనితో పాటు టెయిలెండింగ్ బ్యాట్స్‌మన్లు కూడా బ్యాట్‌ను ఝుళిపించి చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులు రాబట్టడంతో 300 పరుగుల స్కోరును అధిగమించి లక్ష్యానికి చేరువైన శ్రీలంక జట్టు కేవలం 15 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.
ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు ‘బెస్ట్ఫా త్రీ’ ఫైనల్స్‌లో 1-0 ఆధిక్యతలో నిలిచినప్పటికీ మంగళవారం జరిగే రెండో ఫైనల్‌లో ఆ జట్టు ప్రదర్శన, ముఖ్యంగా బౌలింగ్ విభాగం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ఆసీస్ సారథి మైఖేల్ క్లార్క్ కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నాడు. పవర్ ప్లే ఓవర్లతో పాటు చివరి ఓవర్లలో తమ బౌలర్లు ఇబ్బందులు పడుతున్నారని, వీరి వైఫల్యాలను ఆసరాగా చేసుకునే శ్రీలంక జట్టు తొలి ఫైనల్‌లో గెలిచినంత పనిచేసి హడలెత్తించిందని క్లార్క్ పేర్కొన్నాడు. ఈ లోపాలను సరిదిద్దుకుని రెండో ఫైనల్‌లో వారు మెరుగైన ప్రదర్శన ఇవ్వగలరని భావిస్తున్నట్టు క్లార్క్ చెప్పాడు. ‘పవర్ ప్లే ఓవర్లతో పాటు చివరి ఓవర్లలో మా బౌలర్లు ఇప్పటికీ వైఫల్యం చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నెట్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న వీరు తీరా బరిలోకి దిగాక వత్తిడికి గురై తమ ప్రణాళికలను సరిగా అమలు చేయలేకపోతున్నారు. అయితే తొలి ఫైనల్‌లో కంటే రెండో ఫైనల్‌లో వీరి ప్రదర్శన మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం’ అని క్లార్క్ అన్నాడు.
ఇక శ్రీలంక జట్టు విషయానికొస్తే, ఈ సిరీస్ ఆరంభంలో వరుస వైఫల్యాలతో ఇబ్బందులు పడిన లంకేయులు ఆ తర్వాత ఆసీస్ లోపాలను చక్కగా సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఓపెనర్లు మహేల జయవర్ధనే, తిలకరత్నె దిల్షాన్ తొలి ఓవర్ల నుంచే దూకుడు స్వభావాన్ని కొనసాగిస్తుండటం శ్రీలంక జట్టుకు సత్ఫలితాలను ఇస్తోంది. మిడిలార్డర్‌లో స్థిరంగా రాణిస్తున్న యువ బ్యాట్స్‌మన్ దినేష్ చండీమల్ ఆ జట్టుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. ఇక లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్లు కూడా దూకుడుగా ఆడుతూ ఆస్ట్రేలియా బౌలర్లకు ఇప్పటికే చాలాసార్లు చుక్కలు చూపించారు. మిగిలిన మ్యాచ్‌లలోనూ వారు ఇదే జోరును కొనసాగించాలని భావిస్తున్నారు. వెన్ను గాయంతో బాధపడుతున్న ఆల్‌రౌండర్ థిసార పెరీరా స్వదేశానికి తిరిగి వెళ్లడంతో శ్రీలంక జట్టు ముందు జాగ్రత్త చర్యగా చమర కపుగెదరను తమ శిబిరంలో చేర్చుకుంది. అలాగే గాయంతో బాధపడుతున్న మరో ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ మంగళవారం నాటికి ఫిట్‌నెస్ సాధించి మళ్లీ అందుబాటులోకి వస్తాడని శ్రీలంక జట్టు భావిస్తోంది. ఏదిఏమైనప్పటికీ బ్యాటింగ్‌కు అనుకూలించే అడిలైడ్ ఓవల్ పిచ్‌పై తాము రాణించగలమని జయవర్ధనే సేన ధీమాతో ఉంది.
కామనె్వల్త్ ట్రై సిరీస్‌లో నేడు శ్రీలంకతో రెండో ఫైనల్
english title:
asis
Date:
Tuesday, March 6, 2012