* అమ్మాయి పలకరిస్తే
ఆ మైకంలో మగాళ్ళకు
గుండెల్లో గుబులు
మొదలవుతుంది.
చిన్నప్పుడు అమ్మ
స్పర్శ భయం అన్నది
లేకుండా చేస్తే
అమ్మాయి స్పర్శ
ముఖ్యంగా భుజంమీద
చేయి వేయడం, చేయి
కలపడం లాంటివి
మగాళ్ళలో విపరీతమైన
ధైర్యాన్ని
ఇవ్వడమేకాదు వాళ్ళ
చేత ఎంతటి పనైనా
అవలీలగా
చేయించగలుగుతుందట
. విపరీతమైన మానసిక
ఒత్తిడి కలిగినప్పుడు
మనకెంతో ఇష్టమైన
అమ్మతో ఓ పది
నిముషాలు మాట్లాడితే
చాలు. ఆ సమయంలో
విడుదలయ్యే
ఆక్సిటోసిన్ వత్తిడిని
తరిమికొడుతుందిట.
ఇవన్నీ పరిశోధనల్లో
వెల్లడైన నిజాలు.
* చైనాకు చెందిన
మాగ్జియోన్ అనే 102
ఏళ్ళ మహిళ
ప్రపంచంలోనే అతి
వృద్ధురాలైన విద్యార్థిగా
గిన్నిస్ బుక్‌లోకి
ఎక్కింది. చిన్నప్పుడు
ఆర్థిక ఇబ్బందులవల్ల
18 ఏళ్ళకు పెళ్లి
చేసుకొన్నాక కుటుంబ
బాధ్యతలవల్ల
చదువుకోలేకపోయింది.
ఆమెకు చదువుమీద
ఉన్న ఆసక్తిని
గమనించిన ఆమె ఆఖరి
కొడుకు 58 ఏళ్ళ
వయసున్నవాడు తన
తల్లిని స్కూల్లో
చేర్పించాడు. ఇప్పుడా
బామ్మ మురిపెంగా
పుస్తకాలు పట్టుకొని
ముసి ముసి నవ్వులు
నవ్వుకుంటూ
స్కూలుకు వెళ్లి శ్రద్ధగా
చదువుకుంటోంది.
* చైనా సంప్రదాయ
వివాహ వేడుకల్లో
వరుడు వధువు ఇంటికి
ఎర్రటి గుర్రపు బగ్గీని
పంపుతాడు.
అత్తవారింటికి
మేళతాళాలమధ్య భారీ
ఊరేగింపులో ఆ
బగ్గీమీదే కాపురానికి
వస్తుంది వధువు.
* శ్రీలంకలో విడాకుల
రేటు తక్కువే కానీ స్ర్తిల
ఆత్మహత్యలు మాత్రం
బాగా ఎక్కువ.