Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

ఆరోగ్యవంతులకు వాపులు వస్తాయా?

Image may be NSFW.
Clik here to view.

ఒంట్లో నీరు 70-80

శాతం వరకూ

ఉంటుంది. ఇది

ద్రవరూపంలో వుండే

రక్తం, ప్లాస్మా, లింఫు,

జీర్ణసాయలు లివరులోని

పిత్తరసం, క్లోమం

(స్ఫ్లీను)లోని రసం,

మెదడులో ప్రవహించే

సి.ఎస్.ఎఫ్

(సెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్)

ఎండోక్రెయిన్

గ్రంధులలోని రసాల

రూపంలో వుంటుంది.

రక్తం తమ నాళాల్లో

వడివడిగా ప్రవహి,స్తూనే

చుట్టూరా వుండే

టిస్యూలకు కొంచెం

కొంచెంగా ఉప్పు నీరు,

గ్లూకోజు సరఫరా చేస్తూ

వుంటుంది. రక్తం

చిక్కన పలుచన

అయినపుడు ఈ

సరఫరా మారి చుట్టూ

వున్న అవయవాల్లో

నీరు నిల్వ

వుండిపోతుంది (టిస్యూ

ఇడీమా). అవయవాలు

వాటిలోని గ్లాని

పదార్థాలు రక్తంలోకి

పంపిస్తాయి. వాటిని

కిడ్నీల ద్వారాను,

చర్మం ద్వారాను,

ఊపిరితిత్తుల ద్వారాను

శరీరం విసర్జిస్తుంది. ఈ

క్రమంలో ఏదిసరిగా

పనిచేయకపోయినా

శరీరంలో నీరు నిలవ

అయిపోయి కాళ్లు

చేతులు ముఖం

ఉబ్బిపోయి నొక్కితే

సొట్టలు పడుతూ

వుంటాయి. కాళ్లలో

ముఖ్యంగా మడిమ

నొక్కితే సొట్టపడిందంటే

శరీరంలో 5-6 లీటర్ల

నీరు

నిల్చిపోయిందన్నమాట

.
కాబట్టి వాపులు వచ్చిన

వెంటనే తీసుకోవలసిన

జాగ్రత్తలు కొన్ని- శరీర

శ్రమ తగ్గించుకోవడం,

వాపులకు కారణాలు

అనే్వషించడం.

మొదటిగా రక్తంలో

హిమోగ్లోబిను, ఐరను,

ప్రొటీను ఎంత శాతం

వున్నాయో

తెలుసుకోవాలి.

రక్తహీనత ప్రొటీన్

(మాంసకృత్తులు)

తక్కువ ముఖ్యకారణం.

తరువాత కిడ్నీకి

సంబంధించిన వ్యాధి

కనుక్కోవడం-

ఎలాగంటే రక్తంలోని

క్రియాటినిన్,

యూరియా లెవెల్స్

తెలుసుకోవాలి. ఇవి

ఎక్కువగా వుంటే

వెంటనే కిడ్నీ

నిపుణుల్ని

సంప్రదించాలి.

రక్తహీనత 8 గ్రాముల

కంటే తక్కువైతే రక్తం

ఎక్కించిగాని ఐరను

ఇంజెక్షన్ల ద్వారాగాని

చికిత్స చేయాలి.

తర్వాత రక్తహీనత

ఎందువల్ల

సంభవించిందో ఆ

కారణానికి చికిత్స

జరగాలి. లేకపోతే చిల్లి

గినె్నలో నీరు

నింపినట్లే. స్ర్తిలలో ప్రసవ

సమయంలోగాని

నెలసరిలోగాని అధిక

రక్తస్రావం జరుగవచ్చు.

లేక ఎవరికైనా ప్రేగులలో

అమీబా లేక

నులిపురుగులు కొంకి

పురుగులు (హుక్

వార్మ్స్) ఉండవచ్చు.

దీనికి మంచి

మందులున్నాయి.

కనుక చికిత్స సులభం.
ఇంకా కొన్ని కేసులలో

లివరు వ్యాధివల్ల

జలోదరం వచ్చి దానితో

కాళ్లవాపులు వస్తాయి.

అయితే లివరు వ్యాధితో

వచ్చే వాపులు

ముఖానికి చేతులకి

ఉండవు. పొట్ట కాళ్లు

బాగా ఉబ్బిపోతాయి.
ఇంకొక ముఖ్యమైన

కారణం స్ర్తిలలో వచ్చే

ఓవేరియన్ కంతులు.

ఇవి మామూలు

కంతులైనా కావచ్చు,

కాన్సరు గడ్డలైనా

కావచ్చు. కాన్సరు

కంతులు చాలా చిన్న

సైజులోనే వాపులు

కలుగజేస్తాయి. ఈ

విషయం అల్ట్రాసౌండ్

లేక సిటిస్కాన్ ద్వారా

రూఢి చేసుకుని వెంటనే

తగు చికిత్స

చేయించాలి.

దోమకాటువల్ల వచ్చే

ఫైలేరియావల్లకూడా

వాపులు రావచ్చు.
మరికొంతమందిలో

హార్టుకి సంబంధించిన

వ్యాధులు కారణం

అవుతాయి వాపులకు.

అయితే ఇందులో వాపు

కంటే ముందు లక్షణాలు

ఆయాసం గుండె దడ

లాంటివి

ప్రారంభమవుతాయి.

కాబట్టి పరీక్షలు ఆ

దిశగా చేయాలి. ఏ

సమస్యవల్ల వాపులు

వస్తున్నాయో ఆ

సమస్య గుర్తించడం

ముఖ్యం కాని వాపులు

తగ్గే మందులు కావు.

*

ప్రశ్న - జవాబు

పి.సాయిలీల, నెల్లూరు
నా వయస్సు 20

సంవత్సరాలు. పొడవు

5 అడుగుల 2

అంగుళాలు, బరువు

86 కేజీలు. ఎంత

ఎక్స్‌ర్‌సైజు చేసినా

బరువు తగ్గడంలేదు.

ఎందుకని? నాకు తగ్గే

ఉపాయం చెప్పండి.

అవహేళన

భరించలేకపోతున్నాను.
జ: ఈ మధ్యకాలంలో

చాలామంది

బాలబాలికలు, చిన్న

వయసు వారు

స్థూలకాయంతో

కనిపిస్తున్నారు. దీనికి

ముఖ్య కారణం ఆహార

నియమాలు

అతిక్రమించడం, తగిన

శరీర వ్యాయామం

లేకపోవడం, తినే

పదార్థాలు

కలుషితమైనవి

కావడం. మిగతా

హార్మోనులు కారణం

కాకపోతే పద్ధతైన

వ్యాయామం, తిండి

సమయాల్లో నియమం,

కొవ్వు పదార్థాలు

మానేయడం మంచిది.

వరి అన్నం మాని

గోధుమ రొట్టెలు, పళ్లు,

పచ్చికూరగాయలు

వాడుకోవాలి. ఏదైనా

జిమ్‌లో చేరండి. నెలకి

3 - 4 కిలోల కంటే

ఎక్కువ తగ్గితే

మంచిదికాదు. రోజు

వాకింగ్, స్కిప్పింగ్

చేయండి. చుట్టు

పక్కలవారి మాటలు మీ

పట్టుదలను ఇంకా

పెంచాలి.
*

ఆరోగ్య సమస్యలు,

సందేహాలు పంపాల్సిన

చిరునామా:
డాక్టర్ కేతరాజు సరోజినీ

దేవి,
హబ్సిగూడ పాలీ క్లినిక్

అండ్ నర్సింగ్ హోం,
ఇంటి నెం. 1-2-98,

కాకతీయనగర్ కాలనీ,
హబ్సిగూడ,

హైదరాబాద్- 500

007.
ఫోన్ నెం. 040-

2717 0468

(క్లినిక్),
040- 2717

0246 (ఇల్లు)

ఒంట్లో నీరు 70-80 శాతం వరకూ ఉంటుంది
english title: 
swelling
author: 
డాక్టర్ కేతరాజు సరోజినీ దేవి

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles