‘‘కోతులు
పుట్టేదెందుకురా?’’
అంటే ‘‘కొమ్మలు
విరిచేటందుకురా!’’
అన్నారు గానీ- ‘‘డైనింగ్
టేబిల్స్ మీదికి మెరుపు
దాడులు
చేసేటందుకురా!’’ అని
అనలేదుగా!
ఢిల్లీ నుంచి హైదరాబాద్
దాకా ఏ సిటీ చూసినా
మర్కట వల్లభుల
వీరంగం చూడ
భయంగానే
వుంటున్నది.
న్యూఢిల్లీలో ప్రభుత్వ
కచేరీల మీద- ఆఫీసు
బిల్డింగ్‌లమీదా కోతుల
దండు చేసే దాడులకు
నిత్యనూతనోపాయాలను
గవర్నమెంటు తీరిక
చేసుకుని ఆలోచిస్తూనే
ఉన్నది.
అరటిపండ్లను మింగి,
తొక్కలను మన
మొహాన విసిరేసే
కోతుల్ని ఎరుగుదుం
కానీ, యిటీవల అవి-
కేబిల్స్‌నీ, టెలిఫోన్
తీగల్నీ కొరికేస్తున్నాయ్.
ఏమరుపాటునవుంటే
టెర్రస్‌లమీదనుంచి-
అమ్మాయిల చేతుల్లోని
మొబైల్స్‌ని ‘హుష్ కాకి’
చేసేస్తున్నాయ్. దీంతో
కోతులు పట్టేవారికి
రుూ వానరసేన లొంగి
రాదు అన్న
నిర్ణయానికొచ్చేసింది
అధికార గణం.
వన్యమృగ
సంరక్షణాధికారులతో,
రీసెర్చి సైంటిస్టులతో-
యిట్లా అందరితో-
తలలు ఏకం చేసి-
వానర మూకల బెడద
గురించి
నివారణోపాయాల
గురించి తెగ పథకాలు
వేశారు.
కాలిఫోర్నియా
(అమెరికా)లోని
సైంటిస్టులతో
సంప్రదింపులు
జరిపారు. ‘‘కుటుంబ
నియంత్రణ ఆపరేషన్లు
చేయండి! వీటికి.
వాటిచేత సంతాన
నిరోధక మాత్రలు
మింగించండి’’ అంటూ
సలహాలిచ్చారు వాళ్లు.
‘‘కోతుల్ని పట్టాలి’’
శస్తచ్రికిత్సలు చేయాలి
వాటికి. మళ్లీ భద్రంగా
వదిలిపెట్టాలి. అవి
దొంగతనంగా తినే
పదార్థాలలో గర్భనిరోధక
మాత్రల్ని కలిపి పెట్టాలి
అన్నది ప్లాను.
ఉత్తరాఖండ్‌లో
హిమాలయ పాదాల
చెంతగల మెయిన్
రోడ్లలో కోతుల
దాడులు- రాస్తారోకోలు-
దారంట ధర్నాలు-
యివన్నీ తట్టుకోలేక-
అక్కడ రుూ కు.ని.ఆ.
పద్ధతులకి సీరియస్‌గా
ప్రయత్నించారు గానీ-
ఒకవేళ ‘‘రుూ
మందులవల్ల కోతులకు
‘పిచ్చి’లాంటి రియాక్షన్లు
వస్తే ఎట్లా?’’ అన్నది
మరో ప్రశ్న.
కోతుల దాడిలో
2007లో న్యూఢిల్లీ
నగర డిప్యూటీ మేయర్
ప్రాణాలు కోల్పోయాడు.
అతణ్ని బాల్కనీమీంచి
క్రిందికి తోసేశాయిట
కోతులు! తస్మాత్
జాగ్రత్త!
*