ఎండుకాయ కొబ్బరి తురుము - 2 కప్పులు
పల్లీలు - 1/2 కప్పు
కండెన్స్ మిల్క్ - 400 గ్రా.
పంచదార - 1 కప్పు
పాలపొడి - 4 టీ.స్పూ.
నెయ్యి- 2 టీ.స్పూ.
వెనిలా ఎసెన్స్ - 1/2 టీ.స్పూ.
ఇలా చేయాలి
చదరంగా ఉండే ప్లేటు లేదా టిన్నుకు లోపలి వైపు నెయ్యి రాసి పెట్టుకోవాలి. పాన్ వేడిచేసి పల్లీలు దోరగా వేయించి చల్లారిన తర్వాత పొట్టు తీసి బరకగా పొడి చేసుకోవాలి. మందపాటి గినె్న లేదా పాన్‌లో కొబ్బరి తురుము, పంచదార, పాలపొడి, కండెన్స్ మిల్క్ కలిపి చిన్న మంటమీద నిదానంగా ఉడికించాలి. ఇది మాడకుండా కలుపుతూ ఉండాలి. కాస్త చిక్కబడ్డాక పల్లీల పొడి వేసి కలుపుతూ ఉండాలి. మిశ్రమం బాగా ఉడికి అంచులు వదులుతున్నప్పుడు దింపి నెయ్యి రాసిన టిన్ను లేదా పళ్లెంలో వేసి సమానంగా పరవాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత డబ్బాలో వేసి పెట్టుకోవాలి.
ఎండుకాయ కొబ్బరి తురుము - 2 కప్పులు
english title:
palli, kobbari
Date:
Sunday, November 24, 2013