కారప్పూస - 1 కప్పు
బూందీ - 1 కప్పు
అటుకులు - 1 కప్పు
పల్లీలు - 1/4 కప్పు
కరివేపాకు - 4 రెబ్బలు
పసుపు - 1/4 టీ.స్పూ.
కారంపొడి - 1 టీ.స్పూ.
గరం మసాలా పొడి - 1 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
పంచదార - 1 టీ.స్పూ.
నూనె - వేయించడానికి
ఇలా చేద్దాం
సెనగపిండిలో తగినంత ఉప్పు వేసి బూంది, కారప్పూస చేసుకోవచ్చు లేదా కొన్నది ఉంటే ఇంకా త్వరగా ఈ మిక్చర్ తయారుచేసుకోవచ్చు. నూనె వేడి చేసి లావుగా వుండే అటుకులు వేయించి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు, పల్లీలు కూడా దోరగా వేయించుకోవాలి. ఒక గినె్నలో కారప్పూస, బూందీ, వేయించిన పల్లీలు, కరివేపాకు, అటుకులు వేసి వాటికి తగినంత ఉప్పు, కారం పొడి, పసుపు, గరం మసాలా పొడి, పంచదార వేసి బాగా కలపాలి. పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో వేసి పెట్టుకుంటే ఐదారు రోజులు నిలవ ఉంటుంది. అతిథులు రాగానే స్వీటుతో పాటు ఈ మిక్చర్ సర్వ్ చేస్తే సరి.
కారప్పూస - 1 కప్పు
english title:
all in one mixture
Date:
Sunday, November 24, 2013