గుంటూరు, నవంబర్ 23: గుంటూరు జిల్లా చేబ్రోలులో శనివారం వేకువఝామున 4గంటల సమయంలో నేల టపాకాయల తయారీకి వినియోగించే మందు పేలడంతో భారీ విస్ఫోటనం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వాసిరెడ్డి కోటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో రహస్యంగా, ఎలాంటి అనుమతులు లేకుండా నేల టపాకాయలు తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారైన నేల టపాకాయలు హైదరాబాద్, చెన్నై, కర్ణాటక, కోయంబత్తూర్ వంటి పట్టణాలకు ఎగుమతి అవుతాయి. శనివారం వేకువఝామున టపాకాయల తయారీకి వినియోగించే గంధకం, పొటాష్, భాస్వరం మిశ్రమం మంటలు రేగి పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. ఇంటిలో నిద్రిస్తున్న వృద్ధురాలు వాసిరెడ్డి రాజేశ్వరి మృతిచెందగా కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు నుండి క్లూస్‌టీం, డాగ్, బాంబ్ స్క్వాడ్ వచ్చి 11రకాల మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అర్బన్ ఎస్పీ జెట్టి గోపీనాథ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇళ్ల మధ్య ప్రాణంతకమైన నేల టపాకాయలు తయారుచేస్తుంటే ఏంచేస్తున్నారని గుంటూరు సౌత్ డిఎస్పీ జోసఫ్ రాజ్‌కుమార్, చేబ్రోలు సిఐ పూర్ణచంద్రరావుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తయారీదారులను గ్రామ బహిష్కరణ చేస్తామని, ఈవిషయమై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకుంటామని అర్బన్ ఎస్పీ చెప్పారు.
గుంటూరు జిల్లా చేబ్రోలులో శనివారం వేకువఝామున 4గంటల సమయంలో నేల
english title:
old woman dies
Date:
Sunday, November 24, 2013