అడిలైడ్, నవంబర్ 6: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్ల జాతీయుల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం దశాబ్దాలపాటు కృషి చేసిన పోరాట యోధుడు నెల్సన్ మండేలా మృతి పట్ల క్రీడా లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. యాషెస్ సిరీస్ రెండో టెస్టు, రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు మండేలా మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు వౌనం పాటించారు. మ్యాచ్ చూసేందుకు హాజరైన ప్రేక్షకులు కూడా వారితో పాలుపంచుకున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్, ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్, ఇరు జట్ల క్రీడాకారులు మండేలాను అసాధారణ యోధుడిగా అభివర్ణించారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అధ్యక్షుడు అలాన్ ఇసాక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ వేర్వేరు ప్రకటనల్లో మండేలా మృతికి సంతాపం ప్రకటించారు. క్రీడాల పట్ల ఆయనకు ఉన్న మక్కువను గుర్తుచేసుకున్నారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ తన ప్రకటనలో ‘ఒక గొప్ప మానవతావాది అస్తమించాడు’ అని వ్యాఖ్యానించాడు. మానవత్వ విలువలను, క్షమాగుణాన్ని ప్రపంచానికి నేర్పిన గొప్ప తత్వవేత్తగా మండేలాను ‘బాక్సింగ్ లెజెండ్’ మహమ్మద్ అలీ అభివర్ణించాడు. జాత్యహంకారానికి వ్యతిరేకంగా మండేలా జరిపిన శాంతియుత పోరాటం ప్రపంచ దేశాలకు మార్గదర్శకమని పేర్కొన్నాడు. ‘మడిబా’గా అభిమానులు పిలుచుకునే మండేలా ఇక లేడన్న వార్తను జీర్ణించుకోవడం కష్టమని అన్నాడు. ప్రపంచ నంబర్‌వన్ గోల్ఫర్ టైగర్ ఉడ్స్ తాను 1998లో మండేలాతో కలిసి విందు చేసిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. క్రీడల పట్ల ఆయనకు ఆసక్తి ఉండేదని, క్రీడాకారులను ఎంతో గౌరవించేవాడని ఉడ్స్ తన ప్రకటనలో తెలిపాడు. దక్షిణాఫ్రికా గోల్ఫర్ గారీ ప్లేయర్ కూడా మండేలా మృతి పట్ల విచారం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా జాతిపిత తిరిగిరాని లోకాలకు వెళ్లాడన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పాడు. మండేలా తనకు మార్గదర్శకుడని, అతని స్ఫూర్తితోనే తాను జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని బ్రెజిల్ సాకర్ లెజెండ్ పీలే అన్నడు. సాకర్ అంటే మండేలాకు ఎంతో ఇష్టమని అతను పేర్కొన్నాడు.
......................................................
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు మండేలా మృతికి
సంతాప సూచకంగా రెండు నిమిషాలు వౌనం పాటిస్తున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు.
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్ల జాతీయుల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం
english title:
d
Date:
Saturday, December 7, 2013