హైదరాబాద్, డిసెంబర్ 12: రాష్ట్ర విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లు అసెంబ్లీ, కౌన్సిల్‌కు చేరుకోనున్న సమయంలో వ్యూహ, ప్రతివ్యూహాలకు తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు గురువారం వేర్వేరుగా భేటీ అయ్యారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు సమావేశమై మంతనాలు జరిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మంత్రులు డికె అరుణ, జానారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కవిత తదితరులు హాజరయ్యారు. టి.బిల్లు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అప్రమత్తంగా ఉండాలన్న ఉద్దేశంతో సమావేశాన్ని నిర్వహించినట్లు చెప్పారు. టి.బిల్లుపై అసెంబ్లీ, కౌన్సిల్‌లో సభ్యుల అభిప్రాయాలనే పంపించాలని, తీర్మానం, ఓటింగ్ అవసరం లేదని మంత్రి డికె అరుణ తెలిపారు. కాగా సీమాంధ్ర మంత్రి శైలజానాథ్ అధ్యక్షతన అసెంబ్లీ ఆవరణలోని సిఎల్‌పి కార్యాలయంలో సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గాదె వెంకట రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, రాంభూపాల్ రెడ్డి, మల్లాది విష్ణు, కమలమ్మ తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీలో టి. బిల్లును ప్రతిపాదించినా, సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టాలని భావించారు. సమావేశానంతరం గాదె వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ రూల్స్ 77, 78 ప్రకారం తీర్మానం చేయాలని స్పీకర్‌ను కోరుతూ నోటీసు అందజేసినట్లు చెప్పారు.
సిఎంతో మంత్రుల భేటీ..
ఇలాఉండగా రాష్ట్రానికి చేరుకున్నదని తెలుసుకున్న వెంటనే మంత్రులు గంటా శ్రీనివాసరావు, పార్థసారథి, శైలజానాథ్, అహ్మదుల్లా, ఎమ్మెల్యే జెసి దివాకర్‌రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలుసుకుని చర్చించారు. సమైక్య తీర్మానం కోసమే పట్టుబట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
బిఎసిలో చర్చించాకే..
మంత్రి శ్రీ్ధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ టి.బిల్లుపై ఏయే పార్టీలకు ఎంత సమయం కేటాయించాలనేది బిఎసిలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.
సమైక్యం కోసం అసెంబ్లీలో తీర్మానం: సీమాంధ్ర కాంగ్రెస్ బిల్లు నేపథ్యంలో మరింత అప్రమత్తం: టి. కాంగ్రెస్
english title:
bheti
Date:
Friday, December 13, 2013