హైదరాబాద్, డిసెంబర్ 13: ఆసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు ఆమోదం పొందక ముందే సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అసెంబ్లీలో సమైక్య తీర్మానానికి పట్టుపడతామని చెప్పారు. నవంబర్‌లో తమ పార్టీ చెప్పినట్లుగా అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి ముందే సమైక్య తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పైకి సమైక్యవాదిగా నటిస్తూ విభజన ప్రతీ దశలోనే అధిష్ఠానానికి సహకరిస్తున్నారని విమర్శించారు. అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా విభజనలో సోనియా గాంధీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు. వైసిపి సమైక్యవాదానికే కట్టుబడి ఉందని అందులో ఎలాంటి మార్పులేదని వారు స్పష్టం చేశారు.
ఆసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు
english title:
draft bill
Date:
Saturday, December 14, 2013