విజయవాడ, డిసెంబర్ 13: ఇంద్రకీలాద్రిపై ఈ నెల 23 నుండి 27 వరకు జరుగనున్న భవానీల దీక్ష విరమణకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో క్యూలైన్లలో జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు భక్తులు దుర్మరణం పాలైన ఘటనను దృష్టిలో ఉంచుకుని పక్కాగా క్యూలైన్లను ఏర్పాటు చేయటంతోపాటు దీక్షల విరమణ చేసే ఐదు రోజులూ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్‌ను పూర్తిగా మళ్లించాలని శుక్రవారం వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఎం. రఘునందనరావు, పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు నిర్ణయించారు. కనీసం ఏడు లక్షల మంది రాష్ట్రం నలుమూలల నుంచి తరలిరాగలరని భావిస్తున్నారు. ఆయా రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న అమ్మ ప్రసాదం అందరికీ అందేలా కనీసం 14 లక్షల లడ్డూలలు సిద్ధం చేస్తున్నారు.
భవానీల దీక్ష విరమణకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు
english title:
deeksha
Date:
Saturday, December 14, 2013