Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

టి.బిల్లు ప్రతులు దగ్ధం

$
0
0

అనంతపురం , డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా సోమవారం నిరసనలు మిన్నంటాయి. టిడిపి, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో టి.బిల్లు ప్రతులను దగ్ధం చేశారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పలు జెఎసి నాయకులు పిలుపునిచ్చారు. ఎస్కేయూ జెఎసి నాయకులు 72 గంటల జాతీయ రహదారి దిగ్బందనం, తరగతుల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్కేయూ వద్ద జాతీయ రహదారిపై టి.బిల్లు పత్రులను దగ్ధం చేశారు. అనంతరం జాతీయ రహదారిని దిగ్బంధించారు. తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా టి.బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారని నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఎస్కే యూ జెఎసి కన్వీనర్ సదాశివరెడ్డి మాట్లాడుతూ విభజనను ఒక పద్దతి ప్రకారం చేయకుండా దొడ్డిదారిన అసెంబ్లీలో ప్రవేశపెట్టారని ఆరోపించారు. టి.బిల్లుపై అసెంబ్లీలో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు మాట్లాకుండా ఉండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాలను వెంటనే ముగించాలని డిమాండ్ చేశారు. తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్రాన్ని విభజించకూడదన్నారు. తెలంగాణ బిల్లును తక్షణమే అసెంబ్లీ నుండి వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతంర చేస్తామని తెలిపారు. ఇందుకు జిల్లాలోని అన్ని జెఎసి నాయకులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు కలసి రావాలాని కోరారు.
విభజన బిల్లు అప్రజాస్వామికం- టిడిపి
అనంతపురం కల్చరల్ : ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టినతీరు అప్రజాస్వామికమని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అసెంబ్లీలో విభజన బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం నగరంలోని టవర్‌క్లాక్ సర్కిల్‌లో టిబిల్లు ప్రతులను టిడిపి నేతలు తగులబెట్టి నిరసన తెలిపారు. ఈసందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ బిఎసిని సమావేశపరచి, తెలియపరచకనే అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే విధంగా ఉందన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ బిల్లును ప్రవేశపెట్టారని, దీన్నితాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు బిల్లును అడ్డుకుంటారన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌వద్ద, తెలంగాణ ఎమ్మెల్యేలు దౌర్జన్యంగా వ్యవహరించడాన్ని ఆయన ఖండించారు. సీమాంధ్రకు చెందిన మంత్రులు దీన్ని అడ్డుకోకపోడం సిగ్గుచేటన్నారు. ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు మహలక్ష్మి శ్రీనివాస్, వెంకటరాముడు, నదీమ్ అహ్మద్, జకీవుల్లా, ఆదినారాయణ, నారాయణస్వామియాదవ్, బుగ్గయ్య చౌదరి, మణికంఠబాబు, కృష్ణకుమార్, సరిపూటిరమణ, వెంకటప్ప, వీరా తదితరులు పాల్గొన్నారు.
పరిశోధనలకు చేయూత
* జెఎన్‌టియూ 5వ స్నాతకోత్సవంలో విసి లాల్‌కిషోర్
అనంతపురం సిటీ, డిసెంబర్ 16: జెఎన్‌టియూలో పరిశోధనలకు చేయూతనిస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య కె.లాల్‌కిషోర్ పేర్కొన్నారు. జెఎన్‌టియూ అనంతపురం 5వ స్నాతకోత్సవాన్ని సోమవారం జెఎన్‌టియూ పరిపాలన భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్‌డిఓ రక్షణ సలహాదారు అవినాష్‌చందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విసి లాల్‌కిషోర్ మాట్లాడుతూ జెఎన్‌టియూను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. యూనివర్సిటీ పరిధిలో 194 కాలేజిల్లో 118 ఇంజనీరింగ్, 36 ఫార్మసీ, 35 పిజి కాలేజిలు, 5 ఇంటిగ్రేటేడ్ క్యాంపస్‌లతో జెఎన్‌టియూ అభివృద్ధి సాధిస్తున్నదని తెలిపారు. బి.టెక్‌లో 14 కోర్సులు, పిజిలో 69 స్పెషలైజేషన్స్, ఎంసిఎ, ఎంబిఎ, ఎంఎస్సీ కోర్సులు ఉన్నాయన్నారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆర్డీటీ సహకారంతో 3వేల చెట్లును నాటించి పచ్చదానాన్ని అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. సోలార్ ద్వారా విద్యుత్ తయారీకీ యూనివర్సిటీ పరిపాలన భవనంపై సోలార్‌ను బిగించి యూనివర్సిటీకి విద్యుత్‌ను వినియోగిస్తున్నామని తెలిపారు. జెఎన్‌టియూ పరిధిలోని కాలేజిల్లో 2,07,900మంది ఇంజనీరింగ్, 11,825 బి-్ఫర్మా, 900్ఫర్మా-డి, 11,292 ఎంసిఎ, 23,760 ఎంబిఎ, 12,597 ఎం.టెక్, 45,48 ఎం.్ఫర్మా, 79 ఎంయస్సీ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలకు అనుభవజ్ఞులైన ఆచార్యులు ఉన్నారని తెలిపారు. ప్రైవెటు కళాశాలల్లో కూడా పరిశోధనలను ప్రారంభించి పరిశోధనలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయంలోని అన్ని పరీక్షల నిర్వహణకు ప్రత్యేక సాప్ట్‌వేర్ ద్వారా పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. యూనవిర్సిటీ పరిధిలోని విద్యార్థులకు రాజీవ్ యువకిరణాల ద్వారా బహుళ జాతీయ కంపెనీలలో ఉద్యోగాలు పొందేలా చేస్తున్నామని తెలిపారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలకు ప్రయోగశాలలను, పరికరాలను అభివృద్ధి చేశామని తెలిపారు. పాత విద్యార్థుల అల్యూమిని ద్వారా జెఎన్‌టియూ కళాశాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్ర స్థాయి యూత్ ఫెస్టివల్‌లో రెండవ స్థానం సాధించిమన్నారు. యూనివర్సిటీ ఆచార్యులకు వివిధ బోర్టుల నుండి అనేక అవార్డులు అందుకున్నారని తెలిపారు. యుజిసి నుండి కోట్ల రూపాయల నిధులతో యూనివర్సిటీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ అభివృద్ధికి సహకరిస్తున్న ఆచార్యులకు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జెఎన్‌టియూ రెక్టార్ ఆచార్య సుదర్శన్‌రావు, రిజిష్టర్ ఆచార్య హేమచంద్రారెడ్డి, డైరెక్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు
పవర్‌లూమ్స్‌కు అడ్డుకట్ట..
* కలెక్టర్ లోకేష్‌కుమార్
ధర్మవరం అర్బన్, డిసెంబర్ 16: ధర్మవరం తదితర ప్రాం తాల్లో పవర్‌లూమ్స్ చీరలను చేనేత చీరలుగా మార్చి జరుగుతున్న విక్రయాలపై పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక ఆర్‌డిఓ సభా భవనంలో జరిగిన గ్రీవెన్స్‌డే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రిజర్వేషన్ చట్టంలోని కొన్ని లొసుగుల వల్ల పవర్‌లూమ్స్‌లో తయారైన చీరలను చేనేత చీరలుగా విక్రయిస్తూ ఇటు వ్యాట్‌కు, టాక్స్‌కు పలువురు గండికొడుతున్నారన్నారు. ముఖ్యంగా జిల్లాలో కొన్ని ప్రాంతాలలో మాత్రం పవర్‌లూమ్స్ వుండగా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుండి విశేషంగా పవర్‌లూమ్ చీరలు రవాణా అవుతున్నాయని, అందువల్ల వీటి నియంత్రణకు కమర్షియల్ టాక్స్ వారి సహకారంతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్, టాక్స్ అధికారులతో పాటు పోలీసుల బృందాలు హైదరాబాద్ నుండి పవర్‌లూమ్స్ చీరలపై ఆకస్మిక దాడులు నిర్వహించి అక్కడికక్కడే పవర్‌లూమ్స్ చీరలను నిర్ణయిస్తారన్నారు. ఈ చీరలకు టాక్స్ మినహాయింపు కలిగివుంటే వారితో టాక్స్ 4శాతం వసూలు చేస్తూ అపరాధ రుసం కూడా వసూలు చేస్తారని తెలిపారు. అలా గే గత ఏడాది, ఈ ఏడాది టర్నోవర్‌ను పరిశీలించి టాక్స్, జరిమానా వసూలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని హిందూపురం, ముదిరెడ్డిపల్లి, సోమందేపల్లి ప్రాంతలలో పవర్‌లూమ్స్‌పై తనిఖీలు చేస్తున్నా సరైన ప్రయోజనం చేకూరలేదన్నారు. అలాగే 51యాక్ట్ మేరకు బోగస్ సొసైటీలపై విచారణ వేసినా ఆడిట్ జరుగుతున్నందున జాప్యం జరిగిందన్నారు. ఆడిట్ పూర్తి కాగానే విచారణ కొనసాగుతుందని తెలిపారు. హౌసింగ్ ఆరోపణలపై కలెక్టర్ మాట్లాడుతూ వీటిపై ప్రాథమిక విచారణ, అందుకు సంబంధించిన నివేదిక అందిందని, త్వరలో కమిటీని వేసి విచారణ చేయిస్తామన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ అందగానే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వీవర్స్ క్రెడిట్ కార్డులపై రుణాలందడం లేదన్న ప్రశ్నకు కలెక్టర్ బదులిస్తూ రుణాలు తీసుకున్నవారు చెల్లించాల్సిన 2, 3కంతులు చెల్లించకపోవడంతో రెండవ విడత రుణాలిచ్చేందుకు బ్యాంకు ముందుకు రావడం లేదని, రుణాల మాఫీ జరుగుతుందని పలువురు చేనేతలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని, వెంటనే రుణాలు చెల్లిస్తే రెండవ విడత కింద రూ. 50వేలు పొందవచ్చునన్నారు. కావున చేనేతలు సహకరించి బకాయిలు చెల్లించి తిరిగి రుణాలు పొందాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని యాడికి, పెద్దపప్పూరు, హిందూపురం ప్రాంతాల్లో చేనేతలు 98శాతం రుణాలు చెల్లించారని, ధర్మవరంలో మాత్రమే ఈ పరిస్థితి వుందన్నారు. పట్టణంలో 4వేల మంది నేతన్నలకు రుణాలందించాల్సి వున్నందున పరిస్థితి గమనించి బకాయిలు చెల్లించి, తిరిగి రుణాలు పొందేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జెసి సత్యనారాయణ పాల్గొన్నారు.
23న రాష్టప్రతి పుట్టపర్తి రాక
పుట్టపర్తి, డిసెంబర్ 16: రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ ఈ నెల 23న పుట్టపర్తి రానున్నట్లు జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన పుట్టపర్తిలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్టప్రతి ఈ నెల 23వ తేదీ ఉదయం హైదరాబాద్‌లో ప్రత్యేక విమానంలో బయల్దేరి 11:40 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి ప్రశాంతి నిలయం చేరుకుని సాయి కుల్వంత్ హాల్‌లోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. అనం తరం ప్రత్యేక హెలికాప్టర్‌లో అనంతపురం చేరుకుని, నీలం సంజీవరెడ్డి శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ వెళ్తారు.
వివాహిత ఆత్మహత్య
* జీర్ణించుకోలేక భర్త ఆత్మహత్యాయత్నం
నార్పల, డిసెంబర్ 16 : సంతానలేమి కారణంగా భార్య ఆత్మహత్యకు పాల్పడగా, విషయం తెలుసుకున్న భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం నార్పలలో జరిగింది. ముందుగా భార్య ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఆ విషయం తెలిసిన భర్త బజారులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనకు సంబందించి నార్పల పోలీసులు తెలిపిన వివరాల మేరకు నార్పలలోని ఓరుగుమెడ స్వామి కాలనిలో నివాస ముంటున్న పానిపూరి వ్యాపారం చేసే పెద్దన్న అతని భార్య ధనలక్ష్మి (26) సోమవారం సంతానం లేదన్న కారణంగా ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటనలో భార్య ధనలక్ష్మి మరణించగా భర్త పెద్దన్న అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు. పెద్దన్న ధనలక్ష్మి దంపతులకు పిల్లలు లేరు. గత ఏడు సంవత్సరాల కిందట నార్పలకు చెందిన పెద్దన్నకు శింగనమల మండలం చిన్నమట్లగొంది గ్రామానికి చెందిన ధనలక్ష్మినిచ్చి పెళ్లి చేశారు. పెద్దన్నకు నార్పలలో ఇల్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నారు. ధనలక్ష్మి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్పల పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నార్పల ఎస్‌ఐ ఎన్. శేఖర్ తెలిపారు.
రుణభారంతో యువ రైతు ఆత్మహత్య
వజ్రకరూరు, డిసెంబర్ 16: మండల పరిధిలోని కొనకొండ్ల గ్రామానికి చెంది న రైతు చింతలయ్య (32) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులు తెలిపిన వివరాలు.. చింతలయ్య రోజూ వారి పనుల్లో భాగంగానే సోమవారం కూడా పొలం పనులకు వెళ్లాడన్నారు. అయితే ఎంతకూ ఇంటికి రాకపోవడంతో పొలానికి వెళ్లి చూడగా శవమై కనిపించాడని తెలిపారు. ఈ సందర్భంగా బంధువులు మాట్లాడుతూ చింతలయ్య పంట సాగు కోసం దాదాపు రూ. 2 లక్షలు అప్పు చేశాడని, అయితే పంట దిగుబడి చేతికందకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని తెలిపారు. రైతు మృతిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నాణ్యతలో రాజీ పడేది లేదు
* క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజినీర్ క్షేత్రపాల్
పుట్టపర్తి, డిసెంబర్ 16: హంద్రీనీవా కాలువ నిర్మాణంలో ఎలాంటి లోపాలు దొర్లినా రికవరీ చేస్తామని క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ క్షేత్రపాల్ తెలిపారు. సోమవారం మారాల, గొల్లపల్లి రిజర్వాయర్ల 12 ప్యాకేజీలోని టనె్నల్ పనులను, గోనిపల్లి వద్ద మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ తదితర పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం చేపట్టిన పనులు సంతృప్తికరంగానే ఉన్నాయన్నారు. టనె్నల్ 20 మీటర్లు పడిపోయిందని, దాన్ని తిరిగి నిర్మించేందుకు చర్యలు తీసుకొంటామన్నారు. మారాల రిజర్వాయర్ కింద సాగు ఆయకట్టు పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్ బిల్లు నుండి రికవరీ చేస్తామని తెలిపారు. ఆయన వెంట హంద్రీనీవా క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఇ వరదరాజులు, ఇఇ సూర్యనారాయణ, డిఇ కృష్ణారెడ్డి, విశ్వనాథం, థర్డ్ పార్టీ కంట్రోల్ డిఇ లోకేష్, ఎఇ రమేష్ ఉన్నారు.
రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్న
పార్టీలకు బుద్ధి చెప్పండి
* వైకాపా నేత రవీంద్రనాథ్‌రెడ్డి
మడకశిర, డిసెంబర్ 16: అమరజీవి పొట్టిశ్రీరాములు ప్రాణ త్యాగం ఫలితంగా ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయ ప్రయోజనా ల కోసం చిన్నాభిన్నం చేస్తోందని, అలాంటి పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కడప మాజీమేయర్, వైకాపా నేత రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక అమరాపురం బస్టాండ్‌లో సోమవారం సమైక్య శంఖారావ సభ నిర్వహించారు. సభలో జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే వైటి ప్రభాకర్‌రెడ్డి, ఓంకారస్వామి, హనుమంతరాయప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయ భిక్ష పెట్టిన ప్రజలను విస్మరిస్తున్న కాంగ్రెస్ ద్రోహులను క్షమించరాదన్నారు. సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని విభజించేందుకు పూనుకుందని విమర్శించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నా అక్కడి పరిస్థితులను పట్టించుకోకుండా అతిపెద్దదైన ఆంధ్రప్రదేశ్‌ను మాత్రమే చీల్చేందుకు పూనుకోవడం సమంజసం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా ఉన్న కర్నూలును హైదరాబాద్‌కు తరలించిన ఘనత సీమాంధ్ర ప్రజాప్రతినిధులకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతంతో పదవుల కోసం మొసలి కన్నీరు కార్చుతున్నారన్నారు. గతంలో చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి ఇప్పుడు సమన్యాయం అంటూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అయితే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడుతున్న ఏకైక పార్టీ వైకాపా ఒక్కటేనన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమం కోసం వైఎస్ అమలు చేసిన పథకాల ను ప్రస్తుత ప్రభుత్వం నీరుగార్చుతోందన్నారు. జిల్లా కన్వీనర్ శంకరనారాయణ మాట్లాడుతూ ప్రజల ఓట్లతో నా యకులుగా ఎదిగి కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం విభజనకు పాల్పడుతోందన్నా రు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్,టిడిపి చెప్పే మాటలను నమ్మి ఓటు వేయవద్దన్నా రు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైకా పా అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి రావడం తథ్యమన్నా రు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందు కు పోరాడుతున్న పార్టీలకు ప్రజలు అండగా నిలవాలన్నారు. కార్యక్రమం లో ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, గోవర్ధనరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

* జిల్లా వ్యాప్తంగా నిరసనలు * నేడు పాఠశాలల బంద్‌కు పిలుపు * ఎస్కేయూలో తరగతుల బహిష్కరణ * 72 గంటలు రహదారి దిగ్బంధం
english title: 
t bill

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>