Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘ఫిర్యాదులపరిష్కారానికే ఎస్పీ గ్రీవెన్స్ సెల్’

$
0
0

విజయనగరం , డిసెంబర్ 16: స్థానిక పోలీస్‌స్టేషన్లలో బాధితులకు తగిన న్యాయం జరగని పక్షంలో ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్ సెల్ ద్వారా తగిన న్యాయం పొందవచ్చని జిల్లా ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్ సెల్‌లో ఎస్పీ ఇక్బాల్ పాల్గొని బాధితుల నుంచి స్వయంగా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా బాధితుల చేసిన ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ ఇక్బాల్ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. గంట్యాడ మండలం బురధపాడు గ్రామానికి చెందిన మహిళ తన వరిపంటను కొంతమంది లాక్కున్నారని ఫిర్యాదు చేశారు. కొమరాడ మండలం తొడుము గ్రామానికి చెందిన మహిళ తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు.

‘త్రుల్లో అవగాహనకే భూచేతన పథకం’
గజపతినగరం, డిసెంబర్ 16 : ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతు పట్ల రైతుల్లో అవగాహన కల్పించడానికి భూచేతన పథకాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ ఉప సంచాలకుడు కె.లక్ష్మణరావు చెప్పారు. మండలంలోని సీతారాంపురం గ్రామంలో సోమవారం జరిగిన రైతుల అవగాహన సదస్సులో సాగు పద్దతుల పట్ల వివరించారు. జిల్లాలోని గంట్యాడ, గజపతినగరం, పాచిపెంట మండలాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో 520 హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నట్లు చెప్పారు. రబీలో పప్పుదినుసుల రకాలకు చెందిన పెసర, మినుము, కొమ్ము శెనగలు, మొక్కజొన్న, పత్తిపంటల సాగులో అనుసరించాల్సిన మెళుకువల గురించి రైతులకు చేసి చూపిస్తున్నట్లు తెలిపారు. విత్తన శుద్ధితో శిలీంద్రం ద్వారా వ్యాపించే తెగుళ్లు నివారించ వచ్చని చెప్పారు. విచక్షణా రహితంగా సస్యరక్షణ మందులు రసాయనిక ఎరువులు వాడకం వలన భూమి నిస్సారం అయిపొతున్నట్లు చెప్పారు. రసాయనిక ఎరువులతోపాటు కంపోస్ట్, పచ్చి రోట్ట సేంద్రియ ఎరువులు అలాగే వృక్ష సంబంధిత సస్యరక్షణ మందులు వినియోగించాలని కోరారు. ఎడిఎ సిహెచ్ లచ్చన్న, ఏరువాక శాస్తవ్రేత్త పి.గురుమూర్తి, మండల వ్యవసాయ అధికారి టి.సంగీత, భూసార పరీక్షా కేంద్రం ఎడిఎ నాగభూషణరావు, ఎఇఓలు ఎం.సౌజన్య, ఎ.సతీష్ తదితరులు పాల్గొన్నారు.

కానిస్టేబుల్ ఆత్మహత్య
విజయనగరం, డిసెంబర్ 16 : ప్రేమ వైఫల్యం చెందడంతో మనస్తాపం చెందిన సివిల్ కానిస్టేబుల్ సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొమరాడ మండలం స్వామినాయుడువలస గ్రామానికి చెందిన పడాల కిశోర్‌కుమార్ (28), ప్రస్తుతం కోమరాడ పోలీసు స్టేషన్‌లో క్యాట్‌పార్టీలో పని చేస్తున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా ప్రేమ విఫలం కావడంతో మనస్తాపంతో ఉన్న అతను మక్కువ మండలంలో సివిల్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న తమ సహచరుడి వద్దకు వెళ్లాడు. అక్కడ తన సహచరుని గదిలో ఉంటూ సోమవారం పురుగు మందుతాగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో కిశోర్‌కుమార్ మిత్రుడు జిల్లా కేంద్రంలో ఒ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయుల ధర్నా
విజయనగరం, డిసెంబర్ 16: జిల్లాలో పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ, మున్సిపల్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాయింట్ స్ట్ఫా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని యూటీఎఫ్ నాయకులు శేషగిరి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జీవో 610 కింద జిల్లాకు వచ్చిన 700 మంది ఉపాధ్యాయులకు నేటి వరకు టిటిఎ బిల్లులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి డిఇఒ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో అన్ని కేడర్లకు చెందిన ఉపాధ్యాయుల ఇంటిగ్రేటెడ్ సీనియార్టీ జాబితాను విడుదల చేయాలన్నారు. అన్ని డీఎస్సీలలో రోస్టర్ లిస్టులను విడుదల చేయాలన్నారు. మండల స్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎంఇఒలు ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి నెల పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలన్నారు. జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించి జెడ్పి పిఎఫ్ అకౌంట్‌లను ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు. ఖాతాలు అప్‌డేట్ చేసి ఆన్‌లైన్ చేయాలన్నారు. విజయనగరం మున్సిపాల్టీలో గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులను, స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. ఐటిడిఎ పరిథిలోని 349 గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు ఆశ్రమ పాఠశాలల్లో చేరమని చెబుతున్నారని దీనివల్ల తల్లిదండ్రులకు పిల్లలు దూరమై డ్రాప్‌అవుట్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ ధర్నాలో యూటీఎఫ్ నేతలు రాము తదితరులు పాల్గొన్నారు.

‘ప్రజల్లో భయాందోళనలు పారదోలాలి’
విజయనగరం, డిసెంబర్ 16: పట్టణంలో కర్ఫ్యూ విధించినపుడు జనంలో ఏర్పడిన భయం నేటికి ఉందని, ఆ పరిస్థితులను పారద్రోలాలని టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు డిమాండ్ చేశారు. సోమవారం కోట జంక్షన్ వద్ద ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు అతి వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కాగా, అటువంటి పరిస్థితులు పునరావృత్తంగాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షుడు ప్రసాదుల రామకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ పార్టీ నేతలు ఎస్‌ఎన్‌ఎం రాజు, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.

అర్జీదారులతో కిటకిటలాడిన ‘గ్రీవెన్స్’
విజయనగరం, డిసెంబర్ 16 : తనదైన ముద్రతో జిల్లా గ్రీవెన్స్ సెల్‌కు వచ్చే వారిలో విశ్వాసాన్ని పెంచుతున్న కలెక్టర్ కాంతిలాల్‌దండే ఈసోమవారం నాటి గ్రీవెన్స్ సెల్‌లో మరో అడుగు ముందుకు వేసి తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. గ్రీవెన్స్ సెల్‌లో ప్రజానీకం అందజేసిన వినతులను పరిశీలించి వాటి పరిష్కారానికి అధికారులను సైతం ఆఘమేఘాల మీద పరుగులు తీయించారు. ఇటీవల కాలంలో జిల్లా గ్రీవెన్స్ సెల్‌కు కలెక్టర్ స్వయంగా హాజరై అర్జీదారుల వినతులు స్వయంగా పరిశీలించి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలిస్తుండడంతో సమస్యల పరిష్కారం అవుతాయన్న నమ్మకం ప్రజానీకానికి పెరిగింది. ఇందుకు నిదర్శనంగా 267పైబడి సామాజిక, వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన వినతులు అందాయి. పట్టణంలోని కంటోనె్మంట్‌లో అంబేద్కర్ కాలనీలోని ఒక ఇంటి వివాదానికి సంబంధించి తనకు న్యాయం చేయాలంటూ ఒక వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి కలెక్టర్ స్పందించి వాస్తవాలు పరిశీలించి నివేదికను అందజేయాలని సంబంధిత మండల తహశీల్దార్‌ను ఆదేశించారు. రజకులకు దోబిఖానాలు నిర్మించేందుకు నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభం కాలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతూ రజక సంఘం అధ్యక్షుడు ఎ.సింహాచలం కోరారు. తమ భూములకు సంబంధించి పట్టాదారు పాస్‌పుస్తకాలను, అండంగళ్‌ను వెంటనే ఇప్పించాలని దత్తిరాజేరు మండలం ఎస్.్భర్జివలసకు చెందిన పలువురు రైతులకు కలెక్టర్‌ను అభ్యర్ధించారు. వైద్య ధ్రువీకరణపత్రాలు అందజేయాలంటూ వికలాంగులు అత్యధిక సంఖ్యలో వ్యక్తిగతంగా వినతులు అందజేశారు. గ్రీవెన్స్ సెల్‌లో ఎజెసి నాగేశ్వరావుతోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించండి
విజయనగరం, డిసెంబర్ 16: ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలైన సబ్‌ప్లాన్, జలయజ్ఞం, బంగారుతల్లి, వడ్డీలేని రుణాలు, గృహాలు, పింఛన్లు తదితర పథకాలపై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక వాహనం ద్వారా అన్నిగ్రామాల్లో ప్రచారం చేపట్టాలన్నారు. గ్రామీణ పారిశుద్ధ్యం, వ్యక్తిగత మరుగుదొడ్ల ఆవశ్యకతపై కూడా కళాబృందాల ద్వారా అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. కాగా, జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలకు తొమ్మిది వాహనాలు కేటాయించినట్టు తెలిపారు. అందులో మొదటి విడత కింద ఐదు వాహనాలు జిల్లాకు వచ్చినట్టు డిపిఆర్వో గోవిందరాజులు తెలిపారు. వీటిని చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, కురపాం నియోజకవర్గాల పరిథిలో వినియోగించనున్నట్టు చెప్పారు. ప్రతి వాహనంలో ఒక ప్రొజెక్టర్‌తోపాటు జనరేటర్, లైటింగ్ మైక్ సిస్టమ్ ఏర్పాటు చేశామని ప్రతి వాహనంలో ఐదుగురు కళాకారులు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై గేయనాటికల కార్యక్రమాలను ప్రదర్శిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం డివిజనల్ పిఆర్వో డి.రమేష్, ఎపిఆర్వో జానకమ్మ, సూపర్‌వైజర్ కె.బి.సింగ్ పలువురు కళాకారులు పాల్గొన్నారు.

పట్టణంలో సమైక్యవాదుల నిరసన
విజయనగరం , డిసెంబర్ 16: రాష్టశ్రాసనసభలో విభజన బిల్లు ముసాయిదాను ప్రవేశపెట్టడాన్ని విశాలాంధ్ర మహాసభ విజయనగరం ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. దీనిని నిరసిస్తూ సోమవారం ఇక్కడ మయూరి జంక్షన్ వద్ద ర్యాలీ నిర్వహించారు. విభజన బిల్లు ముసాయిదాకు వ్యతిరేకంగా సమైక్యవాదులు నినాదాలు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ముసాయిదా బిల్లు ప్రతులను దగ్థం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాలాంధ్ర మహాసభ జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయుడు మాట్లాడుతూ తెలుగుప్రజల గుండెలపై కాంగ్రెస్‌ప్రభుత్వం విభజన బిల్లు ముసాయిదా కుంపటిని ఉంచిందన్నారు. బిజెపి, సిపిఐ, తెలుగుదేశంపార్టీలు ఈ కుంపట్లో మంటలు రాజేస్తున్నాయని విమర్శించారు. ఈ బిల్లును సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా వ్యతిరేకించాలని, కానిపక్షంలో వారికి, వారి కుటుంబసభ్యులకు రాజకీయ, సామాజిక బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో తెలుగుప్రజలు అప్రమత్తంగా కావాలని, బిల్లుకి వ్యతిరేకంగా సమైక్యపోరుకు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ నేతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇట్లా కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
జామి, డిసెంబర్ 16 : మండలంలోని కోరుకొండ రైల్వే స్టేషన్ సమీపంలో గుడారాలు వేసుకుని నివాసం ఉంటున్న ఒక అంతర్ రాష్ట్ర ముఠా సోమవారం పట్టుబడింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రానికి చెందిన తర్బీర్‌భాటియా, జగదీష్‌భాటియా, రణభీర్‌సింగ్ భాటియా అనే అంతర్‌రాష్ట్ర ముఠాకు చెందిన వ్యక్తులు పట్టుబడ్డారు. వీరిపై మహారాష్టల్రో పులులను హతమార్చిన కేసులు ఉన్నట్లు మహారాష్ట్ర అటవీశాఖ అధికారి విశాల్‌వౌళి తెలిపారు. అయితే వీరి గురించి గత ఆరు నెలలుగా గాలింపు చేపడుతున్నామని సెల్ టవర్ల ఆధారంతో వీరు ఉండే ప్రాంతాన్ని గమనించి జిల్లా పోలీసులు అధికారులు ఓఎస్‌డి కె.ప్రవీణ్‌కుమార్, స్థానిక ఎస్సై లూథర్‌బాబుల సహకారంతో పట్టుకున్నట్లు తెలిపారు. ఫ్లాస్టిక్ పువ్వులు, ఫర్నిచర్ వస్తువులను విక్రయిస్తున్న ఇక్కడ జీవనం సాగిస్తున్నట్లు ఉండడంపై వీరిపై అనుమానంతో పట్టుకోవడం జరిగిందని స్థానిక ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

స్థానిక పోలీస్‌స్టేషన్లలో బాధితులకు తగిన న్యాయం జరగని
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>