Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అడిగిన వారందరికీ ఉపాధి కల్పన

$
0
0

సంగారెడ్డి,డిసెంబర్ 18: పని అడిగితే పక్షం రోజుల్లో జాబ్‌కార్డు కలిగిన కూలీలకు అవకాశం కల్పించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని ఉపాధి హామి పథకం సిబ్బందితో ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. 15రోజుల్లో కూలీలకు ఉపాధి కల్పించి వలసలు నిరోదించకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ నెల 15వ తేదీ నాటికి ఇచ్చిన లక్ష్యం కంటే ఎక్కువ మంది కూలీలకు పని కల్పించిన మిరుదొడ్డి,తొగుట,నారాయణఖేడ్, కల్హేర్, టేక్మాల్ మరియు పెద్దశంకరంపేట మండలాలకు చెందిన ఎపిఓలను ఆయన అభినందించారు.అంతేకాకుండా నిర్ధేశించిన లక్ష్యంలో 50శాతం కూడ పూర్తి చేయని ఎపిఓలపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఈ నెల 22వ తేదీ నాటికి లక్ష్యాలను పూర్తి చేయని వారిపై 23వ తేదీన ఎపిఓ, టెక్నికల్ అసిస్టేంట్,క్షేత్రస్థాయి సహాయకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇందిరమ్మ పచ్చతోరణంలో కూడ ప్రగతిని సాధించాలని కోరారు.స్మార్ట్ కార్డు ద్వారా వేతనాల చెల్లింపులో పెండింగ్‌లో ఉన్న డేటాలో గ్రామాల వారీగా తనిఖీ చేసి ఇందులో చనిపోయిన వారి లిస్టు, వలసలు పోయిన వారి లిస్టు,గ్రామాల్లో నివాసం ఉండి వేతనం అందని వారి లిస్టులను ఈ నెల 25లోపు సమర్పించాలని ఎపిఓలను ఆదేశించారు.

ఉద్యోగుల సమ్మెతో బ్యాంకులు బంద్
సిద్దిపేట , డిసెంబర్ 18: బ్యాంకింగ్ రంగంలో చేపడుతున్న సంస్కరణలను తక్షణం నిలిపి వేయడంతో పాటు, వెతన సవరణను చేపట్టాలని కోరుతు బ్యాంక్ ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుతో బుధవారం పట్టణంలో బ్యాంక్‌లు బందు అయ్యాయి. బ్యాంక్‌లు బందు ఉండడంవల్ల ఆయా శాఖలకు వచ్చిన ఖాతాదారులు కొంత ఇబ్బంది పడ్డారు. బ్యాంకింగ్ రంగంలో ఆన్‌లైన్ విధానాన్ని సైతం బంద్ చెయడంతో ఎటియంలు సైతం బంద్ అయ్యాయి. దీంతో అత్యవసరంగా డబ్బులు అవసరమైన వారు ఇబ్బంది పడ్డారు. భారత అర్ధిక వృద్దికి బ్యాంకింగ్ రంగం ఎంతో తొడ్పడుతున్న బ్యాంక్ ఉద్యోగులకు తగ్గట్టుగా వెతనాలు కల్పించడం లేదన్న దృశ్య బ్యాంకింగ్ రంగంలో కొత్త సంస్కరణలు తెచ్చి వెతనాలు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు.

ఐకెపి కేంద్రాల ద్వారా 14లక్షల మెట్రిక్ టన్నుల
ధాన్యం సేకరణ లక్ష్యం
సిద్దిపేట, డిసెంబర్ 18: రాష్ట్ర వ్యాప్తంగా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 14లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు సివిల్‌సప్లై ఎండి అనీల్‌కుమార్ తెలిపారు. సిద్దిపేటలో గోడౌన్‌లను పరిశీలించిన అనంతరం స్థానిక రెవెన్యూ గెస్టుహౌజ్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటివరకు 8లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరించామన్నారు. రాష్టవ్య్రాప్తంగా 2200ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 50శాతానికి పైగా ధాన్యం కరీంనగర్ జిల్లా నుంచే వస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసమే తాము పాటుపడుతున్నామని, అన్నదాతలకు గిట్టుబాటు ధర అందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వం 1340గిట్టుబాటు ధర నిర్ణయించగా ప్రస్తుతం బహిరంగమార్కెట్‌లో గిట్టుబాటు ధరకంటే అధికంగా ధర వస్తుందన్నారు. దీంతో అన్నదాతలు ఐకెపి కేంద్రాల్లో తక్కువగా అమ్ముతున్నారన్నారు. పెద్ద మార్కెట్‌యార్డుల్లో సివిల్‌సప్లై ధాన్యం కేంధ్రాలు ఏర్పాటు చేయాలని భావించినా సిబ్బంది కొరతతో ఆ దిశగా చర్యలు చేపట్టలేదన్నారు. రాష్టవ్య్రాప్తంగా 300పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీంతో రిటైర్డ్ ఉద్యోగులతో కొన్ని కేంధ్రాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది 65గోడౌన్ల నిర్మాణం దశలో ఉన్నాయని, ప్రతి గోడౌన్‌కు 25లక్షలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి 25కోట్లతో వందగోడౌన్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లాలో పటాన్‌చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, రామాయంపేట ప్రాంతాల్లో గోడౌన్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. గోడౌన్ల నిర్మాణంతో ధాన్యంకు భద్రత ఉంటుందన్నారు. ఎంఎల్‌ఎస్ పాయింట్‌లను మరమ్మత్తులు చేపట్టి కంప్యూటరైజ్ చేయనున్నట్లు తెలిపారు. 439ఎంఎల్‌ఎస్ పాయింట్లలో కంప్యూటర్, ఆపరేటర్లను సైతం నియమించనున్నట్లు తెలిపారు. హఫీజ్‌పేటలో 9గోడౌన్లతో ఫైలెట్ ప్రాజెక్టుగా చేపట్టామన్నారు. త్వరలోనే అన్ని జిల్లాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. మనబియ్యం పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ఇప్పటిదాకా 30వేల టన్నుల బియ్యం సేకరించామన్నారు. అమ్మహస్తం పథకాన్ని మరింత పకడ్బంధీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. అమ్మహస్తం పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం డాక్యుమెంటరీ రూపొందించి ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సివిల్‌సప్లై జిఎం కళాధర్‌రావు, తహశీల్దార్ ఎన్‌వై గిరి పాల్గొన్నారు.
అమెరికా దౌష్ట్యంపై ఆగ్రహం
బి.విజయలక్ష్మి మాట్లాడుతూ ఒక భారత రాయబారి పట్ల అమెరికా ప్రభుత్వం దుర్మార్గంగా,అవమానకర రీతిలో అరెస్టు చేసి దారుణంగా వ్యవహరించడం భారతీయులను అగ్రహవేశాలకు గురిచేసిందన్నారు.్భరతీయ సంస్కృతి సంప్రాదాయలను గౌరవించకుండా అమెరికా ప్రభుత్వం ఇలా వ్యవహరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.ఇలా దుర్మార్గంగా వ్యవహరించిన అమెరికా ప్రభుత్వంతో భారతదేశ ప్రభుత్వం స్నేహ సంబంధాలు,సహాయ సహకారాలను తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి మహిళ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యమ్మ, పట్టణ అధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శి శ్యామల, బిజెపి నాయకులు నర్సారెడ్డి, వెంకట్ నర్సింహారెడ్డి, నాగరాజు, మల్లేశం, దుర్గాప్రసాద్, వీరారెడ్డి, ప్రభాకర్‌గౌడ్, విష్ణు, విజయ్, సుదీర్‌రెడ్డి, చారి తదితరులు పాల్గొన్నారు.

శ్రమశక్తి సంఘాలు
హక్కులను సద్వినియోగం చేసుకోవాలి
- డ్వామా ఎపిడి వసంత సుగుణ -
గజ్వేల్, డిసెంబర్ 18: శ్రమశక్తిసంఘాలు తమ హక్కులను సద్వినియోగం చేసుకుంటూ ఆత్మగౌరవంతో బ్రతకాలని డ్వామా అదనపుప్రాజెక్టు డైరెక్టర్ వసంతసుగుణ తెలిపారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బుదవారం దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె ప్రసంగించారు. ఉపాధిహామీ కూలీలు సంఘటితంగా ఉంటూ చట్టం కల్పించిన వంద రోజుల పని దినాలను సద్వినియోగం చేసుకొని పని చేయు సందర్భంగా ఎదురవుతున్న ఇబ్బందుల ను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. ముఖ్యంగా నిరుపేద రైతులు, వ్యవసాయ కూలీల కోసం కేంద్రం ఉపాధిహామీ పథకాన్ని ఆమలు చేస్తుండగా, ప్రతి కూలీ పని కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం వెచ్చిస్తున్న రూ,9100లు పొంది సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే భూముల అభివృద్ధి పనులు చేసుకోవాలనుకునే వారు పని గుర్తింపు కార్యక్రమం లో పాల్గొనాలని సూచించారు. కాగా ప్రతి నెల 3వ బుదవారం ఎంపిడిఓ కార్యాలయంలో ఉపాధిహామీ కూలీలు సమావేశమై వివిధ అంశాలపై చర్చించు కోవాలని వివరించారు. డిబిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏగొండస్వామి, జిల్లా కార్యదర్శి శివకుమార్, మండల శాఖ అధ్యక్షులు నాగభూషణం, ఎపిఓ మల్లేశం పాల్గొన్నారు.

ఆలయాల అభివృద్ధికి కృషి
* ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి హామీ
సదాశివపేట, డిసెంబర్ 18: ఆధ్యాత్మిక భావాలకు ఆలవాలమైన సదాశివపేట పట్టణంలోని వివిధ మందిరాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అన్నారు. దత్త జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ యేడాది కూడా పట్టణంలోని మానిక్ ప్రభు మందిరంలో నిర్వహిస్తున్న జాతర ఉత్సవాలకు మంగళవారం రాత్రి జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణంలో శివ, వైష్ణవ అనే తేడా లేకుండా ఆశ్రమ పీఠాలకు సంబంధించిన మందిరాలు ఉండటం సంతోషకరమని అన్నారు. మానిక్ ప్రభు మందిరం అభివృద్ధిలో తనవంతు చేయూతను ఇస్తానని, ఇందుకుగాను ఐదు లక్షల రూపాయల విరాళాన్ని ఆయన ప్రకటించారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నానని మంచినీటి సమస్య పరిష్కారానికి దురదృష్టం వెంటాడుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. 2014 సంవత్సరంలో పట్టణంలోని గడప గడపకు మంజీర నీటిని అందించే వరకు విశ్రమించబోనని అన్నారు. వేలాది మందికి ఇళ్ల పట్టాలు సైతం అందించినట్లు తెలిపారు. అంతర్గత రోడ్లు, బస్టాండ్, ఉబ చెరువు ట్యాంకు బాండ్‌గా మార్చడం లాంటి వాటిపై దృష్టి పెట్టానని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పట్నం సుబాష్, మున్సిపల్ మాజీ చైర్మన్ మునిపల్లి సత్యనారాయణ, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ అనీల్‌రెడ్డి, యూత్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా మందిరానికి చెందిన పలువురు యువకులు రికార్డింగ్ డ్యాన్సులు చేస్తుండగా ఎమ్మెల్యే వారితో కలిసి చిందులు వేసి ప్రోత్సహించారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు జాతీయ జెండాను పోలిన దుస్తువులు ధరించి స్వాగతం పలికారు.

పని అడిగితే పక్షం రోజుల్లో జాబ్‌కార్డు కలిగిన కూలీలకు అవకాశం
english title: 
employment

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>