రోజువారీ మెనూలో కాసిన్ని వాల్‌నట్స్‌ని కూడా చేర్చుకుంటే మన గుండె భద్రంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతిరోజూ నాలుగు వాల్‌నట్స్ తింటే మన గుండె ఆరోగ్యంగా, భద్రంగా ఉంటుందని పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది.
పెన్సిల్వేనియాలోని స్క్రాన్‌టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో బాదం, పిస్తా, వేరుశెనగ వంటి పప్పులతో పోల్చుకుంటే వాల్‌నట్స్ మన గుండెకు చాలా మేలు చేస్తాయని, మన గుండెను ఆరోగ్యవంతంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లు వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉన్నాయని తేలింది. ఈ విషయాన్ని గురించి ఈ పరిశోధనలో పాలుపంచుకున్న జో విన్‌సన్ మాట్లాడుతూ ఇతర పప్పుల రకాలతో పోల్చుకుంటే వాల్‌నట్స్‌లో మన గుండెకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని, కానీ చాలామంది వాటిని తీసుకోవడం లేదని, వారిరోజువారి మెనూలో వాల్‌నట్స్ ఉండేలా చూసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. ఇతర వాటితో పోల్చుకుంటే వీటిలో రెండు నుండి పదిహేను రెట్లు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.వ్యాధిబారిన పడినప్పుడు నేచురల్ కెమికల్స్ దెబ్బతినకుండా చూసి మన శరీరాన్ని రక్షించడంలో ఇవి కీలకపాత్రను పోషిస్తాయి.
రోజువారీ మెనూలో కాసిన్ని వాల్‌నట్స్‌ని కూడా చేర్చుకుంటే మన గుండె భద్రంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
english title:
nuts
Date:
Wednesday, December 25, 2013