
కూరగాయలతో వండే వంటలు రుచి లేకుండా చప్పగా ఉంటాయి. మనుషుల్లో కాస్త ఆధునికత వంటబట్టాక వంటల్లో కూడా అనేక మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి ప్రాంతాలను బట్టి, ఆచార వ్యవహారాలను బట్టి ఘుమఘుమలాడే వంటకాలు నోరూరించే రుచులతో యారుచేయబడుతున్నాయి.
వంటగదిలో అనేక పదార్థాలు కనిపిస్తుంటాయి. సుగంధ దినుసులు లేకపోతే పరిపక్వత రావేమో అనిపిస్తుంది. ముఖ్యంగా వంటగదిలో సుగంధ దినుసులను పదార్థాల రుచి, వాసన పెరగటానికి ఉపయోగిస్తుంటారు. కానీ వీటిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. పసుపు, మిరియాలు, ఏలకులు, లవంగాలు ఇంకా మరెన్నో దినుసులు అందరిళ్ళలోనూ తప్పకుండా ఉంటాయి.
సుగంధ ద్రవ్యాలలో మహారాణి లాంటివి యాలకులు. యాలకులను తినడంవలన నోటి దుర్వాసన తగ్గిపోతుంది. ఇవి తినడం కాలేయ, జీర్ణ సంబంధిత సమస్యలకు మంచి చికిత్స. దృఢమైన డిటాక్సిఫికేషన్ కారకంగా గుర్తింపు పొందింది.
ఇక లవంగాలు చప్పరించడంవల్ల గొంతు మంట తగ్గుతుంది. వాటిలో యాంటీ స్పాస్ మోడిక్ గుణాలు ఉంటాయి. కండరాలు పట్టేసినప్పుడు లవంగ తైలం రాస్తే ఉపశమనంగా ఉండి, రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
మిరియాలు సుగంధ దినుసుల్లో ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్నవి. శ్వాస సంబంధిత ఇన్‌ఫెక్షన్లకు ఇవి మంచి మందు. పదార్థాలపై కొద్దిగా మిరియాల పొడి చల్లినా చాలు, జ్ఞాపకశక్తి బాగా మెరుగుపడుతుంది.
ఆఖరిగా చెప్పుకున్న పసుపు ప్రాధాన్యత చాలా ఎక్కువ. పసుపు ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తారు. పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం విశేషం. పసుపును ముద్ద చేసి ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి. గాయాలపై పసుపు రాసి వెంటనే ప్రథమ చికిత్స చేయటం భారతీయులకు చాలా కాలంగా వస్తున్న అలవాటు.
అలాగే దాల్చిన చెక్క- ఇది షుగరు పేషెంట్లకు ఉపశమనాన్ని కలిగించి లెవల్స్‌ను తగ్గించటంలో బాగా ఉపయోగపడుతుంది. *