Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పెన్నా డెల్టా రైతాంగానికి సాగునీరు విడుదల చేయాలి

$
0
0

కోవూరు, డిసెంబర్ 24: సోమశిల ప్రాజెక్ట్ పరిధిలోని పెన్నా డెల్టా ఆయకట్టు రైతాంగానికి నీటిని విడుదల చేయాలని పెన్నా డెల్టా రైతు ఆయకట్టుదారుల సంఘం అధ్యక్షులు బెజవాడ గోవిందరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమశిల ప్రాజెక్ట్ పరిధిలోని పెన్నా డెల్టా ఆయకట్టుకు తొలి, రెండవ పంటకు తొలి ప్రాధాన్యతలో కొంత భాగం నీరు ఇచ్చిన తర్వాతనే ప్రాధాన్యత హక్కును నీటిని ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పెన్నా డెల్టా రైతుల హక్కులను భంగపర్చి అనధికారిక ఆయకట్టు భూములకు నీటిని మళ్లించి డెల్టా రైతుల హక్కులకు భంగం కలిగిస్తున్నారని తెలిపారు. సోమశిల ప్రాజెక్ట్ నుండి 30 టిఎంసిల నీటిని కండలేరుకు తరలించుకున్నారని, ఈ తరలింపులో సోమశిల ప్రాజెక్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రూవిట్ చేసిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈనెల్లో జరిగే ఐఎబి సమావేశంకు డెల్టా రైతాంగం తరలివచ్చి హక్కులను కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఫ్యాక్టరీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి: సిఐటియు
తోటపల్లిగూడూరు, డిసెంబర్ 24: మండలంలోని శనపల్లిపాలెం వద్దగల శరత్ రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేసే దినసరి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని మండల సిఐటియు డిమాండ్ చేసింది. మంగళవారం నరుకూరు సెంటర్‌లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో నాయకులు కంపెనీకి చెందిన వివరాలను తెలిపారు. శరత్ కంపెనీలో దాదాపు వెయ్యి మంది కార్మికులు కేవలం 170 రూపాయల జీతంతో పనిచేస్తున్నారని, కనీస వేతనం చట్టప్రకారం 287 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. దీంతోపాటు ప్రావిడెంట్ ఫండ్, ఇఎస్‌ఐ, వారాంతపు సెలవులు, గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉండగా, కంపెనీ నిబంధనలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. పనిగంటలు సక్రమంగా అమలు చేసి ఉద్యోగభద్రత కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు డివిజన్ నాయకులు టివివి ప్రసాద్, మండల కార్యదర్శి నక్కా సూరిబాబు, కె గిరిధర్, కె నందయ్య, జడ్డా ఏడుకొండలు, చలపతి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మద్యం నియంత్రణను కఠినంగా అమలు చేయాలి
కోవూరు, డిసెంబర్ 24: రాష్ట్రంలో బెల్ట్‌షాపులను ఎత్తివేయాలని, మద్యం విక్రయాలను నియంత్రించాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కఠారి శ్రీనివాసరావు డిమాండ్ చేసారు. లోక్‌సత్తాపార్టీ ఆధ్వర్యంలో మండలంలోని పాటూరు గ్రామంలో బెల్టుషాపులు ఎత్తివేయాలంటూ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రజల ఆరోగ్యాన్ని కాలరాస్తున్న మద్యాన్ని నియంత్రించేందుకు ప్రజలందరూ పార్టీలకు అతీతంగా లోక్‌సత్తా పార్టీతో కలిసి ఉద్యమించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు ఎం అంకయ్యచౌదరి మాట్లాడుతూ కఠిన మద్యం నియంత్రణకు యువత ముందుకు రావాలన్నారు. దూబగుంట రోశమ్మను ఆదర్శంగా తీసుకొని మద్యం నియంత్రణకు ఉద్యమించాలన్నారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు మాట్లాడుతూ తమ గ్రామంలో బెల్ట్‌షాపుల రద్దుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నర్రా శ్రీ్ధర్, యువత ఉపాధ్యక్షులు రమేష్‌రెడ్డి, లోక్‌సత్తా పార్టీ బాధ్యులు నరసయ్య, జిల్లా కార్యదర్శి మనియాదవ్, ఉపాధ్యాయులు శర్మ తదితరులు పాల్గొన్నారు.

20 లీటర్ల దోమల మందు వితరణ
కోవూరు, డిసెంబర్ 24: పట్టణంలో దోమల నివారణకు సుభాష్ సేవా సంఘం ఆధ్వర్యంలో 20 లీటర్ల దోమలమందును పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్, ఉపసర్పంచ్ ఉమ, మల్లారెడ్డిలకు మంగళవారం అందజేసారు. ఈకార్యక్రమంలో సుభాష్‌సేవా సంఘం అధ్యక్షులు డి సురేష్‌రెడ్డి, పి విజయసాయిరెడ్డి, వార్డు సభ్యులు జి చక్రవర్తి, ఎం శ్రీనివాసులురెడ్డి, పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు.

వర్క్ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేషన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
ఇందుకూరుపేట, డిసెంబర్ 24: మండలంలో వర్క్‌ఎడ్యుకేషన్‌కు , ఆర్ట్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని స్థానిక మండల విద్యాశాఖాధికారి దేవినేని మాల్యాద్రినాయుడు మంగళవారం తెలిపారు. ఈ రెండు ఉద్యోగాలు ఇందుకూరుపేటలో వర్క్‌ఎడ్యుకేషన్, నర్సాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్ట్ ఎడ్యుకేషన్ పోస్టు ఖాళీగా ఉందన్నారు. 10వ తరగతి పాసై, వృత్తివిద్యకు సంబంధించిన అర్హత కలిగిన వారు దరఖాస్తు ఫారాలను సంబంధిత ఎంఇఓ కార్యాలయంలో రెండు రోజుల్లో అందించాలని కోరారు.

7 కోట్ల 18 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేసాం: ఐకెపి ఎపిఎం సుజాత స్పష్టం
ఇందుకూరుపేట, డిసెంబర్ 24: 2013-14కు సంబంధించి ఇందుకూరుపేట మండలంలోని 246 సంఘబంధ గ్రూపులకు 7 కోట్ల 18 లక్షల రూపాయల రుణాలను బ్యాంకు లింకేజీ ద్వారా అందించి అనుకున్న లక్ష్యాలను త్వరగా పూర్తి చేసామని ఇందుకూరుపేట ఐకెపి ఎపిఎం సుజాత తెలిపారు. మంగళవారం ఆమె సంఘబంధం కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ మార్చి ఆఖరి లోపు ఈరుణాలను పూర్తి చేయాల్సి ఉండగా, ముందుగానే ఒక లక్ష్యంతో పూర్తి చేసామన్నారు. ఈ రుణాలను పొందిన వారు సకాలంలో సక్రమంగా క్రమం తప్పకుండా చెల్లిస్తే వడ్డీ లేకుండా లబ్ధిపొందవచ్చని పేర్కొన్నారు. ఇందుకూరు స్టేట్‌బ్యాంక్, గంగపట్నంలోని సిండికేట్ బ్యాంక్ పరిధిలో 30 లక్షల రూపాయల రికవరీలను జనవరి నెలాఖరులోగా పూర్తి చేయటం కోసం టీమ్‌లను ఏర్పాటు చేసామన్నారు. వసూళ్ల కోసం ప్రతి సంఘబంధ సభ్యులు సమావేశం జరుపుకొని సమయానుకూలంగా వసూలు చేయాలన్నారు. ఈరుణాలు ఇచ్చిన కారణంతో 246 గ్రూపుల్లోని మహిళల స్థితిగతులు మెరుగుపడే అవకాశాలు ఉన్నట్టు ఆమె పేర్కొన్నారు. బంగారుతల్లి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు 105 మంది దరఖాస్తు చేసుకున్నారని, వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసామని తెలిపారు. వీరికి ఒక్కొక్కరికి ఏడాదికి 2500 రూపాయల చొప్పున వారి వారి బ్యాంకు ఖాతాల్లో చేరతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా 1-5-2013 నుండి జన్మించిన ఒక కుటుంబంలోని ఇద్దరు ఆడపిల్లకు గాని, లేదా ఒక బాబు, రెండో కాన్పులో ఆడపిల్లకైనా ఈ పథకం వర్తిస్తుందని ఆమె తెలిపారు. పిల్లలకు టీకాలు వేసే సమయాలలో ఒక్కొక్కటీకాకు వెయ్య రూపాయల చొప్పు బ్యాంకు అకౌంట్‌లో పడుతుందన్నారు. 3 నుండి 5 సంవత్సరాల వరకు ఒక్కో ఏడాదికి ఒక్కొక్కరి 1500 రూపాయల చొప్పున బ్యాంకు అకౌంట్‌లో ప్రభుత్వం నగదు వేస్తుందని పేర్కొన్నారు. ఇలా ఇంటర్ వరకు మొత్తం లక్షా 15 వేల వరకు బ్యాంకులో జమ అవుతుందన్నారు. అదే విధంగా డిగ్రీ వరకు పూర్తి చేయగలిగితే మొత్తం 2 లక్షల 16 వేల వరకు పిల్లలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని, ఈఅవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

చిన్నపిల్లల వైద్య శిబిరం
ముత్తుకూరు, డిసెంబర్ 24: ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పంచాయతీ కార్యాలయంలో సివిఆర్ సంస్థ ఆధ్వర్యంలో చిన్నారుల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ శిబిరంలో సివిఆర్ వైద్యులతోపాటు నారాయణ ఆసుపత్రి వైద్యులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు ఉచితంగా మందులు అందజేశారు.

కార్మిక చట్టాలను అమలు చేయాలి
ఐఎన్‌టియూసి నేత

ముత్తుకూరు, డిసెంబర్ 24: కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేయాలని ఐఎన్‌టియూసి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ముత్తుకూరులో విలేఖర్లతో మాట్లాడారు. పోర్టు, పామాయిల్ ప్రాజెక్ట్‌లు, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని వాపోయారు. దీనిపై ఐఎన్‌టియూసి ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. ట్రేడ్ యూనియన్‌లలో చేరితో హెచ్చరికలు జారీ కావడంతో కార్మికుల్లో భయాందోళన నెలకొందన్నారు. మరో వైపున నానా అగచాట్లు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో మండల ఐఎన్‌టియూసి అధ్యక్షులు ముత్యం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ బాధ్యత అందరిదీ
ముత్తుకూరు, డిసెంబర్ 24: పర్యావరణ బాధ్యత అందరిదీ అంటూ రూరల్ ఎన్విరాన్‌మెంటల్ అగ్రికల్చర్ సొసైటీ అధ్యక్షులు మురళి పేర్కొన్నారు. మంగళవారం ఆయన నారికేళ్లపల్లి పంచాయతీలోని సుబ్బారెడ్డిపాళెంలో మొక్కలు నాటించారు. కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా సర్పంచు భాస్కర్, కాంగ్రెస్ నాయకులు వసంతకుమార్‌రెడ్డి, తెలుగుదేశం నాయకులు బలరామిరెడ్డి, తదితరులు హాజరయ్యారు. రూరల్ ఎన్విరాన్‌మెంటల్ సంస్థ ముత్తుకూరు మండలంలో పలుచోట్ల మొక్కలు నాటడం పట్ల ప్రశంసించారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న మండలంలో పర్యావరణ పరిరక్షణ బాధ్యత ఎంతో ముఖ్యమైందని అతిధులు ప్రశంసించారు. ఇప్పటి వరకు మండలంలో ఐదు వేల మొక్కలను నాటి ప్రజలకు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

రియల్ ఛీటర్
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత అరెస్ట్
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, డిసెంబర్ 24: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మైనారిటీ నాయకులు షేక్ ఖాజావలిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నెల్లూరు కోర్టుకు హాజరుపరిచారు. ఈయన గతంలో బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ భూములకు సంబంధించి అక్రమాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒకే ప్లాట్‌ను వేర్వేరు వ్యక్తులకు విక్రయించడంతో సహా ప్రభుత్వ భూములను కూడా రిజిస్టర్ చేయించిన ఘటనలతో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. కర్నాటకలో ఓ కేసు వివాదంలో కోర్టును సైతం మోసగించడంతో నాన్‌బెయిల్ కేసు దాఖలైంది. ఆ కోర్టులో ఖాజావలిపై కేసు బనాయించిన కక్షిదారుడు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు అదృశ్యమయ్యాయి. కోర్టు సిబ్బందిని లోబర్చుకుని ఖాజావలి స్వాధీనపరచుకున్నారని మరో కేసు నమోదైంది. అక్కడి జడ్జి దీనిపై సీరియస్‌గా వ్యవహరించి రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశాడు. కోర్టులో ధ్రువీకరణ పత్రాలను దొంగిలించుకున్నట్లుగా ఫిర్యాదు చేయడంతో గత మూడేళ్ల నుంచి ఖాజావలి కోసం కర్నాటక పోలీసులు గాలిస్తున్నారు. ఖాజావలి కర్నాటక హైకోర్టు బెయిల్ మంజూరు కోసం ప్రయత్నించారు. న్యాయమూర్తిని మోసగించాడనే ఆరోపణలతో బెయిల్ మంజూరు కాలేదు. కర్నాటక పోలీసులు అరెస్ట్ చేసి ఐదవ నగర పోలీసులకు అప్పగించారు.

జయభారత్ ఆసుపత్రి సేవలు పరిశీలన
నెల్లూరుసిటీ, డిసెంబర్ 24: జయభారత్ ఆసుపత్రిలో చేస్తున్న సేవలను ఉచితంగా రక్తం సరఫరా చేస్తున్న రెడ్‌క్రాస్ రక్తనిధి వివరాలను ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కన్వీనర్ డాక్టర్ ఈదూరు సుధాకర్ పరిశీలించారు. అనంతరం మంగళవారం ఎనిమిది మంది గిరిజన రోగులను ఆయన పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జయభారత్ ఆసుపత్రి దశాబ్దకాలంగా చేస్తున్న సేవలను అభినందించారు. ఈ పథకం కింద పది పడకల ఆసుప్రతిని కేవలం గిరిజనులకే కేటాయించడం, హాస్పిటల్లో చేరిన రోగులకు ఉచిత చికిత్స, ఉచిత మందులు, ఉచిత పరీక్షలు, ఉచిత భోజనం వంటికి కల్పించుట ఆదర్శనీయం అన్నారు. రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు నుండి రక్తహీనత, కాన్పులు, ప్రమాదంలో గాయపడి క్షతగాత్రులైన గిరిజనులకు ఉచితంగా రక్తం సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుప్రసాద్, డాక్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

కళాశాలల ఎదుట మద్యం షాపులను తొలగించాలి
నెల్లూరుసిటీ, డిసెంబర్ 24: తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని కళాశాలల ఎదుట మద్యం షాపులను తొలగించాలని కోరుతూ మంగళవారం డిఆర్‌ఓకు వినతి పత్రం అందచేశారు. ఈసందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడు మాట్లాడుతూ నెల్లూరు నగరంలో కళాశాలలు, పాఠశాలలు ఎదుట మద్యం షాపులను నిర్వహిస్తు విద్యార్థిని, విద్యార్థులకు అభద్రతాభావానికి గురి చేస్తున్నారని, విచ్చలవిడిగా మద్య షాపులు నిర్వహించడం ద్వారా కళాశాలలకు వెళ్లే విద్యార్థులను పెడద్రోవ పట్టిస్తున్నారని తెలిపారు. గతంలో నగరంలో జడ్పీ సెంటర్, అభిరామ్ హోటల్ సమీపంలో మద్యం సేవించిన వ్యక్తులు ఘర్షణలు పడి విద్యార్థులపై దాడులు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయన్నారు. కళాశాలలకు, పాఠశాలలకు కనీసం 100మీటర్ల దూరంలో ఉండాలన్నా కనీస నిబంధనలను తుంగలో తొక్కుతున్న జిల్లా అధికారులలో ఏ మాత్రం స్పందన లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించిన కళాశాలలకు దగ్గరగా ఉన్న మద్యం షాపులను తొలగించాలని, లేని పక్షంలో దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అమృల్లా తదితరులు పాల్గొన్నారు.

సోమశిల ప్రాజెక్ట్ పరిధిలోని పెన్నా
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>