Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రాష్టప్రతి బిజీబిజీ

$
0
0

సాధారణంగా ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్లినప్పుడు బిజీబిజీ అని వార్తలొస్తుంటాయి. ఈసారి రాష్టప్రతి మాత్రం అంత కన్నా ఎక్కువ బిజీబిజీగా గడిపారు. రాష్టప్రతి ఏటా పక్షం రోజులు బొల్లారంలోని రాష్టప్రతి నిలయంలో గడుపుతుంటారు. ఈ సారి రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీకి బొల్లారంలో బిజీబిజీగా గడిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న, స్వాగతిస్తున్న, సమన్యాయం అంటున్న నేతలు ఎవరికి వారు రాష్టప్రతి వద్దకు క్యూ కట్టారు. ఎవరి వాదనలు వారు వినిపించారు. రాష్టప్రతి తాము చెప్పేటప్పుడు వ్యక్తం చేసే హావభావాలు, దేహ భాషను బట్టి తమకు అనుకూలంగా మొగ్గ వచ్చని ఊహాగానాలు చేస్తున్నారు. రాష్టప్రతిని కలిసిన వారు రాజకీయంగా పరస్పరం బద్ధ శత్రువులే. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్, టిడిపి అధినేత జగన్, కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరితో పాటు ఇంకా సీమాంధ్ర టిడిపి నేతలు, కాంగ్రెస్ నేతలు, టి బిజెపి నేతలు కలిసి వినతిపత్రాలు ఇచ్చి రాష్టప్రతి చెవులు కొరికేశారు. ఒకళ్లు బిల్లుపై చర్చించేందుకు ఇంకా టైం కావాలంటే, టైం ఇవ్వద్దని కూడా గట్టిగా కోరారు. ఆంధ్రా, తెలంగాణ నేతల గొడవలు చూసి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఏమనుకున్నారో?
- శైలేంద్ర
తిక్కకో లెక్క
నాక్కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది అంటాడో సినిమాలో పవన్ కల్యాణ్. అలానే టిడిపి ఎమ్మెల్యేలు మాకొక తిక్కుంది. దానికో లెక్కుంది అంటున్నారు. టిఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావాలని టిడిపి తెలంగాణ నాయకులు పదే పదే డిమాండ్ చేస్తున్నారు. టిఆర్‌ఎస్ విలీనం కాకపోవడం వల్లనే తెలంగాణ ఏర్పాటుకు ఆలస్యం అవుతోంది వెంటనే విలీనం కావాలనేది వీరి డిమాండ్. వాళ్ల పార్టీ వాళ్ల ఇష్టం వీలీనం అవుతారు కారు, దానికి మీ ఆవేదన ఎందుకు? అని ఆఫ్‌ది రికార్డ్‌గా విలేఖరులు అడిగినప్పుడు టిడిపి నాయకులు తిక్క సంగతి బయటపెట్టారు. టిఆర్‌ఎస్ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తే మా పరిస్థితి దయనీయంగా ఉంటుంది, ఆ రెండు పార్టీలు కలిసిపోతే మేం కనీసం మూడవ స్థానంలోనైనా ఉంటాం అదీ మా లెక్క అని చెప్పుకొచ్చారు. అమ్మో మరీ తిక్కలోళ్లేమీ కాదు వీరి తిక్కకో లెక్కుందనుకున్నారు విలేఖరులు.
- మురళి
జై ఐఆర్!
పాండవులు ఐదుగురు, కౌరవులు వంద మంది! పాండవులు-కౌరవుల మధ్య ఎప్పుడూ విద్వేషమే! వీరు కొట్లాడుకోవచ్చు, తన్నులాడుకోవచ్చు! కానీ మూడో వర్గం వస్తే పాండవులు, కౌరవులు కలిపి (105 మంది) ఐక్యంగా పోరాడతారట. అలాగే ఉంది తెలంగాణా, సీమాంధ్ర ఉద్యోగుల పరిస్థితి అంటున్నారు వీరి కలయికను చూసిన వారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన చేస్తుండగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యోగ సంఘాలు పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఇంతలో వేతన సవరణ అంశం (పిఆర్‌సి) వీరి మధ్యకు వచ్చింది. పిఆర్‌సి నివేదిక అమల్లోకి వచ్చే వరకు మధ్యంతర భృతి (ఐఆర్)ని ప్రభుత్వం ఇస్తుంది. ఐఆర్ కోసం ఇప్పుడు తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు కలిసి పోరాటం చేస్తున్నాయి. దాంతో సామాన్య జనం ఔరా! అనుకుంటూ నోరెళ్లబెడుతున్నారు!!
- పి.వి. రమణారావు
జంప్ జిలానీలు..
కడుపు చించుకుంటే కాళ్ళపై పడుతుందనే సామెత అనాదిగా వాడుకలో ఉంది. మా పార్టీలోనూ జంప్ జిలానీలూ...ఉన్నారు అని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నిస్సంకోచంగా విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఒకరిద్దరు కాదు ఏకంగా సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన సెలవిచ్చారు. పైగా వీరిలో ముగ్గురు, నలుగురు రాష్ట్ర మంత్రులూ ఉన్నారని ఆయన చెప్పారు. బొత్స వ్యాఖ్యల్లోని ఆంతర్యం ఏమై ఉంటుందా? అని విలేఖరులు ముక్కు మీద వేలేసుకున్నారు. అది గ్రహించిన బొత్స మాట్లాడుతూ ఒక నాయకుడు పార్టీ మారితే తప్పకుండా పార్టీకి నష్టం ఉంటుంది కానీ ఇటువంటి వారు పార్టీలోనే ఉంటూ విమర్శిస్తే ఇంకా ఎక్కువ నష్టం కాబట్టి వారు వెళ్ళిపోవడమే మంచిదని చల్లగా చెప్పారు. బొత్స జంప్ జిలానీల సంఖ్య కూడా చెప్పడం విలేఖరులకు విస్మయం కలిగించింది.
- వి. ఈశ్వర్ రెడ్డి
చివరి బంతి గోల!
దాయాదుల మధ్య క్రికెట్ పోరు సమయంలో బంతి, బ్యాట్‌పై జరిగే చర్చకన్నా కూడా నేడు కిరణ్ వేసే బంతిపై చర్చ ఎక్కువైపోతోంది. చివరి బంతితో రాష్ట్ర విభజన నిలిపివేస్తానని నాలుగు నెలల క్రితం చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటికీ అవే మాటలు వల్లెవేస్తున్నారు. విభజన బిల్లుకు కేంద్రం ఆమోదం పొందడం, చర్చకోసం రాష్టప్రతి నుంచి శాసనసభకు రావడం జరిగిపోయింది. ఇక అంతా అయిపోయినట్టేనని భావిస్తున్న తరుణంలో కూడా చివరి బంతి వేసే సమయం ఇంకా రాలేదని కిరణ్ చెబుతున్నారు. ఈ పరిస్థితి చూసిన సీమాంధ్ర విపక్షాలు మాత్రం కిరణ్ డ్రామా అంటూ ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఎప్పుడు ఆ చివరిబంతి... ఎంత వేగంగా ఉంటుందంటూ అంచనాలు వేసేసుకుంటున్నారు. అయితే ఎంత అంచనాలు వేసుకున్నా... వారిలో ఇంకా పూర్తి స్థాయి నమ్మకం మాత్రం కనిపించడం లేదు. మరి చివరి బంతి సంగతి తేలాలంటే వేచి చూడాల్సింది రోజులా? నెలలా? అన్నది కిరణే చెప్పాలి.
- పటౌడీ

రాష్టప్రతి బిజీబిజీ
english title: 
president is busy

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>