తిరుపతి, జనవరి 3: ‘బాపిరాజూ.. టిటిడి నిర్వహిస్తున్న ఎస్వీ భక్తి చానల్లో అలాంటి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారా.. నాకు బాధ కలిగింది’.. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శుక్రవారం టిటిడి చైర్మన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలివి. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చిన గవర్నర్ శుక్రవారం తనకు వీడ్కోలు చెప్పడానికి వచ్చిన టిటిడి చైర్మన్‌ను ఉద్దేశించి ఎస్వీ భక్తి చానల్లో ప్రసారం అవుతోన్న కార్యక్రమాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జనవరి 1 తాను ఎస్వీ భక్తి చానల్లో ప్రసారం చేసిన కార్యక్రమాన్ని చూశానన్నారు. ఆ సమయంలో సుమారు 2 గంటలపాటు భజన కార్యక్రమాలు ఇవ్వడాన్ని గమనించానన్నారు. ఆ స్థానంలో స్వామివారిని చూపించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఎంతోమంది టీవీల ముందు కూర్చుని ఉంటారని, ఆ సమయంలో అటువంటి కార్యక్రమాలు, అందులోనూ నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారిని చూపించకుండా భజనలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అందుకు టిటిడి చైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ ఆ విషయంపై విచారణ జరుపుతామని, తాను ఆ సమయంలో కార్యక్రమం చూడలేదని గవర్నర్‌కు వినయంగా సమాధానమిచ్చారు.
నాకు బాధ కలిగింది: గవర్నర్ * విచారణ జరిపిస్తాం: బాపిరాజు
english title:
governor
Date:
Saturday, January 4, 2014