విజయవాడ, జనవరి 5: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలన్నింటినీ సత్వరం భర్తీ చేసే నిమిత్తం కొద్ది రోజుల్లోనే టెట్, ఫిబ్రవరిలో డిఎస్సీ నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. విజయవాడలో ఏర్పాటైన రాష్టస్థ్రాయి పాఠశాల విద్యా వైజ్ఞానిక గణిత పర్యావరణ ప్రదర్శనను ఆదివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మార్చిలో జరుగనున్న పదో తరగతి, ఇంటర్ పరీక్షలను కట్టుదిట్టంగా, పారదర్శకంగా నిర్వహించడానికి తగు చర్యలు చేపట్టామన్నారు. ప్రయివేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, అయితే దీనిపై జీవో జారీ అయిన వెంటనే ప్రైవేటు సంస్థల యజమాన్యాలు కోర్టుకెళ్లి స్టే తీసుకువస్తున్నాయని, దీనివల్ల ఫీజుల నియంత్రణలో జాప్యం జరుగుతోందని మంత్రి పార్థసారథి వివరించారు.
ఫిబ్రవరిలో డిఎస్సీ: పార్థసారథి
english title:
TET
Date:
Monday, January 6, 2014