చెన్నై, జనవరి 9: ద్రవిడ మునే్నట్ర కజగం (డిఎంకె) అధినేత కరుణానిధి కుమారుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. మదురైలో వివాదాస్పద పోస్టర్లను అంటించారన్న కారణంతో కరుణ పెద్ద కుమారుడైన అళగిరి మద్దతుదారుల్లో ముఖ్యులైన ఐదుగురిని గురువారం పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. వారిలో పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన పి.ఎం.మన్నన్, జనరల్ కౌన్సిల్ సభ్యుడైన ఎస్.ఎజిల్‌మన్నన్ కూడా ఉండటం విశేషం. పార్టీ అధినేత కరుణానిధి హెచ్చరికలు బేఖాతరు చేస్తూ మదురైలో వివాదాస్పద పోస్టర్లను అంటించిన విషయం పార్టీ దృష్టికి వచ్చిందని, తరచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వారిపై చర్య తీసుకోక తప్పలేదని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.అంబజగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ఐదుగురిని పార్టీ సభ్యత్వంతో సహా అన్ని పదవులనుంచి తొలగించినట్లు ఆయన వెల్లడించారు. మన్నన్, ఎజిల్‌మన్నన్, ముబారక్ మందిరి, అంబరసు ఎలాంగో, ఎం.బాలాజీలు గత కొద్ది రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, దీంతో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మదురైలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న పార్టీ కార్యవర్గాన్ని డిఎంకె అధిష్ఠానం రద్దుచేసింది. స్టాలిన్ మద్దతుదారులతో తాత్కాలిక కార్యవర్గాన్ని ఏర్పాటుచేశారు. వారసత్వం కోసం అళగిరి, స్టాలిన్ మధ్య పోటీ నెలకొన్న విషయం విదితమే. ఈ క్రమంలో నెలకొన్న తాజా పరిణామాల్లో స్టాలిన్‌దే పైచేయిగా మారడం గమనార్హం.
ద్రవిడ మునే్నట్ర కజగం (డిఎంకె) అధినేత కరుణానిధి కుమారుల
english title:
dmk
Date:
Friday, January 10, 2014