జీడిమెట్ల, జనవరి 10: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గెలుపొందే నాయకులకే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌ను కేటాయించాలని ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున అనుచరగళంతో నగరంలోని గాంధీభవన్‌కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్ దూత, కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ప్రకాశ్ హెల్‌గుల్వార్‌ను కలిసి శ్రీశైలంగౌడ్ తన ప్రొఫైల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలంగౌడ్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అన్ని రాష్ట్రాలు, జిల్లాల ప్రజలు నివసిస్తారని, వారు పనిచేసే నాయకునికి పట్టం కడతారని పేర్కొన్నారు. 2009 సంవత్సరంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన తనకు 25 వేల మెజారిటీతో ప్రజలు గెలిపించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో నాయకులు కూన శ్రీనివాస్‌గౌడ్, జైకుమార్‌గౌడ్, రావుల శేషగిరి, రాముగౌడ్ పాల్గొన్నారు.
బిసిలకు 50 శాతం టిక్కెట్లను కేటాయించాలి
బిసిలకు 50 శాతం టిక్కెట్‌లను కేటాయించాలని రంగారెడ్డి జిల్లా ఓబిసి సెల్ కాంగ్రెస్ కన్వీనర్ బత్తిని రామలుగౌడ్ కోరారు. శుక్రవారం గాంధీభవన్‌కు తరలివెళ్లి జిల్లాలో పార్టీ గురించి వివరిస్తూ టిక్కెట్‌ల విషయాన్ని తెలుపుతూ పార్టీ పరిశీలకుడు ప్రకాశ్‌హెల్ గుల్వర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గెలుపొందే
english title:
g
Date:
Saturday, January 11, 2014