హైదరాబాద్, జనవరి 10: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయినప్పటి నుండి తెలంగాణా ప్రాంతానికి అన్యాయం జరుగుతూ వస్తోందని, అందుకే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం వచ్చిందని శాసనమండలిలో సిపిఐ పక్షం నాయకుడు పి.జె. చంద్రశేఖరరావు అభిప్రాయపడ్డారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013’ పై శాసనమండలిలో శుక్రవారం జరిగిన చర్చలో పాల్గొంటూ, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంగా ఆంధ్రా-తెలంగాణా నాయకుల మధ్య కుదిరిన ‘పెద్దమనుషుల ఒప్పందం’ అమలుకు నోచుకోలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఒక ప్రాంతానికి రెండు పంటలకు నీటిని ఇస్తుండగా, మరో ప్రాంతంలో ఒక పర్యాయం కూడా సాగునీటిని ఇవ్వలేని పరిస్థితి కల్పించారన్నారు. నదీజలాల వివాదం అన్ని ప్రాంతాల్లో ఉంటుందని, విభజన వల్ల కొత్తగా వచ్చేది ఏమీ కాదన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాలను కొత్తరాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఉన్నప్పటికీ, కేవలం తెలంగాణానే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల టిడిపి సభ్యుడు సతీష్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని దేశాలే కలిసి ఒకే దేశంగా ఏర్పడుతుండగా మన రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించడంలో అర్థం లేదన్నారు. కలిసి ఉంటేనే సుఖం ఉంటుందని, అందువల్ల బిల్లును వ్యతిరేకిస్తున్నానని సతీష్‌రెడ్డి ప్రకటించారు.
సిపిఐ నేత చంద్రశేఖర్
english title:
cpi
Date:
Saturday, January 11, 2014