Date:
Monday, January 13, 2014 (All day)
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
బంధు, మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ప్రయాణాలవల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని అనుభవిస్తారు.
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.)
ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. క్రొత్త వ్యక్తులను నమ్మి మోసపోరాదు. మానసికాందోళన తప్పదు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.)
ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.)
శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశే్లష)
ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటారు. అనారోగ్య బాధవలన బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లరాదు.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.)
బంధు మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది అనారోగ్య బాధలు అధికమవుతాయి. చెడు సహవాసంవైపువెళ్లకుండా వుంటే గౌరవం దక్కుతుంది. క్షణకావేశం పనికిరాదు.ఋణప్రయత్నం ఫలిస్తుంది.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.)
మానసికాందోళన ఉంటుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. ధర్మకార్యాలు చేస్తారు. దైవ ప్రార్థన మీకుసంతోషాన్ని ఇస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,)
స్ర్తిల మూలకంగా లాభాలుంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు.
కుంభం:
(్ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.)
వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ధనలాభంతో ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు. స్ర్తిలు, బంధు, మిత్రులను కలుస్తారు.
దుర్ముహూర్తం:
మ.12.24 నుండి 01.12 వరకు తిరిగి మ.02.48 నుండి 03.36 వరకు
రాహు కాలం:
.............
వర్జ్యం:
మ.11.22 నుండి 1.07 వరకు
నక్షత్రం:
మృగశిర పూర్తి
తిథి:
శుద్ధ త్రయోదశి రా.4.55
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చగుటచే ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు.