Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘పునర్వ్యవస్థీకరణ’ పోరు!

$
0
0

హైదరాబాద్, జనవరి 13: ఒకవైపు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు చర్చల్లో ఉండగా... మరోవైపు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశం కూడా తెరపైకి వస్తోంది. రాష్ట్ర విభజనతోపాటు రెండు ప్రాంతాల్లో నియోజకవర్గాల విభజనపై కూడా నేతలు ఆశలు పెంచుకుంటున్నారు. ఇప్పటివరకు ప్రతి పార్లమెంట్ స్థానంలో ఏడు శాసనసభ స్థానాలు ఉండగా, వాటిని తొమ్మిదికి పెంచాలని ముందుగా తెలంగాణ ప్రాంత నేతలు డిమాండ్ ప్రారంభిస్తున్నారు. ఇదే సమయంలో తమ ప్రాంతంలో కూడా పెంచాల్సి ఉంటుందని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు డిమాండ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదే అంశం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారుతోంది. రాష్ట్ర విభజన పర్వం దాదాపుగా పతాకస్థాయికి చేరుకోవడంతో ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనపై కూడా ప్రచారం ప్రారంభమవుతోంది. పార్లమెంట్ స్థానానికి ఏడు శాసనసభ స్థానాల చొప్పున ఉన్న విధానంలో తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతోపాటు, 119 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో 25 లోక్‌సభ స్థానాలతోపాటు, 175 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంఖ్యను ఒకటి-తొమ్మిది నిష్పత్తిలో మార్పు చేస్తే తెలంగాణలో 153, సీమాంధ్రలో 225 శాసనసభ స్థానాలు ఏర్పడాల్సి ఉంటుంది.
వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నియోజకవర్గాల సంఖ్యను పెంచుకుంటామని గతంలోనే తెలంగాణ ప్రాంతానికి చెందిన వివిధ పార్టీల నేతలు ప్రకటించారు. రాజకీయ నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వారు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇదే తరహా ఆలోచన సీమాంధ్రలో కూడా ప్రారంభం కావడం గమనార్హం. ప్రస్తుతం అనేక మంది శాసనసభ్యులు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారడం జోరుగా సాగుతోంది. దీనివల్ల టికెట్ల పంపకాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను అధిగమించాలంటే శాసనసభ నియోజకవర్గాలు అదనంగా ఉండాల్సిన అవసరం ఉందని వివిధ పార్టీల వారు అంటున్నారు. అందుకే కొత్త నియోజకవర్గాల ఆవస్యకతపై కూడా వారు గట్టిగా వాదిస్తున్నారు.
అయితే నియోజక పునర్వ్యవస్థీకరణ జరగాలంటే అందుకు పెద్ద తతంగమే అవసరం. నియోజకవర్గాల విభజన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి నిర్ధిష్టమైన సరిహద్దులతో కొత్త నియోజకవర్గాలను గుర్తించాల్సి ఉంటుంది. గతంలో దేశ వ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభ పునర్వ్యవస్థీకరణ నిర్వహించినప్పుడు కొనే్నళ్లు తతంగాన్ని కొనసాగించాల్సి వచ్చింది. ఇప్పుడు అంత పెద్ద స్థాయిలో ప్రక్రియ లేకపోయినప్పటికీ కనీసం ఏడాది కాలమైన పడుతుందని అధికారులు అంటున్నారు. అంతా అయ్యాక కొత్త నియోజకవర్గాలకు రాజ్యాంగ బద్ధత కల్పించాలి. అందువల్ల ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించినప్పటికీ కొత్త నియోజకవర్గాలతో మాత్రం ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉండవు. కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభించి 2019 ఎన్నికల్లో మాత్రమే కొత్త నియోజకవర్గాలతో ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

నిన్న తెలంగాణ కోసం.. నేడు అదనపు నియోజకవర్గాల కోసం డిమాండ్ ఒక లోక్‌సభ స్థానంలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉండాలని ప్రతిపాదన
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>