హైదరాబాద్, జనవరి 15: నగరంలోని తుకారాం గేట్ వద్ద గుర్తు తెలియని ఓ వ్యక్తి కత్తితో గొంతుకోసుకుని హల్‌చల్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. తుకారాంగేట్ రైల్వే గేట్ సమీపంలో బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి కత్తితో గొంతుకోసుకున్నాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు తీవ్ర రక్తస్రావం అవుతున్న వ్యక్తి వద్దకు వెళ్లారు. దీంతో ఒక్కసారిగా అతడు వారిపైకి దాడికి యత్నించడంతో ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
స్థానికులు 108 అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఆ వ్యక్తి పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది పైకి కూడా కత్తితో దాడికి యత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతడి కాళ్లు, చేతులు కట్టేసి అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని మానసిక రోగిగా పోలీసులు భావిస్తున్నారు. వివరాలు తెల్సుకునేందుకు ఎంత యత్నించినా అతడు చెప్పడానికి నిరాకరించాడు. దీంతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
తుకారాం గేట్ వద్ద కలకలం * 108 సిబ్బందిపై దాడికి యత్నం
english title:
d
Date:
Thursday, January 16, 2014