హైదరాబాద్, జనవరి 15: ఉన్నతవిద్యాభ్యాసం, ఉపాధి నిమిత్తం సౌతాఫ్రికా, నైజీరియా, మంగోలియా తదితర దేశాల నుంచి నగరానికి వచ్చిన యువత జల్సాలకు అలవాటు పడి తప్పుదోవ పడుతోంది. గట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేయటం, మోసాలు వంటి ఆర్థిక నేరాలకు పాల్పడుతూ ఇటీవలి కాలంలో అనేకమంది పోలీసులకు చిక్కారు. టాలీవుడ్‌ను పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాలు దిగుమతి చేస్తూ, ప్రముఖులకు సరఫరా చేస్తున్న నైజీరియన్లను పోలీసులు ఎప్పటికపుడు అరెస్టులు చేస్తున్నా, వారిలో నేర ప్రవృత్తిని నమ్ముకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మన దేశ యువత కన్నా కాస్త కఠినమైన మనస్తత్వాన్ని, విచిత్రమైన ఆలోచన విధానాలను కల్గిన ఈ విదేశీయులు పేద, మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా నివసించే ప్రాంతాలను టార్గెట్ చేసుకుని తిష్టవేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో భవన యజమానులకు అద్దెలు చెల్లిస్తూ అసాంఘిక కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో హుమాయునగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇదే సంతతికి చెందిన అన్నదమ్ముల మధ్య తీవ్ర వివాదం చెలరేగి ఒకరి హత్యకు గురైన సంఘటన ఉంది. మహోన్నతమైన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. నగరంలో ఒక వర్గం వారు ఎక్కువగా నవసించే ప్రాంతాలను ఎంపిక చేసుకుని అద్దెకు ఇళ్లను తీసుకుని బార్‌లుగా, పబ్‌లుగా మారుస్తూ శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో ఇదే తరహాలో నగరంలో తిష్ట వేసిన నైజీరియన్లు, సౌతాఫ్రికా వంటి దేశాలకు చెందిన యువకుల విజిటింగ్ వీసాలా గడువు ముగిసిన విషయాన్ని గుర్తించి పోలీసులు కొందర్ని అరెస్టు కూడా చేశారు. ఇటీవలి కాలంలో నగరంలో పేదలు నివసించే మురికివాడల్లోనూ వీరి ఆగడాలు అధికమయ్యాయి. పగటివేళ విద్యాభాసం అంటూ వీధుల్లో సంచరించే ఈ విదేశీయులు అర్థరాత్రి అతిగా మద్యం సేవించి పేదలు నివసించే ప్రాంతాల్లో చొరబడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నా, అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఒకే గదిలో నలుగురి నుంచి ఆరుగురి వరకు నివాసముంటూ వారంతపు రోజులైన శుక్ర, శనివారం రోజుల్లో వీరు సృష్టించే న్యూసెన్స్‌కు స్థానికులు తలలు పట్టుకుంటున్నారు. స్థానికంగా విభిన్న మతాలు, కులాలకు చెందిన వారి మనోభావాలకు సంబంధించి ఎలాంటి అవగాహన లేని వీరు స్థానికులకు అర్ధం కానీ భాషలో సంభాషణలు చేస్తూ అయోమయానికే గాక, ఇరుగుపొరుగు వారిని ఆందోళనకు గురి చేస్తున్నారు.
వీరి ఆకతాయి, పోకిరీ చేష్టలను అదుపు చేయటంలో ఇంటిని అద్దెకిచ్చిన యజమానులు, స్థానిక పోలీసులు కూడా ఘోరంగా విఫలమవుతున్నారు. ముఖ్యంగా నగరంలోని టోలీచౌకీ, మెహిదీపట్నం, హుమాయున్‌నగర్, ఫస్ట్‌లాన్సర్, మల్లేపల్లి, ఎసి గార్డ్స్, చింతల్‌బస్తీ, ముషీరాబాద్, నారాయణగూడ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని అద్దె భవనాల్లో తొలుత విద్యార్థులమంటూ యజమానుల డిమాండ్ మేరకు అద్దెలు చెల్లించి ఇంట్లో దిగి, ఆ తర్వాత యజమానులపైనే దాడి చేస్తున్న సంఘటనలున్నాయి.
ఈ రకంగా వివిధ ప్రాంతాల్లో తిష్టవేసిన ఈ విదేశీయుల గుర్తింపు కార్డులు, వీసాలు, పాస్‌పోర్టులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి, ఇక్కడ మెలగాల్సిన తీరుపై కౌన్సిలింగ్ ఇస్తే వీరి నేరాలు కొంతమేరకైనా తగ్గుతాయన్న వాదన ఉంది.
* జల్సాల కోసమే డ్రగ్స్ అమ్మకాలు * తాజాగా చీటింగ్ కేసులో మరికొందరి పట్టివేత * నగరంలో పెరుగుతున్న నైజీరియన్ల మోసాలు
english title:
v
Date:
Thursday, January 16, 2014