హైదరాబాద్, చార్మినార్, జనవరి 15: పాతబస్తీలోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చావని ప్రాంతంలో నివసించే అబ్దుల్ గని కుమారుడు అబ్దుల్ నవాజ్ (16) బాలుడి మిస్సింగ్ కేసుకు తెరపడింది.
ఈనెల 11న నవాజ్ కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడు హత్యకు గురైనట్లు, అందుకు పాత కక్షలే కారణమైనట్లు, గుర్తించిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెత్తబజార్‌లోని ఒక నాన్‌కిరోటీ మేకర్స్ తయారీ దుకాణంలో పనిచేసే నవాజ్ స్థానికంగా ఉన్న ఐదుమంది స్నేహతులతో నెల రోజుల క్రితం గొడవపడ్డాడు. అందులో ఒకర్ని హతమారుస్తానంటూ నవాజ్ హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన ఆ ఐదుగురు హుస్సేన్, షాబాజ్, కుసూర్, మహమూద్, అలిబామ్‌లు తమపై నవాజ్ దాడి చేయక ముందే నవాజ్‌ను హత్య చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా ఈనెల 11న అర్ధరాత్రి నవాజ్‌తో పని ఉందంటూ, రెయిన్ బజార్ నాలా వద్దకు పిలిపించుకుని ఐదుగురు మూకుమ్మడిగా కత్తులు, ఇనుప రాడ్లతో విచ్ఛలవిడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగకుండా మ్యాన్‌హోల్ తెరిచి అందులో నవాజ్‌లో పడేసి పైకప్పు మూసేశారు. బుధవారం ఉదయం నవాజ్ మృతదేహం నాలాలో బయటకు వచ్చింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అది నవాజ్‌గా గుర్తించి అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హత్యకు పాల్పడ్డ ఆ ఐదుగురిపై తాము గతంలోనే అనుమానం వ్యక్తం చేసినట్లు నవాజ్ తల్లిదండ్రులు చెప్పారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణలో మైనార్టీలకు పెద్దపీట
కెపిహెచ్‌బికాలనీ, జనవరి 15: తెలంగాణ రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలతో పాటు మైనార్టీలకు పెద్దపేట వేస్తామని కూకట్‌పల్లి నియోజకవర్గం టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి గొట్టిముక్కల పద్మారావు అన్నారు.
ముస్లీంల పండగల్లో పవ్రితమైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఫతేనగర్‌లోని జమామసీద్‌కు చెందిన మొహ్మద్ హమీద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పద్మారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో మైనార్టీలకు అన్ని విధాలుగా నాయ్యం జరుగుతుందని అన్నారు.
అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మహ్మద్ వాహెద్, గాఫర్, అబిబ్, మిర్జా నజీం, షేక్‌గౌస్, సునీల్‌రెడ్డి, బిక్షపతి, ఎల్లయ్యగౌడ్, రాజలింగం పాల్గొన్నారు.
* మిస్సింగ్ కేసు మిస్టరీకి తెర * నాలాలో మృతదేహంగా తేలిన నవాజ్ * ఐదుగురి అరెస్ట్
english title:
b
Date:
Thursday, January 16, 2014