
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలలో భాగంగా గురువారం తాతగుడి సెంటర్‌లోని శ్రీ గోవిందరాజస్వామి వారి మంటపంలో రామయ్యకు రాపత్తు ఉత్సవం ఘనంగా జరిగింది. తొలుత రామాలయంలోని ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం పూల పల్లకిపై ఆశీనులను చేసి తిరువీధి సేవగా తాతగుడి సెంటర్ వరకు తోడ్కోని వచ్చారు. తర్వాత గోవింద రాజస్వామివారి మంటపంలో స్వామిని ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో
english title:
b
Date:
Friday, January 17, 2014