ఖానాపురం హవేలి, జనవరి 17: ఖమ్మం నగరంలో ధర్నాచౌక్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పలు సంఘాలు, పార్టీలు ప్రజా సమస్యలపై కలెక్టరేట్ ఎదుట నిత్యం ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ప్రభుత్వాసుపత్రి గోడకు టెంట్లు వేసి ధర్నాలు చేస్తుండటంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ విషయాన్ని గమనించి గతంలో సిక్వెల్ రిసార్ట్స్ వద్ద ధర్నాచౌక్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే పార్టీలు, సంఘాలు దానిని వ్యతిరేకించటంతో పాటు అధికారులు వెనుకంజవేశారు. ఇటీవల కాలంలో ధర్నాచౌక్ ఏర్పాటు చేయాల్సిన మరింత పెరగటంతో జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, ఎస్పీ ఏవి రంగనాథ్‌లు చొరవ తీసుకొని ధర్నాచౌక్‌ను ప్రభుత్వాసుపత్రి ప్రాంగణం చివరిభాగంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సుమారు 2వేల మంది పట్టే విధంగా ఉన్న ఈ స్థలం కలెక్టర్ కార్యాలయానికి అతీ సమీపంలో ఉండటం గమనార్హం. దీనిపై సంఘాలు, పార్టీలు కూడా ఎవరు అభ్యంతరం పెట్టలేదు. ఈ ధర్నాచౌక్ ఏర్పాట్లను డిఎస్పీ బాలకిషన్‌రావు, ట్రాఫిక్ సిఐ రామోజీరమేష్, టూ టౌన్ సిఐ సారంగపాణి తదితరులు శుక్రవారం పరిశీలించారు. రెండు, మూడు రోజుల్లోగా ఏర్పాట్లు పూర్తిస్థాయిలో పూర్తవుతాయని, అనంతరం ధర్నా చేయాల్సిన వారెవరైనా ఇక్కడ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులకు భంగం కలగకుండా తమ నిరసన తెలియచేసే స్వేచ్ఛ ఉందని, దానిని ఈ ధర్నాచౌక్ ద్వారా ఉపయోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం నగరంలో ధర్నాచౌక్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు
english title:
dharna chowk
Date:
Saturday, January 18, 2014