చింతకాని, జనవరి 17: రాష్ట్రంలో అభివృద్ధి, సుపరిపాలన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలో వందనం గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు పొనుగోటి రత్నాకర్ అధ్యక్షతన జరిగిన మండల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయని, ప్రజలు తెలుగుదేశం పార్టీ పాలన కోరుతున్నారని పేర్కొన్నారు. అవినీతి డబ్బుతో ఏర్పాటు చేయబడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, పాలనలో విఫలమైన కాంగ్రెస్‌లకు పతనం ప్రారంభంమైందన్నారు. పేదవాడికి కూడు, గూడు, నీడ నినాదంతో వచ్చిన తెలుగుదేశం పార్టీ రానున్న సాధారణ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయం అన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలిన కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. జిల్లాలో ఒక్క ఎకరానికి సాగునీరు అందించలేని ప్రజా ప్రతినిధులు ఎందుకని ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని నిర్విర్యం చేసి, అన్నదాతలు అప్పుల పాలు కావడానికి పాలకులు అవలంభించిన విధానాలే కారణం అని మండిపడ్డారు. పారిశ్రామిక రంగం సైతం రాష్ట్రంలో దుస్థితిలో ఉందన్నారు. ఉపాధి కల్పించడంలో పాలక వర్గం చేతులు ఎత్తేసిందని అవేదన వ్యక్తం చేశారు. మధిర నియోజక వర్గంలో తెలుగుదేశం పాలన కాలంలో 14 బ్రిడ్జిలను నిర్మించిందని, నేడు ఒక బ్రిడ్జి నిర్మించి వంద ఫ్లెక్సీలు పెట్టుకోవడం విఢ్డురంగా ఉందన్నారు. అధికార పార్టీ ఏర్పాటు చేసే విగ్రహాలు అధికారులు విగ్రహాలుగా భవిస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారులు ప్రజలందరిని సమాన దృష్టితో చూడాలన్నారు. కమీషన్‌ల కోసమే నియోజకవర్గంలోని రోడ్లకు తారు పూత పుస్తున్నారని విమర్శించారు. ప్రజలకు పనిచేయని ప్రభుత్వాన్ని పారదోలలని, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు సైనికుల వలే పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 19న లచ్చగూడెం, నెరడ గ్రామాల్లో జరిగే ఎన్టీఆర్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమాలకు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రంమలో పాల్గొన్నా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, బిరెడ్డి నాగచంద్రరెడ్డిలు మాట్లాడుతూ రానున్న మూడు నెలలు నాయకులకు, పార్టీ కార్యకర్తలకు పరీక్ష కాలం వంటిదని, ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయేంతవరకు విశ్రమించకుండా పనిచేయడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వల్లంకొండ వెంకటరామాయ్య, పెంట్యాల పుల్లయ్య, మంకెన రమేష్, చల్ల అచ్చయ్య, నున్న తాజుద్దిన్, నెల్లూరి కోటి, తాతా ప్రసాద్, గోళ్ళమందల బాబు, బాడే సాహెబ్, ఆయా గ్రామాల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సుపరిపాలన తెలుగుదేశం
english title:
tdp
Date:
Saturday, January 18, 2014