Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

భారీ ప్రదర్శనతో స్వాగతం

$
0
0

కొత్తగూడెం , జనవరి 17: పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం పట్టణంలో శనివారం నుంచి ప్రారంభమయ్యే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ విజయవంతం కోసం శుక్రవారం కొత్తగూడెం పట్టణంలో స్వాగత ప్రదర్శనను పెద్దఎత్తున నిర్వహించారు. స్థానిక ప్రకాశం స్టేడియం గ్రౌండ్ నుంచి ప్రదర్శనను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆర్మీ సిబ్బంది, పోలీసులు కవాతు నిర్వహించారు. ఈకార్యక్రమంలో కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ అధికారి అమయ్‌కుమార్, డిఎస్పీ రంగరాజు భాస్కర్, సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్ సత్యసాగర్‌బాబు, సెట్‌కం సిఇఓ వెంకటరమణయ్య, తహశీల్దార్ కెపి నర్సింహులు, సిఐలు నరేష్‌కుమార్, సుధాకర్, వెంకటస్వామిలు అగ్రభాగన నిలిచి పట్టణంలో పెద్దఎత్తున ప్రదర్శన చేశారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి అమయ్‌కుమార్, డిఎస్పీ రంగరాజు భాస్కర్ మాట్లాడుతూ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి వచ్చే అభ్యర్థులు నిర్ధేశించిన సమయంలోనే హాజరుకావాలని కోరారు. ప్రతిభ ఆధారంగానే రిక్రూట్‌మెంట్ జరుగుతుందని, అభ్యర్థులెవరూ దళారులను ఆశ్రయించవద్దని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులైన యువకులు ఉపాధి అవకాశాల కోసం ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని ఉపయోగించుకోవాలని కోరారు. ఈర్యాలీలో రెవెన్యూ, సింగరేణి, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ను
సద్వినియోగపర్చుకోవాలి
* కొత్తగూడెం ఆర్డీఓ అమయ్‌కుమార్
కొత్తగూడెం టౌన్, జనవరి 17: నిరుద్యోగ యువకులు కొత్తగూడెం పట్టణంలో నిర్వహిస్తున్న ఆర్మీరిక్రూట్‌మెంట్‌ను సద్వినియోగపర్చుకోవాలని కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ అధికారి అమయ్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ప్రకాశంస్టేడియం గ్రౌండ్‌లో ఆర్మీరిక్రూట్‌మెంట్ ర్యాలీ ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనడం ద్వారా యువకులు దేశరక్షణలో కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. భద్రతతో పాటు తల్లిదండ్రులకు, గ్రామానికి మంచిపేరు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుందని, గ్రామాల్లో భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయంగా నిలిచే అవకాశం ఉంటుందన్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు వచ్చే యువతకు సింగరేణి యాజమాన్యం అన్నిరకాల సదుపాయాలను కల్పిస్తుందని, స్వచ్ఛంద సంస్థలు కూడా పూర్తిస్థాయిలో తమ సహకారాన్ని అందిస్తున్నాయని తెలిపారు. మారుమూల గ్రామాల్లోని యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఇప్పటికే సింగరేణి సేవాసమితి ద్వారా గత మూడునెలలుగా 600మంది యువతకు ఆర్మీపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని వివరించారు. ఈనెల 18 నుంచి 23 వరకు నిర్వహించే ఆర్మీరిక్రూట్‌మెంట్ ర్యాలీని విజయవంతం చేసేందుకు అన్నివర్గాల ప్రజలు సంపూర్ణ సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.

గిరిజనుడి హత్యపై కేసు నమోదు
చింతూరు, జనవరి 17: మండల పరిధిలోని బొడ్డుగూడెం గ్రామంలో గురువారం రాత్రి జరిగిన గిరిజనుడి హత్య సంఘటనపై శుక్రవారం చింతూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి సిఐ స్వామి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి...బొడ్డుగూడెం గ్రామం పాతగుంపునకు చెందిన కరకా భద్రయ్య, కరకా రామయ్యలు అన్నదమ్ములు. వీరు గురువారం రాత్రి ఓ చిన్న విషయమై ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో అన్న భద్రయ్య మృతి చెందాడు. రాత్రి సమయంలో భద్రయ్య సమీపంలోని అటవీ ప్రాంతానికి తన తమ్ముడు రామయ్య బంధువులకు చెందిన వేట కుక్కలను వెంట తీసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో వాటిని ఎందుకు తీసుకెళ్తున్నావని రామయ్య అడ్డుకుని వారించాడు. దీంతో వారి మధ్య మాటా మాటా పెరిగి చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకొంది. ఈ సమయంలో రామయ్య తన చేతిలో ఉన్న కర్రతో భద్రయ్య తలపై గట్టిగా మోదాడు. తీవ్ర గాయాలపాలైన భద్రయ్యను ఏడుగురాళ్లపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కాగా భద్రయ్య మానసిక పరిస్థితి బాగోలేదని, అప్పుడప్పుడు మద్యం సేవించి గ్రామస్థులు, కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడుతూ కొడుతుంటాడు. ఈ క్రమంలోనే గత రాత్రి కూడా మద్యం సేవించి తల్లితో ఘర్షణ పడిన అనంతరం కుక్కలను తీసుకెళ్తున్న సమయంలో రామయ్య ఎదురుపడగా ఈ ఘటన చోటు చేసుకుందని సిఐ స్వామి వెల్లడించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
పోలీసులకు, గ్రామస్థులకు మధ్యవాగ్వాదం
బొడ్డుగూడెం గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణలో అన్న మృతి చెందిన ఘటనపై విచారణ జరిపేందుకు శుక్రవారం చింతూరు ఎస్‌ఐ రవీందర్ తన సిబ్బందితో గ్రామానికి వెళ్లారు. గ్రామస్థులను విచారించేందుకు ప్రయత్నించగా గ్రామస్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ గ్రామం నుంచి ఎటువంటి కేసు పెట్టడం గానీ పిటీషన్ పెట్టడం గానీ జరగలేదని, మీరు ఎందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య జరిగినపుడు కేసు నమోదు చేయాల్సిన బాధ్యతపై మాపై ఉందని, చట్టప్రకారం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయినా గ్రామస్థులు ఆయన మాటలను ఖాతరు చేయకుండా అసలు మేము కేసు పెట్టకుండా మీరేలా నమోదు చేస్తారని వాగ్వాదానికి దిగారు. మృతదేహాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించేందుకు సైతం గ్రామస్తులు సాయం చేయకుండా నిరాకరించారు. దీంతో ఎస్‌ఐ చేసేది లేక సిబ్బందితో మృతదేహాన్ని చింతూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం చేశారు.

రేషన్ సరుకులను నల్లబజార్‌కు తరలిస్తే క్రిమినల్ కేసులు
ఖానాపురం హవేలి, జనవరి 17: రేషన్ సరుకులను నల్లబజార్‌కు తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయటం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో సివిల్ సప్లై, విజిలెన్స్, రైస్ మిల్లర్ల అసోసియేషన్‌తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల ఆహార భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులను విక్రయిస్తుందన్నారు. వాటిని సక్రమంగా పేదవారికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నిజాయితీగా పని చేసే వారికి జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలు ఉంటాయని, అవకతవకలకు పాల్పడే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేయబడుతున్న సరుకుల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రతి గ్రామంలో ఇందిరా క్రాంతి పథం సభ్యులు ఐదుగురితో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. డీలర్లపైన, అధికారులపైన ఫిర్యాదులు వస్తే విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కీ రిజిష్టర్‌న్రు ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయించాలని, అలా చేయని వారికి గ్యాస్ రాయితీ రాదని వివరించారు. వచ్చే మూడు నెలల్లో జిల్లాలో ఈ పిడియస్ విధానం అమల్లోకి రానుందని, ఇంకొందరు మన జిల్లాను మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వ పైలెట్ జిల్లాగా ఎంపిక చేసినట్లు చెప్పారు. కిరోసిన్ అక్రమ రవాణాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల అవసరం మేరకు అమ్మహస్తం సరుకులు సరఫరా చేయనున్నామని, ముందుగానేడీలర్లు అవసరమైన సరుకు వివరాలు అందచేయాలన్నారు.
అంతే కానీ అమ్మహస్తం సరుకులు ప్రజలు తీసుకోవటం లేదని డీలర్లు చెప్తున్నారని, అలా కాకుండా పరిశీలన చేసి అవసరం మేరకు ఇన్‌డెంట్ పంపాలని, అమ్మహస్తం సరుకులు కావాలనుకునే ప్రజలకు అందించలేనప్పుడు సంబంధిత డీలర్, డిటిసిఎస్‌లపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. డీలర్లకు బ్యాంక్‌లు ఎటువంటి షూరిటీలు లేకుండా రుణాలను అందించేందుకు వచ్చాయని, డీలర్లు సంబంధిత బ్యాంక్‌వారిని సంప్రదించాలన్నారు. రేషన్‌సరుకులు ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి రేషన్‌షాపులకు చేర్చటానికి రూట్ అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. డిటిసిఎస్‌కు వచ్చే నెలలో ఒక విఆర్‌ఏను కేటాయించనున్నట్లు తెలిపారు.

నెల్లిపాక సొసైటీలో 4.65 కోట్ల ధాన్యం కొనుగోలు
అశ్వాపురం, జనవరి 17: మండల పరిధిలోని మొండికుంట నెల్లిపాక సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటికే రూ.4.65 కోట్ల విలువైన ధాన్యంను కొనుగోలు చేశారు. గత ఏడాది రూ.3.75 కోట్ల ధాన్యం కొనుగోలు చేసి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచారు. ఈ ఏడాది అది ఇప్పటికే దాటిపోయింది. మండలంలో ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య పెరిగింది. మల్లెలమడుగు, మొండికుంట, ఆనందాపురం, సీతారాంపురం, అశ్వాపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో రైతులకు కేంద్రాలు బాగా అందుబాటులోకి వచ్చాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుండటంతో రైతులకు సమస్యలు తగ్గాయి. గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు రెండు, మూడు నెలల తర్వాత డబ్బులు అందేవి. ఈసారి వారం, పది రోజుల్లోనే డబ్బులు చేతికందుతుండటంతో రైతులకు వెసులుబాటుగా మారింది. నెల్లిపాక సహకార సంఘం ఒక అడుగు ముందుకేసి ధాన్యం విక్రయించిన వెంటనే రైతులకు డబ్బులు చెల్లిస్తోంది. అధిక శాతం రైతులు ఇక్కడే ధాన్యం విక్రయిచేందుకు వస్తున్నారు. ఐకెపి ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈసారి వెనుకపడ్డాయి. మల్లెలమడుగు, ఆనందాపురం, అశ్వాపురం గ్రామాల్లో ఐకెపి కేంద్రాలు ఉన్నాయి. మల్లెమడుగులో రూ.80 లక్షల ధాన్యం కొనుగోలు జరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇది చాలా తక్కువే. గత ఏడాది రూ.2.75 కోట్ల ధాన్యం కొనుగోలు చేశారు. నెల్లిపాక సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో రైతులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతులు సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించేందుకు ఇష్టపడుతున్నారు. ఇదే నెల్లిపాక కొనుగోలు కేంద్రానికి బాగా కలిసొచ్చింది. ధాన్యం విక్రయించేందుకు రైతులు గతంలో ఇబ్బందులు పడునప్పటికీ ఈ ఏడాది ఆ ఇబ్బందులు లేవని రైతులు అంటున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులోకి వచ్చినందున పరిస్థితులు అనుకూలించి గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు వెంటనే డబ్బులు కూడా చెల్లిస్తుండటంతో అధిక శాతం మంది రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయిస్తున్నట్లు తెలిపారు.

పినపాక కాంగ్రెస్‌లో అసమ్మతి
మణుగూరు, జనవరి 17: పినపాక నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాగం గట్టిగా విన్పిస్తోంది. ఎమ్మెల్యే రేగా కాంతారావు తీరుపై నియోజకవర్గంలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కొంత కాలంగా మండలంలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపించనుండటంతో ఒకరి తర్వాత ఒకరు తమ ఆవేదనను చెప్పుకుంటూ వస్తున్నారు. శుక్రవారం మండలంలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు స్థానిక ధ్యాన మందిరంలో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పాతికేళ్ల అనంతరం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేసిన తమను ఎమ్మెల్యే రేగా విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీనే నమ్ముకొని ప్రజల సమస్యలపై పని చేస్తున్న తమను గుర్తించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి పెద్దపీట వేస్తూ కనీసం మండల సమావేశాలకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కనీసం పార్టీ కోసం ఇన్నాళ్లుగా పని చేస్తున్న తమకు గౌరవంతో పాటు కనీసం పలకరింపు సైతం లేదని వాపోయారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు కుడితిపూడి కోటేశ్వరరావు, కుంజా శంకర్, బండ్ల సూర్యం తమ అభిప్రాయాలను వెల్లడించారు. సుమారు 200 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు ఏకపక్ష ధోరణిని తూర్పారబట్టారు. ఇలాంటి ఎమ్మెల్యేను తానెప్పుడూ చూడలేదని కుంజా శంకర్ అన్నారు. తన సొంత గ్రామమైన పగిడేరు గ్రామానికి కనీసం అంతర్గత రహదారులకై నిధులు కేటాయించమని గెలిచిన నాడు చెప్పినా నేటికీ ఆ ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నేతలపై ఉందన్నారు. ప్రస్తుత తరుణంలో రాజకీయ పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే సీనియర్ల అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ సమావేశంలో నాయకులు ఎంకెఎం రాజు, పాలమూరి రాజు, రుద్ర నాగరాజు, నూరుద్ధీన్, ఆవుల సర్వేశ్వరరావు, బానోతు లక్ష్మణ్, కురం నర్సింహారావు, చలపతి, కె రవి, ఖాసీం, ఎం కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్మీరిక్రూట్‌మెంట్ ర్యాలీకి భారీ పోలీస్ బందోబస్తు
కొత్తగూడెం టౌన్, జనవరి 17: కొత్తగూడెం పట్టణంలో నిర్వహించే తెలంగాణలోని పదిజిల్లాలకు సంబంధించిన ఆర్మీరిక్రూట్‌మెంట్‌లో ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. జిల్లా నలుమూలల నుండి పోలీస్‌సిబ్బందిని ఆర్మీరిక్రూట్‌మెం ట్ కోసం తరలించారు. ఆర్మీరిక్రూట్‌మెంట్‌కు సం బంధించి పోలీస్ సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తల ను కొత్తగూడెం డిఎస్పీ రంగరాజు భాస్కర్ శుక్రవా రం పోలీస్‌సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఆర్మీరిక్రూట్‌మెంట్‌లో సుమారు 700మంది పోలీస్‌సిబ్బంది విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు. 600మంది పోలీస్ కానిస్టేబుళ్ళు, 27మంది ఎస్‌ఐలు, 7గురు సిఐలు, ముగ్గురు డిఎస్పీలు బందోబస్తును పర్యవేక్షించనున్నారు. సింగరేణికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బందిని 180మందిని నియమించారు. ఆర్మీరిక్రూట్‌మెంట్‌ను విజయవంతం చే సేందుకు పోలీస్‌సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని డిఎస్పీ రంగరాజు భాస్కర్ సిబ్బందికి విజ్ఞప్తి చేశారు.
అభ్యర్థులకు అధికారుల సూచనలు
కొత్తగూడెం పట్టణంలో శనివారం నుండి ప్రారంభమయ్యే ఆర్మీరిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే అభ్యర్థులు నేరుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు హాజరుకావాలని కొత్తగూడెం ఆర్డీఓ అమయ్‌కుమార్, డిఎస్పీ రంగరాజు భాస్కర్, ఆర్మీ కల్నల్ యోగేశ్వర్ మొదలియార్‌లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులు మొదట జూనియర్ కళాశాలలో ఒరిజినల్ సర్ట్ఫికెట్లతో హాజరుకావాలని, అభ్యర్ధులు తమవెంట ఫోటోలు, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన పత్రాల తో హాజరైతే అభ్యర్ధుల ఎత్తును పరిశీలించి అభ్యర్ధులకు నెంబర్ ఇస్తారు. జూనియర్ కళాశాలలో నెంబ ర్ పొందిన అభ్యర్ధులు ప్రకాశంగ్రౌండ్‌లో నిర్వహిం చే పరుగుపందెం, ఫుల్‌ఆఫ్, రిజిస్ట్రేషన్, బయోమెట్రి, డాక్యుమెంట్ వెరిఫికేషన్లు ఉంటాయి. ప్రకాశంగ్రౌండ్‌లో ఎంపికైన అభ్యర్ధులకు సిఇఆర్‌క్లబ్‌లో వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. విషయాలను గమనించాలని అ ధికారులు విజ్ఞప్తి చేశారు.
తరలివస్తున్న అభ్యర్థులు
పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం పట్టణంలో శనివారం నుంచి నిర్వహించే ఆర్మీరిక్రూట్‌మెంట్ ర్యా లీకి తెలంగాణ ప్రాంతంలోని పదిజిల్లాల నుంచి అ భ్యర్థులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. శుక్రవారం నా టికే వందలాది మంది అభ్యర్థులు కొత్తగూడెం పట్టణానికి రావడంతో కొత్తగూడెం పట్టణంలోని బస్టాం డ్ ఏరియా, పోస్ట్ఫాస్ ఏరియా అభ్యర్థులతో కళకళలాడుతుంది. పదిజిల్లాల నుంచి వేలాది మంది అ భ్యర్థులు వచ్చే అవకాశం ఉండడంతో రెవెన్యూ, సిం గరేణి, పోలీస్ అధికారులు ఏర్పాట్లు పెద్దఎత్తున చేశా రు. అభ్యర్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పట్టణంలో ఫొటోస్టూడియోలు పెద్దఎత్తున వెలిశాయి. హోటళ్ళకు, లాడ్జీలకు, జిరాక్స్‌సెంటర్లకు విపరీతమై న డిమాండ్ పెరిగింది. అభ్యర్థుల అవసరాలను దృ ష్టిలో పెట్టుకొని హోటళ్ళ యజమానులు సైతం రో జువారీ కంటే ఎక్కువ మోతాదులో భోజనాలు త యారుచేస్తున్నారు. రైల్వేస్టేషన్, బస్టాండ్‌లలో అభ్యర్థులు సేదతీరుతున్నారు. కొత్తగూడెం పట్టణంలోని స్వచ్ఛందసంస్థలు, చాంబర్ ఆఫ్ కామర్స్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్‌సంస్థలు అభ్యర్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లుచేశారు. కొత్తగూ డెం రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పట్టణంలోని అన్ని విభాగాల ప్రభుత్వ అధికారులను సమన్వయ పరుస్తూ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్చంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలావుండగా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు అవసరమైన ఏర్పా ట్లు పూర్తయ్యాయి. ఆర్మీ రిక్రూట్‌మెంట్ నిర్వహించే ప్రదేశాల్లో ఇతరుల ప్రవేశం లేకుండా బారికెడ్లు ఏర్పా టు చేశారు. గత వారం నుంచి వివిధశాఖల అధికారులు శ్రమించి ఏర్పాట్లు పూర్తిచేశారు.

పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం పట్టణంలో శనివారం నుంచి
english title: 
rally

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>