విశాఖపట్నం, జనవరి 18: ముంబై ఐఐటిలో పిహెచ్‌డి చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఎం శివతేజ రెడ్డి (26) విశాఖలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. శివతేజ ముంబైలో ఐఐటి పిహెచ్‌డి ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 13వ తేదీ నుంచి శివతేజ కనిపించడం లేదు. హైదరాబాద్‌లో ఉన్న శివతేజ తండ్రి రాజశేఖరరెడ్డి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో, పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.16న విశాఖకు వచ్చి, ఒక లాడ్జిలో రూం అద్దెకు తీసుకున్నాడు. శుక్రవారం రాత్రి రెండు వాటర్ బాటిల్స్ కావాలంటూ రూం బాయిని అడిగాడు. వాటిని తీసుకుని తన గదిలోకి వెళ్లిపోయాడు. ఆ తరువాత నుంచి బయటకు రాకపోవడంతో లాడ్జి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం తలుపులు తెరచి చూడగా, బాత్ రూంలో శివతేజ మృతదేహం కనిపించింది. ప్యాకింగ్‌లకు ఉపయోగించే టేపును మెడకు బలంగా చుట్టుకున్నాడు. ఆ టేపును తిరిగి విప్పుకోకుండా ఉండేందుకు తన చేతి వేళ్లకు కూడా టేపు వేసుకున్నాడు. ఊపిరాడక శివతేజ మరణించాడు. గదిలో పాన్ కార్డు, సెల్ ఫోన్ పోలీసులు కనుగొన్నారు. ఫోన్‌లో సిమ్‌ను, బ్యాటరీని ముందుగానే శివతేజ తీసేశాడు. పోలీసులు ఆ ఫోన్‌లో బ్యాటరీ, సిమ్ వేసి నెంబర్లను పరిశీలించగా, శివతేజ తండ్రి నెంబర్ లభ్యమైంది. వెంటనే పోలీసులు శివతేజ ఆత్మహత్య విషయాన్ని వారికి తెలియచేశారు.
ముంబై ఐఐటిలో పిహెచ్‌డి చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన
english title:
iit student
Date:
Sunday, January 19, 2014