విశాఖపట్నం, జనవరి 18: విశాఖ నగరంలో సినీ పరిశ్రమకు అవశాలు పెద్దగా లేవని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్‌బాబు అన్నారు. శనివారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ విశాఖలో సినీ పరిశ్రమ స్థాపించేందుకు కనీస సదుపాయాలు కూడా లేవని అన్నారు. చెన్నై నుంచి సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలివచ్చి ఏళ్లు గడిచినప్పటికీ సినీ పరిశ్రమకు కావల్సిన వౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఇప్పటికీ కల్పించలేకపోతోందన్నారు. ఫైట్స్, డ్యాన్స్, పాటలకు సంబంధించిన ఆర్టిస్ట్‌లను చెన్నై, ముంబై నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ముంబైలో షారూఖ్‌ఖాన్ ఔట్ డోర్ షూటింగ్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి.. అలాగే హైదరాబాద్‌లో కూడా ఔట్ డోర్ షూటింగ్‌కు ఇబ్బంది ఉంది.. విశాఖలో అయితే, కొంత అనువైన పరిస్థితి ఉంది.
అదే రాష్ట్రంలో ఏ గ్రామీణ ప్రాంతానికి వెళ్లినా, షూటింగ్ జరపడం కష్టసాధ్యం అవుతోంది.. ప్రకృతి సిద్ధమైన అందాలతో వెలసిన విశాఖ నగరాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయకపోవడం వల్ల షూటింగ్‌లకు అవకాశం ఉండడం లేదని సురేష్ అన్నారు. అరకులో షూటింగ్ చేయడానికి ప్రత్యేక అందాలు ఎక్కడున్నాయన్నారు. అరకులో సంవత్సరం తరబడి ప్రవహించే ఒక లేక్ ఉంటే, దాన్ని ఆధారంగా చేసుకుని అనేక షూటింగ్‌లు నిర్వహించడానికి అవకాశం ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో, పోర్టులో షూటింగ్‌లు చేసుకోవాలంటే బోలెడన్ని అనుమతులు కావల్సి వస్తోందన్నారు. తన తండ్రి రామానాయుడు చెన్నై నుంచి సినీపరిశ్రమ హైదరాబాద్‌కు తరలివస్తున్న సమయంలో, హైదరాబాద్ కన్నా, విశాఖకు అవకాశాలు కల్పించాలని భావించారు. కానీ కుదరలేదు. ఇప్పుడు కూడా విశాఖపైనే ఆయనకు మక్కువ ఎక్కువ. అందుకే ఇక్కడ ఒక స్టూడియోను నిర్మించారు. కానీ ఆ స్టూడియో నష్టాలలో నడుస్తోందన్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు
english title:
suresh babu
Date:
Sunday, January 19, 2014