నల్లపాటి సురేంద్ర, కొత్తగాజువాక
సినీ పరిశ్రమలోకి వెళ్లాలంటే షార్ట్ ఫిలిమ్స్ కరెక్టా? సాహిత్య రంగం కరెక్టా?
ఎక్కడికి చేరాలన్న దాన్నిబట్టి. దేనికైనా సాధన, పట్టుదల కరెక్టు.
కొన్ని పత్రికలు కొన్ని పార్టీలకు సంబంధించినవి. మీ పత్రికది ఏ పార్టీ?
మన పార్టీ
రాజకీయ నాయకుల రిటైర్‌మెంట్ వయస్సు ఎంత వరకు?
యములాడు పట్టుకెళ్లటానికి వచ్చేంతవరకు.
పి.ఆదిత్యమూర్తి, గొల్లలమామిడాడ
చిన్నచిన్న పల్లెటూరు గ్రామాల్లోని జనాలు మూఢ నమ్మకాలతో, అనవసరంగా కాలాన్నీ, ధనాన్నీ, మనస్సునీ పాడు చేసుకొంటున్నారు. అలాంటి వారిలో మార్పు తీసుకువచ్చేందుకు ఏమైనా పరిస్థితులున్నాయా?
పట్నవాసులూ వారికి తోడుబోయిన వారే. పనికిమాలిన వ్యాపకాల్లో, అనర్థక వ్యసనాల్లో వారిని మించినవారే.
టి.సాయి సంతోషిణి రీతిక, గుండాల, అనకాపల్లి
అనుబంధంలో ‘ఏమి లోకమిది’ ఇంకొన్ని శీర్షికలకి డార్క్ కలర్‌పై మేటర్ ప్రింట్ చేసి, కళ్లకు మహా ఇబ్బంది కలిగిస్తున్నారు. బొమ్మలు చూసి ఆనందించడం వరకే కదా? ఆ బొమ్మల్లో మర్మం హేపీగా చదువుకొనే అవకాశం కల్పించండి. ప్లీజ్.
అలాగే
ఎఎపికి ఆంధ్రాలోనూ లోకల్ పార్టీగా ఫాలోయింగ్ పెరిగితే తీవ్రంగా నష్టపోయేది ఎవరు?
జెపి
ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
రాష్టప్రతి హైదరాబాదు వచ్చేది విశ్రాంతి కోసమా?
బహుశా విశ్రాంతి నుంచి బయటపడటం కోసం.
చాలాకాలంగా మనలో మనంలో నేనొక్క ఆడదానే్న అయిపోతున్నాను. ఆడవాళ్లకు మరింత ప్రాధాన్యత ఇవ్వమని ప్రార్థన.
వాళ్లదే ఆలస్యం.
రానున్న ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణ రాష్ట్రాలపై దృష్టి పెట్టాలని యోచిస్తోంది. అందులో మన రాష్ట్రం పేరు లేదేమిటి?
ఇక్కడ ఇప్పటికే హౌస్‌ఫుల్.
జ్యోతి, సికిందరాబాద్
రంకు - బొంకు, నిజాయితీ కన్నా గొప్పగా చలామణి కావడం మన దేశానికి పట్టిన చెద పురుగులు కాదా!
అవి అన్ని దేశాల్లోనూ ఉన్నవే.
ఉలాపు బాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశం జిల్లా
నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించినపుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటారు. అలా నిర్మూలించడం ప్రస్తుతం సాధ్యమేనా?
సాధ్యమే.
సిహెచ్.సాయి ఋత్త్విక్, నల్గొండ
నిత్యావసర సరకుల ధరలు, విద్య, వైద్యం ఆకాశయానం చేస్తూ సామాన్యులు బతుకుబండి లాగించడం కష్టసాధ్యమైన పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికలలో దేశ ప్రజలు ఎదురుచూస్తున్న ప్రత్యామ్నాయ నాయకత్వం నరేంద్ర మోడీ రూపంలో లభించనున్నదని ఆయనకు దేశ వ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ బట్టి అర్థవౌతోంది. మీ అభిప్రాయం ఏమిటి?
లభిస్తే మంచిదే.
సి.ప్రతాప్, విశాఖపట్నం
తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందంటారు. మరి రౌడీ ముదిరితే?
లీడర్.
కొలుసు శోభనాచలం, గరికపర్రు, కృష్ణాజిల్లా
2014 ఏప్రిల్‌లో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలకు దేశంలో అన్ని స్థానాలకు పోటీ చేయాలనుకోవటం ఆమ్ ఆద్మీ పక్ష దురాశా? లేక అత్యాసా? ఏమనాలి?
అది కాంగ్రెసు పాచిక
కాట్రగడ్డ వెంకట్రావు, పామర్రు, కృష్ణాజిల్లా
కుప్పలు తెప్పలుగా వెలువడుతున్న వ్యక్తిత్వ వికాస పుస్తకాల వల్ల యువతరానికి ప్రయోజనమెంత?
సున్న. (సాధారణంగా)
ఎ.వి.సోమయాజులు, కాకినాడ
మీ మొదట పారితోషికం రూ.25 అన్నారు. ఏ పత్రిక? ఏ సంవత్సరం కూడా తెలిపితే బాగుంటుంది.
ఆంధ్రజ్యోతి. 1975.
ఎన్.ఎస్. విశాఖపట్నం
పవన్ కళ్యాణ్‌గారు మరో పెళ్లి చేసుకున్నారని వార్త అన్ని న్యూస్ టీవీ ఛానెళ్లలో ప్రముఖంగా చూపించారు. మన రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా ఈ వార్త ప్రధానంగా చూపించడం న్యూస్ ఛానెల్ వారికి అంత అవసరమా?
మన సినీ మాలోకాలకు అలాంటివే నచ్చుతాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానంలో పాల్గొంటే ఢిల్లీ ఫలితాలు లాగే విజయ ఢంకా మ్రోగిస్తుందా?
ఉన్న పరువు పోతుంది.
పి.వి.శివప్రసాద్‌రావు, అద్దంకి, ప్రకాశం జిల్లా
రాజ్‌నాథ్ సింగ్ గారు వచ్చేది బిజెపి రామరాజ్యమని, మోడీగారిని శ్రీరాముడిగా, మంధర కుట్ర లాగే కాంగ్రెస్ కుట్రలు అని, అవి విఫలమై రాజుగా ప్రధాని అవుతారని వర్ణనలు చేస్తున్నారు. ఇవి నిజమేనంటారా? మంధర కుట్ర విఫలమై 14 ఏళ్ల తర్వాత శ్రీరాముడు రాజు అయ్యారు కదా. మోడీగారిని కూడా అలాగే అనుకోమని అర్థమా?
కుట్రలు మొదలై పధ్నాలుగేళ్లు కావస్తున్నదనీ అనుకోవచ్చు కదా?
ఎం.కనకదుర్గ, తెనాలి
ఏ సినిమా, టీవీ కార్యక్రమం చూసినా అసభ్యత, అశ్లీలత స్వైర విహారం చేస్తున్నాయి. రామా అంటే ఒక బూతు మాటగా, నిండైన వస్తధ్రారణ చేయడం అంటే రాతికాలం నాటి మనుషులుగా విశే్లషించే దుర్భర పరిస్థితులు వచ్చాయి. పవిత్రమైన హైందవ సంస్కృతి మంటగలిసిపోతూ ఉంటే నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా?
ఆ బాధ్యత ఆ సంస్కృతిని అభిమానించే వారిపై ఉంది. జనానికే పట్టనప్పుడు ప్రభుత్వమెందుకు కదులుతుంది?
కాళిదాసు, కావలి, నెల్లూరు జిల్లా
మీరు రోజూ అన్ని దినపత్రికలూ చదువుతారా? (కాగిత రూపేణా గానీ లేదా నెట్‌లో గానీ) ఎంతసేపు చదువుతారు?
మహా అయతే రెండు గంటలు. అది ఉద్యోగ ధర్మంలో భాగం.
*
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : mvrsastry@gmail.com