
ఈ సంఖ్య గురు గ్రహానికి సంబంధించింది. (12=1+2=3) ఈ తేదీన జన్మించిన వారు మేధావులుగా ఉంటారు. ఎలాంటి పరిస్థితులనైనా వీరికి అనుకూలంగా మార్చుకోగలరు. వీరు చక్కగా సంభాషణ చేయగలుగుతారు. వీరు మంచి తల్లి/తండ్రిగా ఉంటారు గానీ, పిల్లల విషయంలో క్రమశిక్షణ పాటిస్తారు. వీరు సౌమ్యంగా ఉన్నప్పటికీ వీరి లక్ష్య సాధనలో మాత్రం మొండిగా ఉంటారు. సూర్యుని సంఖ్య అయిన 1, చంద్రుని సంఖ్య అయిన 2 ఈ గుణాలను కలిగిస్తాయి.
సాహిత్యం, కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఒక్కొక్కసారి అసహనం, టెన్షన్ కలుగుతాయి. ఎల్లప్పుడు మేధోపరమైన వ్యాపకం వుండడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీరి చమత్కారమైన మాటలతో మిత్రులను ఆకట్టుకుంటారు. మానసిక ఆందోళన రాకుండా చూసుకోవాలి.
బాధ్యతలు తమపైన వేసుకుని కూడా వీరు ఒత్తిడిని తట్టుకోగలరు. కానీ అహంభావం రాకుండా చూసుకోవాలి. రచనలు, నటన, అడ్వర్టయిజింగ్, ఆరోగ్యం, న్యాయం, ఇంటీరియర్ డెకరేషన్ లాంటి వృత్తులు అనుకూలం.
వీరు ఏ విషయాన్ని తేలికగా తీసుకోరు. వీరు తమ తెలివితేటలు, బుద్ధిని సక్రమంగా వినియోగిస్తే ధనవంతులు అవుతారు. అంచెలంచెలుగా జీవితంలో అభివృద్ధి సాధిస్తారు.
వీరు ఎంతోమంచివారుగా పేరుపొందుతారు.వీరికి భవిష్యత్తును ఊహించే శక్తి ఉంటుంది. వీరు ఆధ్యాత్మిక, వేదాంత విషయాల్లో ఉన్నత స్థితిని పొందుతారు. వీరు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటారు. వీరు ఇతరులను చిన్నబుచ్చటం, హేళన చేయడం మానుకోవాలి.
ప్రేమానురాగాలకు విలువ ఇస్తారు. మంచి మనసు కలిగి హాస్య ప్రియత్వం కలిగి వుంటారు. వీరి సాంగత్యంలో అందరూ ఆనందంగా, సౌకర్యవంతంగా ఉంటారు. మంచి ఆహారాన్ని, వస్త్ర ధారణను ఇష్టపడతారు. మనసు గాయపరిచినవారిని క్షమించలేరు.
జన్మదినం-13
ఈ సంఖ్య రాహవుకి సంబంధించినది. (13=1+3=4) అందరూ భయపడేటట్లు ఇది దురదృష్ట సంఖ్య ఎంత మాత్రం కాదు. ఈ తేదీన జన్మించిన వారు సృజనాత్మకత కలిగి, పద్ధతిగా ఉండి, కష్టించి పనిచేసే గుణం కలవారై ఉంటారు. కొందరికి ఆశావాదం, మొండితనం ఉంటాయి. వీరు అన్యాయాన్ని సహించక ఎదిరించి పోరాడతారు. మంచి క్రమశిక్షణ, జాగరూకతల వలన విజయం సాధిస్తారు. కానీ ఒక్కొక్కసారి పరిస్థితుల ప్రభావానికి కట్టుబడి నిరాశ చెందుతారు.
ఈ తేదీన జన్మించిన వారి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వీరు తమ కుటుంబాన్ని, సంప్రదాయాన్ని, వర్గాన్ని ఎంతో ప్రేమిస్తారు. వీరి నిజాయితీ వలన ఎటువంటి సంస్థను ప్రారంభించినా దానికి మూల స్తంభంగా ఉంటారు.
ఒడిదుడుకులతో కూడిన బాల్యం ఉంటుంది. కానీ దృఢచిత్తంతో, నిజాయితీతో ముందుకెళ్తే విజయం సాధిస్తారు. వీరికి జీవిత ద్వితీయార్ధంలో అభివృద్ధి ఉంటుంది. దైవ భక్తి, పెద్దల సహకారంతో విజయం సాధిస్తారు.
అందరూ వీరి క్రమశిక్షణను, నిబద్ధతను మెచ్చుకుంటారు. ఉద్యోగం మాటిమాటికీ మార్చే అవకాశం ఉంది కాబట్టి వీరి లక్ష్యాన్ని సరియైన పద్ధతిలో ఎంచుకుంటే మంచిది. వ్యాపారం, నిర్మాణ రంగం, అకౌంటింగ్, మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్ రంగాల్లో రాణింపు ఉంటుంది.
వీరు గొప్ప ప్రారంభకులు కానప్పటికీ, లక్ష్యాలు నిర్దేశిస్తే దేనిలోనైనా రాణిస్తారు. ఖాళీగా కూర్చోడానికి నచ్చరు. వీరు స్వార్థపరులు కారు. అందరూ వీరి సహాయం తీసుకుంటారు. అయితే వీరికి కల్పనా చాతుర్యం తక్కువ. వాస్తవికంగా ఆలోచిస్తారు. ఏ పనైనా పద్ధతిగా చేస్తారు. *
చిరునామా: మహమ్మద్ దావూద్
8-3-825/5/3/6/3, సుభాష్ నగర్, యల్లారెడ్డిగూడ, హైదరాబాద్.