విజయనగరం (్ఫర్టు), జనవరి 20: పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని మున్సిపల్ రీజనల్‌డైరెక్టర్ ఆశాజ్యోతి కోరారు. పట్టణంలో ఆర్యవైశ్య భవనంలో 3చెత్తను తడి-పొడిగా వేరుచేద్దాం..చెత్త నుంచి బంగారం తీద్దాం2 అనే కార్యక్రమంపై సోమవారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశాజ్యోతి మాట్లాడుతూ చెత్తపై సమరం చేసేందుకు ప్రభుత్వం ఈనెల 18 నుంచి బంగారువారం (గోల్డెన్‌వీక్) నిర్వహిస్తుందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రతి ఉద్యోగి ఈ కార్యక్రమాన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా అన్నిమున్సిపాలిటీల్లో చెత్తపై సమరం పేరిట 100రోజుల కార్యాచరణ ప్రణాళికను గత అక్టోబర్ 5వతేదీన ప్రారంభించారన్నారు. అప్పటి నుంచి అన్ని మున్సిపాలిటీల్లోను చెత్తపై సమరం కార్యక్రమం జరుగుతుందన్నారు. అలాగే పట్టణంలో ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. తడిచెత్త-పొడిచెత్తపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక్కొక్క కమ్యూనిటీ ఆర్గనైజర్‌కు 3500 ఇళ్లను అప్పగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఎంవిడి ఫణిరామ్, మున్సిపల్ పర్యావరణ ఇంజనీర్ ప్రసాద్‌బాబు, మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు హెచ్.శంకరరావు, పి.శ్రీనివాసరావు, మురళీధరరావు, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
‘గ్రీవెన్స్’లో సామాజిక వినతుల జోరు
విజయనగరం(టౌన్), జనవరి 20 : జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సోమవారం నాటి గ్రీవెన్స్ సెల్ 200 వినతులు రాగా వీటిలో సామాజిక సమస్యలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే,ఎజెసి నాగేశ్వరరావు,డిఆర్‌ఓ హెచ్‌ఎస్ వెంకటరావులు వినతులు స్వీకరించారు. విజయనగరం పట్టణం 12వ వార్డు పరిధిలోని స్టేడియం పేట, కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రామ్‌జీ షెడ్యూలు కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.బాబురావు తదితరులు వినతినిచ్చారు. స్థానిక 23వ వార్డు పరిధిలో పొలయ్యపేటలో కుళాయి పైపుల మీద అక్రమంగా కొందరు మరుగుదోడ్ల ట్యాంకులు నిర్మిస్తున్న వాటిని నిలిపి వేయించాలని ఎస్.సదానందం తదితరులు కోరారు. విజయనగరం అయ్యన్నపేటలో నివసిస్తున్న చెంచులు, ఎరుకలు, సామర్ల కుటుంబాలకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని దళిత సమైక్య సంఘం అధ్యక్షుడు ఎ.శివప్రసాద్ తదితరులు వినతినిచ్చారు. సాలూరు పట్టణ పరిధిలోని 5వ వార్డు కోట వీధిలోని మద్యం షాపును మరో ప్రాంతానికి తరలించాలని ఎస్సైజ్ అధికారులు నోటీసులు ఇచ్చినా సంబంధిత వ్యాపారి స్పందించ నందున అధికారులు జోక్యం చేసుకోవాలని పి.రాధతోపాటు పలువురు మహిళలు కలెక్టర్‌ను అభ్యర్ధించారు. ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఎస్.కోట మండలం ఎస్‌జిపేట మాజీ సర్పంచ్ జి.అప్పారావు తదితరులు కోరారు. అలాగే వ్యక్తిగత సమస్యలకు సంబంధించి పలు వినతులు అందాయి. అధిక సంఖ్యలో తరలివచ్చిన ప్రజలతో కలెక్టరేట్ ఆవరణ కిటకిటలాడింది.