విజయనగరం (్ఫర్టు), జనవరి 20: పట్టణంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రధానంగా మంచినీటి సరఫరా, వీధిదీపాలు, పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలని పలు వార్డులకు చెందిన ప్రజలు కోరారు. డయల్ యువర్ మున్సిపల్ కమిషనర్ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణ ప్రజల నుంచి మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. పలు సమస్యలకు సంబంధించి 35 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఎక్కువగా మంచినీటిసరఫరా, రోడ్లు, వీధిదీపాలు, పారిశుద్ధ్య సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు ఉన్నాయి. పట్టణంలో ఉడాకాలనీ, పూల్‌భాగ్‌కాలనీ, బాబామెట్ట, రాజీవ్‌నగర్, దాసన్నపేట, కె.ఎల్.పురం, అయ్యన్నపేట, దండుమారమ్మకాలనీ ,కొత్తపేట తదితర ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించాలని ప్రజలు ఫోన్ ద్వారా మొరపెట్టుకున్నారు. వీధిలైట్లు వెలగడంలేదని, అరకొరగా మంచినీటి సరఫరా జరుగుతోందని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేశారు. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ ఏమాత్రం బాగోలేదని ఆరోపించారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పలు విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
‘కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం’
విజయనగరం (కంటోనె్మంట్), జనవరి 20: కాంగ్రెస్ పార్టీ వల్లనే పట్టణాభివృద్ధి సాధ్యపడుతుందని, ఇందుకోసమే శత శంకుస్థాపనల కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఇక్కడి పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీలక్ష్మి అన్నారు. సోమవారం పట్టణంలో 18వ వార్డు సాలిపేట రోడ్డు, 7వ వార్డు గౌడు వీధి రోడ్డు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణాభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా 2050 వరకు తాగు నీటి సమస్యలేకుండా శాశ్వత ప్రణాళికలు రూపొందించిట్లు చెప్పారు. మురుగునీటి కాల్వలు నిర్మాణంతోపాటు రోడ్లు అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆర్మీ క్యాంటిన్, పోస్ట్ఫాస్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ప్రజలు ఎటువంటి ఇబ్బందుల పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిళ్లా విజయకుమార్ మాట్లాడుతూ గత పార్టీలు చేయలేని అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీ అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
పట్టణంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రధానంగా మంచినీటి సరఫరా,
english title:
s
Date:
Tuesday, January 21, 2014