విజయనగరం (కంటోనె్మంట్), జనవరి 20: గ్రీవెన్స్‌లో వచ్చే ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ టి.మోహనరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో 10 ఫిర్యాదులు అందాయి. పట్టణంలోని వి.టి అగ్రహారానికి చెందిన ఒకరు తన స్వగ్రామం తెర్లాంలో జరిగిన ఓ భూవిక్రయంలో జరిగిన మధ్యవర్తిత్వంలో తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మెంటాడ మండలం పాతబగ్గానికి చెందిన మహిళకి అదే గ్రామానికి చెందిన ఒకరు సొమ్ము ఇవ్వాలని ఫిర్యాదు చేశారు. అదేవిధంగా విజయనగరం పట్టణానికి చెందిన టి.అనురాధకు చెందిన రెండుతులాల బంగారం పోవడంతో రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినందున తొందరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గజపతినగరం మండలం బూడిపేటకు చెందిన మహిళ ఆమె భర్తను అదే గ్రామానికి చెందిన ఒకరు భయపెడుతున్నట్లు ఫిర్యాదు చేశారు.
‘ప్రయాణికుల నమ్మకాన్ని కాపాడుకోవాలి’
విజయనగరం (్ఫర్టు), జనవరి 20: ప్రయాణికులను సురక్షతంగా గమ్యస్ధానాలకు చేర్చే బాధ్యత డ్రైవర్లదేనని ఆర్టీసీ విజయనగరం రీజనల్‌మేనేజర్ పి.అప్పన్న అన్నారు. 25వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను సోమవారం ఇక్కడ డిపో ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అప్పన్న మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షతమనే ప్రయాణికుల నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రైవేటువాహనాల నుంచి పోటీని తట్టుకుని సంస్థ మనుగడ సాగించాలంటే ప్రయాణికుల భద్రతపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రయాణికుల సురక్షత రవాణాకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని, ఈకారణంగానే రీజియన్ పరిధిలో గత రెండేళ్ల నుంచి ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టాయన్నారు. 2002లో రీజియన్ పరిధిలో 118 ప్రమాదాలు జరిగితే, 2013లో 97 ప్రమాదాలు జరిగాయన్నారు. కేవలం డ్రైవర్లు సురక్షితమైన డ్రైవింగ్ చేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రతీ పది మందికి ఒక ప్రైవేటు వాహనం ఉందని, ప్రైవేటు వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల వాయి కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని ఆయన తెలిపారు. విజయనగరం ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎ.రవికుమార్ మాట్లాడుతూ అతివేగం,మద్యం సేవించి వాహనాలను నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆర్టీసీ బస్సులకు మాత్రమే వేగ నియంత్రణ ఉందని, మిగతా ప్రైవేటు వాహనాలకు వేగనియంత్రణ లేదన్నారు. 2013లో విజయనగరం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో 177 ప్రమాదాలు జరిగాయని, ఇందులో 13 ప్రమాదాలు ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యం జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో డిపోమేనేజర్ కె.పద్మావతి పాల్గొన్నారు.