విజయనగరం, జనవరి 20: జిల్లాలో నాలుగు మండలాల్లో రక్షిత మంచినీటి పథకాల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.120 కోట్లు మంజూరైనట్టు ఎంపీ ఝాన్సీలక్ష్మి చెప్పారు. జిల్లాలోని చీపురుపల్లి, తెర్లాం, బాడంగి, జామి మండలాల్లోని గ్రామాలకు ఈ నిధులతో మంచినీటి సౌకర్యం కల్పించనున్నట్టు ఆమె తెలిపారు. అలాగే రూ.100 కోట్ల నిధులతో విజయనగరం పట్టణంలో పైపులైన్ల మరమ్మతులు చేపడుతున్నట్టు ఆమె వివరించారు. సోమవారం ఆమె 3ఆంధ్రభూమి2తో మాట్లాడుతూ జిల్లాలోని విద్య, వైద్య, వౌలిక వసతుల కల్పనకు తాము అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు. విద్యకు సంబంధించి రూ.7.5 కోట్లతో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణం, ఇతర వసతులు కల్పించినట్టు తెలిపారు. అలాగే కొత్త పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరు చేశామన్నారు. వీటికి రాష్ట్రం వాటా కింద 25 శాతం నిధులు మంజూరు చేయాల్సి ఉందన్నారు. వైద్య రంగానికి సంబంధించి రూ.150 కోట్లతో ఇఎస్‌ఐ ఆసుపత్రిని వందపడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేశామన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు మూడేళ్లపాటు ఉద్యాన మొక్కల పెంపకానికి నిధులు వినియోగించుకునే వెసులుబాటు లభించిందన్నారు. ఇది వంద రోజుల పనిదినాలకు అదనంగా ఉపాధి లభిస్తుందన్నారు. రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే నెల్లిమర్ల, గరివిడి ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇవిగాకుండా భీమసింగి, మానాపురం, సీతానగరం, బొబ్బిలి ప్రాంతాల్లో ఆర్‌ఒబిల నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. వీటిలో మానాపురం ఆర్‌ఒబికి అంచనాలు తయారు చేస్తున్నట్టు తెలిపారు. తీర ప్రాంత గ్రామాల్లో జెట్టీల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామన్నారు. సన్న, చిన్నకారు రైతులకు కూలీల ఖర్చు తగ్గించేందుకు మల్టీ క్రాప్ హార్వెస్టు యంత్రాలను రైతు సంఘాలకు అందజేస్తున్నామన్నారు. పట్టణంలోని పట్టుపరిశ్రమ కేంద్రం సమీపంలో మామిడి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా విజయనగరం నుంచి పలాసా వెళ్లే పాసింజర్ రైలు వయా రాజాం మీదుగా వెళ్లే విధంగా రైలు మార్గం నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
చలో అసెంబ్లీకి టిడిపి సన్నాహాలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జనవరి 20: ఎపి ఎన్జీవోలు తలపెట్టిన 3్ఛలో అసెంబ్లీ2 ముట్టడి కార్యక్రమానికి తొమ్మిది నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా టిడిపి అధ్యక్షుడు డి.జగదీష్ పిలుపునిచ్చారు. సోమవారం అశోక్‌బంగ్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గం నుంచి నేతలు తమ వాహనాలతో జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో టిడిపి పట్టణ పార్టీ అధ్యక్షుడు ప్రసాదుల రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, కనకల మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో నాలుగు మండలాల్లో రక్షిత మంచినీటి పథకాల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు
english title:
r
Date:
Tuesday, January 21, 2014