బుట్టాయగూడెం/మదనపల్లె, జనవరి 21: చట్టాలు, పోలీసులన్నా కాముకులకు భయం లేదు. నిర్భయ చట్టం కూడా వాళ్లని ఏమీ చేయదన్న ధీమా. పశ్చిమ గోదావరిలో టెన్త్ విద్యార్థినిపై పిఇటి అఘాయత్యం చేశాడు. చిత్తూరుజిల్లాలో బాలికపై వృద్ధుడు పైశాచికత్వానికి ఒడిగట్కడాడు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం నూతిరామన్నపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఈ అకృత్యం చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదుచేయగా, అధికార్లు పాఠశాలలో విచారణ జరుపుతున్నారు. వివరాలిలా ఉన్నాయి... పాఠశాలలో అప్రంటీస్ వ్యాయామోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుంజా సోమరాజు గత ఏడాది జులై నుండి పదోతరగతి విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. కొంచెం అమాయకంగా ఉండే ఈ విద్యార్థినిని కొత్తపుస్తకాలు ఇస్తానని నమ్మబలికి, పాఠశాల పై అంతస్తులోకి తీసుకెళ్లి లైంగికదాడి జరిపేవాడు. కాగా ఈ నెల 11న సాధారణ ఆరోగ్య తనిఖీల్లో భాగంగా స్థానిక ఎఎన్‌ఎం పి సరస్వతి విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో బాధిత బాలిక నీరసంగా ఉండటంతో అనుమానించి, క్షుణ్ణంగా పరీక్షించడంతో గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. ఈమేరకు పాఠశాల హెచ్‌ఎంకు ఆమె నివేదిక ఇచ్చింది. నివేదిక అందుకున్న ప్రధానోపాధ్యాయడు బాలిక తల్లిదండ్రులను పిలిచి జరిగిన విషయాన్ని వివరించి, ఆమెను వారితో పంపించేశారు. బాలిక ద్వారా జరిగిన ఘాతుకం తెలుసుకున్న తల్లిదండ్రులు గ్రామంలో పెద్దలను ఆశ్రయించగా, వ్యాయామోపాధ్యాయుడు సోమరాజు నిందితుడని తేలింది. అప్పటి నుండి రాజీ ప్రయత్నాలు మొదలయ్యాయి. బాధితురాలికి కొంత నగదు ఇచ్చేలా చర్చలు జరిగాయి. రాజీ ధీమాతో నిందితుడు సోమరాజు యథావిథిగా పాఠశాలకు హాజరయ్యేవాడు. ఈదశలో బాలిక తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. ఈ వ్యవహారం మంగళవారం బయటకు పొక్కడంతో నిందితుడు సోమరాజు పరారయ్యాడు.
ఈ ఘాతుకం సమాచారం తెలుసుకున్న సహాయ గిరిజన సంక్షేమ అధికారిణి విజయశాంతి, స్థానిక తహసీల్దార్ ఎన్ నరసింహమ్మూర్తి తదితరులు పాఠశాలకు వెళ్లి విచారణ ప్రారంభించారు. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితునిపై ఐపిసి సెక్షన్లతోపాటు ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్‌వల్ అఫెన్స్ యాక్టు కింద కేసు నమోదుచేయనున్నట్లు జంగారెడ్డిగూడెం సిఐ మురళీ రామకృష్ణ తెలిపారు. ఏడేళ్ల బాలికకు బిస్కెట్లు, చాక్లెట్లు ఆశచూపి లైంగికంగా వేధిస్తున్న వృద్ధుడు ఎట్టకేలకు స్థానికులకు చిక్కడంతో పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె శివారు కోళ్లబయలు పంచాయతీలో మంగళవారం జరిగింది. మదనపల్లె రూరల్ ఎస్‌ఐ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి... బాబుకాలనీలో చిల్లర దుకాణం నడుపుకుంటున్న ముష్కిన్(55) అక్కడకు వచ్చే పిల్లలతో చనువుగా ఉంటూండేవాడు. ఇదిలావుండగా మూడో తరగతి చదువుతున్న ఒక బాలికకు మత్తు మందు కలిపిన చాక్లెట్స్, బిస్కెట్స్ ఇచ్చి లైంగికంగా వేధించేవాడు. ఇలా మూడు వారాలుగా జరుగుతోంది. మత్తు దిగిన తర్వాత బాలిక ఇంటికి వెళ్లిపోయేది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ బాలిక పాఠశాలకు వెళ్తుండగా ముష్కిన్ చాక్లెట్‌లు చూపించి ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలిక కేకలు వేయడంతో స్థానికులు పరుగున సంఘటన స్థలానికి చేరుకోవడంతో జరిగిన విషయం బాలిక ఏడుస్తు వివరించింది. అప్పటికే పారిపోయేయత్నంలో ఉన్న కామాంధుడిని పట్టుకుని గ్రామస్థులు దేహశుద్ధి అనంతరం రూరల్ పోలీసులకు అప్పగించారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
టెన్త్ విద్యార్థినిపై పిఇటి లైంగిక దాడి * పగో జిల్లాలో ఘోరం * చిత్తూరు జిల్లాలో బాలికపై వృద్ధుడి పైశాచికత్వం
english title:
r
Date:
Wednesday, January 22, 2014