అనంతపురం టౌన్, జనవరి 22: నగరంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు బుధవారం గండి పడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వాటర్ వర్క్స్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన గండి పూడ్చివేశారు. ట్యాంక్‌కు గండి పడిన సమాచారం తెలిసిన వెంటనే కమిషనర్ రంగయ్య సంఘటనా స్థలిని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్.ఎస్. ట్యాంక్‌లో పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులు సూచించిన మేరకు 337.0 మీటర్ల మట్టం వరకు నీటిని నిల్వ చేశారు. అయితే నిర్దేశించిన నీటి మట్టం వరకు నిల్వ ఉన్నప్పటికీ లీకేజీ ఏర్పడటం అధికారులను విస్మయానికి గురిచేసింది. ఇటీవలి కాలంలో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ ఆలనాపాలనకు నోచుకోకపోవటంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. పిఎబిఆర్ తాగునీటి పైపులైను పథకంలో అనుకోని అవాంతరాలు ఎదురైతే నగర ప్రజలకు వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అధిగమించటానికి ఇంజినీరింగ్ అధికారులు ముందుజాగ్రత్తగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, సత్యసాయి ట్యాంక్‌లకు హెచ్.ఎల్.సి సౌత్ కెనాల్ నీటిని పంపింగ్ చేసి నిల్వ చేశారు. ఈ క్రమంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లోపలి ఆవరణలో మోటార్లు ఉన్న ప్రాంతంలో సన్నటి లీకేజీని గుర్తించారు. నీటి ఉద్ధృతి పెరగటంతో మోటారు గదిలోకి నీరు చేరింది. నీటి ఉద్ధృతికి లీకేజీ కాస్తా పెద్దదిగా మారటంతో అప్రమత్తమైన ఇంజినీరింగ్ అధికారులు వెనువెంటనే ఇసుక బస్తాలు వేసి గండి పూడ్చి వేసే ప్రయత్నాలు చేపట్టారు. తర్వాత ఇరిగేషన్ శాఖ అధికారుల సూచనల మేరకు టార్పాలిన్ వేసి నల్లమట్టితో పూడ్చివేత పనులు చేపట్టారు. ఇ.ఇ శివరామిరెడ్డి పర్యవేక్షణలో గండిపూడ్చివేత పనులు జరిగాయి. సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాసులు పనులను పరిశీలించారు. డిఇఇ సతీష్‌చంద్ర, ఎ.ఇ నరసింహ, ట్యాప్ ఇన్‌స్పెక్టర్లు, ఫిట్టర్లు, వర్కర్లు పాల్గొన్నారు.
నిర్దేశించిన నీటి మట్టానికన్నా ఎక్కువగా నీరు నిల్వ చేయటంతో 2002లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు గండి పడింది. ఈ గండి ట్యాంక్ వాలున్న ప్రాంతంలో ఏర్పడటంతో ట్యాంక్ ఖాళీ అయ్యింది. అప్పటి కలెక్టర్ సోమేష్‌కుమార్, కమిషనర్ రంగాచారి తదితర సిబ్బంది వారం రోజులపాటు శ్రమించి గండిని పూడ్చివేశారు. అయితే ఈసారి పబ్లిక్‌హెల్త్ శాఖ నిర్దేశించిన నీటి మట్టం వరకు నీరు నిల్వ చేసినప్పటికీ గండి ఏర్పడటం అధికారులను కలవరానికి గురిచేసింది. పిఎబిఆర్ తాగునీటి పైపులైను పథకంలో తరచూ పైపులైను లీకేజీలు ఏర్పడుతుండటంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు ఇంజినీరింగ్ అధికారులు కసరత్తులు చేపట్టారు. పిఎబిఆర్ తాగునీటి పైపులైను పథకం వచ్చిన తర్వాత గడచిన కొనే్నండ్లుగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆలనాపాలనా కరువైంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను పటిష్టపరచి వేసవిలో నగర ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాల్సి ఉంది.
ఇందిరమ్మ ఇంటి స్థలాల కేటాయింపులో అవకతవకలు
ధర్మవరం, జనవరి 22: ధర్మవరం పట్టణంలో ఇందిరమ్మ, వైఎస్‌ఆర్, కేతిరెడ్డి కాలనీలతోపాటు ఎల్-1, ఎల్-2, ఎల్-4 కాలనీల్లో ఇష్టారాజ్యంగా అధికారులు ఇంటి పట్టాలను మంజూరు చేశారని కలెక్టర్‌కు ఫిర్యాదు అందడంతో ఆయన సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే రచ్చబండ-1, 2లలో పంపిణీ చేసిన ఇంటి పట్టాల్లో కూడా అవకతవకలు జరిగాయని కలెక్టర్ దృష్టికి కొందరు తీసుకెళ్ళడంతో ఇందుకోసం నలుగురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు బుధవారం కాలనీలో దర్యాప్తును ప్రారంభించాయి. కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరదాపురం సూరి గత ఏడాది అక్టోబర్ 21న కలెక్టర్‌ను కలిసి ప్రజావాణిలో ఇందిరమ్మ కాలనీల్లో ఇంటి స్థలాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని విన్నవించారు. అంతేకాక స్థానిక అధికారుల అండదండలతోనే ఇంటి పట్టాల పంపిణీ జరిగాయని, దర్యాప్తును ప్రత్యేక అధికారులతో జరిపించాలని ఆయన కోరారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు చక్రపాణి, సుధాకర్‌రెడ్డి, జి.వి.వెంకటేశం, ఫరూక్ అహ్మద్‌ల ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు సమగ్రంగా దర్యాప్తు చేపట్టి నివేదికను అందించాలని ఆదేశించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతోపాటు డిప్యూటీ తహశీల్దార్, ఆర్‌ఐ, ఇద్దరు విఆర్‌ఓలతో కూడిన ఒక్కొక్క బృందం ఒక్కొక్క ఏరియాలో పూర్తిగా పట్టా పొందిన వారి జాబితాలను తీసుకొని, ప్రస్తుతం ఇంటిలో నివశిస్తున్న వారి వివరాలను సేకరిస్తూ పరిశీలన చేయనున్నారు. బుధవారం కాలనీల్లో అధికార బృందాలు సంచరించి ఏయే బృందం ఎక్కడ తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం నుండి దర్యాప్తు మొదలుకానుంది.
ఇందిరమ్మ ఇంటి స్థలాల కేటాయింపులో అవకతవకలు
ధర్మవరం, జనవరి 22: ధర్మవరం పట్టణంలో ఇందిరమ్మ, వైఎస్‌ఆర్, కేతిరెడ్డి కాలనీలతోపాటు ఎల్-1, ఎల్-2, ఎల్-4 కాలనీల్లో ఇష్టారాజ్యంగా అధికారులు ఇంటి పట్టాలను మంజూరు చేశారని కలెక్టర్‌కు ఫిర్యాదు అందడంతో ఆయన సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే రచ్చబండ-1, 2లలో పంపిణీ చేసిన ఇంటి పట్టాల్లో కూడా అవకతవకలు జరిగాయని కలెక్టర్ దృష్టికి కొందరు తీసుకెళ్ళడంతో ఇందుకోసం నలుగురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు బుధవారం కాలనీలో దర్యాప్తును ప్రారంభించాయి.
కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరదాపురం సూరి గత ఏడాది అక్టోబర్ 21న కలెక్టర్‌ను కలిసి ప్రజావాణిలో ఇందిరమ్మ కాలనీల్లో ఇంటి స్థలాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని విన్నవించారు. అంతేకాక స్థానిక అధికారుల అండదండలతోనే ఇంటి పట్టాల పంపిణీ జరిగాయని, దర్యాప్తును ప్రత్యేక అధికారులతో జరిపించాలని ఆయన కోరారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు చక్రపాణి, సుధాకర్‌రెడ్డి, జి.వి.వెంకటేశం, ఫరూక్ అహ్మద్‌ల ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు సమగ్రంగా దర్యాప్తు చేపట్టి నివేదికను అందించాలని ఆదేశించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతోపాటు డిప్యూటీ తహశీల్దార్, ఆర్‌ఐ, ఇద్దరు విఆర్‌ఓలతో కూడిన ఒక్కొక్క బృందం ఒక్కొక్క ఏరియాలో పూర్తిగా పట్టా పొందిన వారి జాబితాలను తీసుకొని, ప్రస్తుతం ఇంటిలో నివశిస్తున్న వారి వివరాలను సేకరిస్తూ పరిశీలన చేయనున్నారు. బుధవారం కాలనీల్లో అధికార బృందాలు సంచరించి ఏయే బృందం ఎక్కడ తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం నుండి దర్యాప్తు మొదలుకానుంది.
సమస్త దేవతా స్వరూపిణి గాయత్రీదేవి
ధర్మవరం, జనవరి 22: సమస్త దేవతా స్వరూపిణి గాయత్రీదేవి అని బ్రహ్మర్షి గరికపాటి నరసింహారావు నిత్యజీవితంలో గాయత్రీ ప్రవచన బోధనలో భాగంగా పేర్కొన్నారు. ధర్మవరంలో వేదమాత గాయత్రీదేవి ద్వాదశి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం గాయత్రీదేవి అమ్మవారికి అభిషేకములు, మూలమంత్ర జపములు, రుద్ర, ఛండీహోమంలు, వేద పండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు భక్తులకు నిత్యజీవితంలో గాయత్రీదేవి ప్రవచనాలను బోధించారు.