Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ప్రాజెక్టు అనంతపై మేధోమథనం

$
0
0

అనంతపురం సిటీ, జనవరి 22: ప్రాజెక్టు అనంత గ్రామ ప్రణాళికల తయారీలో పార్టిసిపేటరీ రూరల్ అఫ్రైపర్ పద్ధతులను ఉపయోగించి ప్రజల భాగస్వామ్యంతో గ్రామ ప్రణాళికల తయారీపై మేధోమధన సమావేశాన్ని బుధవారం డ్వామా మీటింగ్ హాల్‌లో నిర్వహించారు. కలెక్టర్ డియస్ లోకేష్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ప్రాజెక్టు అనంత ఎస్‌పిడి డా.కెచంద్రవౌళి, పలువురు జిల్లా అధికారులు, ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. కె.చంద్రవౌళి మాట్లాడుతూ అనంత కరవు రైతన్నలను పంట నష్టాల బారి నుండి శాశ్వతంగా రక్షించడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే సంకల్పంతో చేపట్టిన ప్రాజెక్టు అనంత కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పిఆర్‌ఎ పద్ధతులను ఉపయోగించి ఎంపిక చేసిన 14 పైలెట్ గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో గ్రామ ప్రణాళికల తయారీ కార్యక్రమంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని, చేపట్టాల్సిన పద్దతులపై అధికారులు, ఎన్‌జివోలు సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ నెల 25న ఆర్‌డిటి ఎకాలజి సెంటర్‌లో గ్రామ ప్రణాళికల తయారీ బృందం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అనుసరించాల్సిన శాస్ర్తియ పద్ధతులకు తుదిరూపును ఇచ్చి అనంతరం వాటిపై చర్చించి ఈ నెల 28న తాను, కలెక్టర్, గ్రామ ప్రణాళికల తయారీ బృందం 14 పైలెట్ గ్రామాలలోని ఒక గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలో ప్రజలను భాగస్వామ్యులను చేసి పిఆర్‌ఐ పద్ధతిలో గ్రామ ప్రణాళికల తయారీని ప్రారంభించనున్నట్లు డా.చంద్రవౌళి తెలిపారు.
అనంతరం ఫిబ్రవరి మొదటి వారంలో మొత్తం 14 గ్రామాల్లో పిఆర్‌ఎ పద్ధతులను అవలంభించి గ్రామ ప్రణాళిక తయారీని ప్రారంభించి ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తిచేయాలని ఆయన కోరారు. ప్రాజెక్టు అనంత జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయడానికి ప్రజలు, అధికారులు, ఎన్‌జిఓలు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిటి మల్లారెడ్డి, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం

ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, జనవరి 22 : ఎస్సీ, ఎస్టీల ఫిర్యాదుల పట్ల అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ డియస్ లోకేష్‌కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో బుధవారం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక గ్రీవెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వస్తుంటారన్నారు. ఇలా వచ్చిన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధవహించి వారి సమస్యల పరిష్కారం కోసం తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. గత ఎస్సీ, ఎస్టీ ప్రజావాణి వరకు పరిశీలిస్తే మొత్తం 4116 దరఖాస్తులు రాగా అందులో 3623 పరిష్కారం కాగా, ఇంకా 493 అర్జీలు పెండింగులో ఉన్నాయన్నారు. వాటిలో ప్రధానంగా లీడ్ బ్యాంకు పరిధిలో 54, ఎస్పీ పరిధిలో 44, యాడికి ఎంపిడివో పరిధిలో 34 దరఖాస్తులు అత్యధికంగా పెండింగులో ఉన్నాయన్నారు. పెండింగులో ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. బుధవారం మొత్తం 90 దరఖాస్తులు వచ్చాయి. శింగనమల మండలం నాగులగుడ్డం తండాకు చెందిన జె. రామాంజనేయులు, ఎం.దేవేంద్రనాయక్ పలువురు విద్యార్థులు తమ తండాకు రోడ్డును మంజూరు చేయాలని కోరారు. అనంతపురంరూరల్ మండలం నరసనాయనకుంట సర్పంచు యం. ఓబుళయ్య ఎస్సీ, ఎస్టీల గ్రీవెన్స్‌లో అధికారులతోమాట్లాడుతూ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ వారు భోజనం మోనూలో నాణ్యత పాటించడం లేదని ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ యస్.సత్యనారాయణ, డిఆర్‌డిఎ, డ్వామా, గృహ నిర్మాణ సంస్థల పిడిలు నీలకంఠారెడ్డి, సంజయ్‌ప్రభాకర్, ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి రమణమూర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి జనార్ధనరావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శాంతకుమారి, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజరు జయశంకర్‌లు హాజరై వారి వారి శాఖలకు వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు.

సీమాంధ్రకు న్యాయం చేస్తేనే తెలంగాణకు మద్దతు

అనంతపురం సిటీ, జనవరి 22: సీమాంధ్రకు న్యాయం చేస్తేనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జె.అంకాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బిజెపి జాతీయ నాయకులపై ఒత్తిడి చేశామని తెలిపారు. బుధవారం స్థానిక భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంకాల్‌రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో రెండు రోజుల క్రితం సీమాంధ్రలో బిజెపి నాయకులతో జాతీయ నాయకులు సమావేశం నిర్వహించారని, అందులో జాతీయ అధ్యక్షుడు రాజనాథ్‌సింగ్ సీమాంధ్రకు న్యాయం చేసేంత వరకు తెలంగాణ బిల్లుకు మద్దతును ఇవ్వమని తెలిపారన్నారు. సీమాంధ్రకు న్యాయం చేయాలని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాను నిర్వహించామని, అందుకు జాతీయ నాయకులు మద్దతును తెలిపారన్నారు. రాయలసీమ జిల్లాలో ఎక్కువమంది రైతాంగంపై అధారపడి జీవనం సాగిస్తున్నారని, వారి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, ఓలేటి రత్నమయ్య, నగర అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, నాయకులు గౌని విశ్వనాథ్‌రెడ్డి, పెద్దన్న, లక్ష్మిదేవి, మందారపు రమణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ యార్డును సందర్శించిన బిజెపి కిసాన్‌మోర్చా నేతలు
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు కులశేఖర్‌రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డిల ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డును బుధవారం సందర్శించారు. యార్డులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకుని, వాటిని పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు లలిత్‌కుమార్, ఓలేటి రత్నమయ్య, సుధాకర్‌రెడ్డి, లక్ష్మిదేవి, మందారపు రమణ తదితరులు పాల్గొన్నారు.

పురంలో సమైక్యాంధ్ర హోర్డింగ్‌లు

హిందూపురం టౌన్, జనవరి 22: సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమై ఆరు నెలలు కావస్తున్నా అప్పట్లో ఎప్పుడూ కనిపించని పెద్దపాటి హోర్డింగ్‌లు బుధవారం హిందూపురంలో దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకు సమైక్యాంధ్రకు సంబంధించి ఆయా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు, సమైక్యవాదులు ఫ్లెక్సీలను ఏర్పాటుచేయగా తాజాగా పెద్దపాటి హోర్డింగ్‌లే వెలిశాయి. అయితే ఈ హోర్డింగ్‌లను మంగళవారం అర్ధరాత్రి పట్టణంలోని పలుచోట్ల ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్‌లను ఎవరు ఏర్పాటు చేశారన్న విషయమై స్థానికంగా తీవ్ర చర్చ సాగుతోంది. హోర్డింగ్‌లో ఎలాంటి చిరునామా లేకపోవడం గమనార్హం. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలోనే సమైక్యాంధ్ర పేరిట కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటుచేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ఇలాంటి హోర్డింగ్‌లు వెలియడం చర్చనీయాంశమవుతోంది. హోర్డింగ్‌లో ఆకుపచ్చ రంగు బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్లటి రంగులో ఆంధ్రప్రదేశ్ చిత్రం, చిత్రం కింది భాగంలో జై సమైక్యాంధ్ర అన్న నినాదం ఉంది. అలాగే హోర్డింగ్‌కు ఎడమ వైపు 3సమైక్యాంధ్ర మన విధానం, జై సమైక్యాంధ్ర నినాదం2 అని రాయబడి ఉంది. దీనికితోడు హోర్డింగ్ పైభాగంలో తెలుగుతల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు, బూర్గుల రామకృష్ణారావు చిత్రపటాలు ఉన్నాయి. అదేవిధంగా హోర్డింగ్ చివరన వివిధ ప్రాంతాల్లో సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించి చిత్రపటాలు ముద్రించబడి ఉన్నాయి. రాత్రికి రాత్రే ఏర్పాటైన ఈ హోర్డింగ్‌ను స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇదిలా ఉండగా స్థానికంగా అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న కొందరు నేతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటయ్యే రాజకీయ పార్టీలోకి చేరాలని ఆసక్తి చూపుతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయా నాయకులే ముందుగా పార్టీ పట్ల ప్రజల నుండి ఎలాంటి స్పందన వుంటుందోనని తెలుసుకొనేందుకు ఇలా హోర్డింగ్‌లు ఏర్పాటుచేసి ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతకీ సిఎం నేతృత్వంలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

ప్రాజెక్టు అనంత గ్రామ ప్రణాళికల తయారీలో పార్టిసిపేటరీ
english title: 
A

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>