Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నిర్లక్ష్యం!

$
0
0

కర్నూలు, జనవరి 22 : ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు బలవుతున్నారు. రెండు వారాలుగా కర్నూలులోని పాతబస్తీ వాసులను పట్టి పీడిస్తున్న దుర్వాసన రాజకీయాలకు వేదికగా మారిందే తప్ప పరిష్కారం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన కారణంగా అనేక మంది ప్రజలు శ్వాస, కోశ వ్యాధులకు గురవుతున్నార ఆ కాలనీల వైపు కలెక్టర్ సుదర్శన్ రెడ్డి ఒక్కసారి కూడా వెళ్లి పరిశీలించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. కనీసం నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు భగ్గుమంటున్నారు. అంతేగాకుండా కాలుష్య నియంత్రణ మండలి అధికారులను కానీ, వ్యాధులకు గురవుతున్న పేదలకు చికిత్స చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని సైతం పంపేందుకు ఆదేశాలు జారీ చేయకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సమస్య పరిష్కరించకపోగా రాజకీయ నాయకులకు ఓ పని కలిగినట్లయింది. దుర్వాసనకు మంత్రి టీజీ వెంకటేష్ కర్మాగారం నుంచి వస్తున్న వ్యర్థ పదార్థాలేనంటూ సిపిఎం, వైకాపా నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీరికి తోడు మాజీ ఎంపిపి విష్ణువర్ధన్‌రెడ్డి సంబంధిత ప్రాంతంలో పర్యటించి దుర్వాసన రావడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు బాధలు పట్టని అధికారులపై నిప్పులు చెరిగారు. రెండు లక్షల రూపాయలను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు అందించి తక్షణం వైద్య చికిత్సల కోసం ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్, డిఎంఅండ్‌హెచ్‌ఒలకు కూడా తెలిపారు. అయినా ఒక్క చికిత్స కేంద్రాన్ని కూడా ప్రారంభించకపోవడం శోచనీయం. మరోవైపు దుర్గంధం వ్యాపించడానికి తమ కర్మాగారం కారణం కాదంటూ టీజీ వెంకటేష్ పలుమార్లు వివరణ ఇచ్చారు. నగర పాలక సంస్థ అధికారులతో కలిసి తుంగభద్ర, హంద్రీనది పరీవాహక ప్రాంతాలను పరిశీలించిన ఆయన నగర ప్రజలు వదిలిన వ్యర్థజలాలు, నది ఒడ్డున పశువుల ఎముకలతో నూనె తయారు చేసి వ్యర్థాలను హంద్రీలో వేయడం, శ్రీశైలం జలాశయంలో నీరు దీర్గకాలంగా నిల్వ ఉండటంతో నాచు, పాచి పేరుకుపోవడం వల్ల దుర్గంధం వ్యాపిస్తోందని తెలిపారు. తమ కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే హైపో ద్రావణాన్ని నగర పాలక అధికారులకు ఉచితంగా సరఫరా చేసి దుర్వాసనను పోగెట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కేవలం తనను రాజకీయంగా అప్రతిష్ట పాలు చేయడానికే దుర్వాసన వ్యవహారంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దుర్వాసన వ్యాపించి రాజకీయ నాయకులకు పని కల్పించి అమాయక ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నా బాధ్యత కలిగిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు తక్షణం స్పందించి దుర్వాసనను అరికట్టడానికి చర్యలు తీసుకోవడమే కాకుండా అందుకు కారణాలేంటో ప్రజలకు వివరించి రాజకీయాలకు తావు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

జంటహత్యల కేసును ఛేదించిన పోలీసులు
* ముగ్గురు నిందితుల అరెస్టు
కర్నూలు, జనవరి 22 : కర్నూలు, నంద్యాల పట్టణాల్లో జరిగిన జంటహత్యల కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదు, బంగారు నగలు, కారు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని కెఎస్ వ్యాస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ వివరించారు. 2013 అక్టోబర్ 7వ తేదీ కర్నూలులో, డిసెంబర్ 29వ తేదీ నంద్యాలలో జరిగిన జంట హత్యల కేసుకు సంబధించి మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి ప్రసాద్, మఠం రోహిత్ శివకుమార్, రాజశేఖర్‌ను అరెస్టు చేశామన్నారు. 2013 జూలైలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన వడ్డె కుంచెపు వరప్రసాద్ తల్లి లక్ష్మీనరసమ్మ సర్పంచ్‌గా పోటీ చేశారు. అదే గ్రామానికి చెందిన సురేష్‌వర్మ కందుల భూపాల్‌రెడ్డి వర్గానికి మద్దతిస్తున్నట్లు నమ్మించి, పరోక్షంగా ప్రత్యర్థి వర్గానికి చెందిన అభ్యర్థి అమీరమ్మను గెలిపించేందుకు సహాయపడినట్లు తెలుస్తోంది. దీంతో భవిష్యత్‌లో వర్మ బిసి నాయకుడిగా ఎదిగితే తమ వర్గానికి రాజకీయ భవిష్యత్ ఉండదని భావించి ఎలాగైనా అతడిని హతమార్చాలని మఠం రోహిత్ శివకుమార్, రాజశేఖర్ నిర్ణయించుకున్నారు. 2013 అక్టోబర్ 6వ తేదీ బుక్కాపురం గ్రామానికి చెందిన అదినారాయణ సురేష్‌వర్మ మద్య డబ్బు విషయమై గొడవ జరిగింది. దీన్ని అవకాశంగా తీసుకొని ఇప్పుడు సురేష్‌వర్మను చంపితే అనుమానం అదినారాయణపైకి పోతుందని,అప్పుడు అతని ఇంట్లోని డబ్బు తెచ్చుకొని అప్పులు నుండి బయట పడచచ్చని భావించి ముగ్గురు కలసి పథకం వేశారు. అక్టోబర్ 7వ తేదీ మధ్యాహ్నం సురేష్ పొలంలో వున్న ఫాంహౌస్ వద్దకు వెళ్లి భవిష్యత్తులో సురేష్‌తో కలిసి వుండి గ్రామంలో బలపరుస్తామని నమ్మబలికారు. శివకుమార్ సిఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పని చేసి డిస్మిస్ అయి లక్షల్లో అప్పుల్లో కూరకుపోయాడు. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించి అప్పులు తీర్చాలని ప్రసాద్‌తోపాటు ఈ పథకం రచనలో ముఖ్య పాత్ర పోషించడానికి సిద్దపడ్డారు. పథకం ప్రకారం అక్టోబర్ 7వ తేది రాత్రి 10 గంటలకు ముగ్గురు మోటారు సైకిళ్లపై వెళ్లి సాయి ఆనందం అపార్ట్‌మెంటులో నివాసం ఉంటున్న సరేష్, అతని తల్లిని హత్య చేసి ఇంట్లోని బంగారు, రూ.50వేల నగదు, ల్యాప్‌టాప్‌లు దోచుకెళ్లారని ఎస్పీ చెప్పారు.
బేతంచర్ల మండలం అంబాపురం గ్రామానికి చెందిన శిర్రెన్న్తతో ప్రసాద్, శివకుమార్, రాజశేఖర్ పరిచయం పెంచుకున్నారు. డబ్బుఉన్న వారి సమాచారం ఇస్తే వాటా ఇస్తామని నమ్మించారు. కర్నూలులోని గిబ్సన్‌కాలనీ తేజా డీలక్స్ అపార్ట్‌మెంటులో నివాసం ఉంటున్న ఫైనాన్సియర్ మధుసూధన్‌రెడ్డి గురించి చెప్పి అతని ఇంట్లో ఎప్పడు దాదాపు రూ.2కోట్లు వరకు నగదు వుంటుందని సమాచారం అందించారు. డిసెంబర్ 29వ తేదీన రాత్రి 9.30 గంటలకు ఇన్‌కమ్‌టాక్స్ వారమని చెప్పి ఇంట్లోకి చొరబడి భార్యా, భర్తలపె కత్తులతో దాడి చేసి చంపారు. బీరువా తెరవడానికి ప్రయత్నించి విఫలం కావడంతో భార్య, భర్తలను చంపి వారి ఒంటిపై ఉన్న బంగారును తీసుకెళ్లారు. పరార్‌లో వున్న శిర్రెన్న, ఆయుధాలు సమకూర్చిన నవీన్‌కుమార్ కోసం ప్రత్యేక బృందం గాలిస్తోందన్నారు. మరో నిందితుడు బేతంచర్ల మండలం అంబాపురం గ్రామానికి చెందిన గుమ్మ శిర్రెన్నను అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. కేసును చేధించిన నంద్యాల డిఎస్పీ అమర్‌నాథనాయుడు, నంద్యాల 1టౌన్ సిఐ గుమ్మడి రవికుమార్, ఎస్సై ఎన్‌వి రమణ, సిబ్బంది సుదీష్‌బాబు, రమణ, మద్దయ్య, చంద్రశేఖర్, చిన్నబ్బి, మున్నలను ఆయన అభినందించారు. విలేకర్ల సమావేశంలో జిల్లా ఏఏస్పీ వెంకటరత్నం, ఓయస్డ్ రవీశంకర్‌రెడ్డి, కర్నూలు డిఎస్పీ వైవి రమణకుమార్, 2వ పట్టణ సిఐ బాబుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంక్షోభంలో వ్యవసాయం
* 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డి
కర్నూలు ఓల్డ్‌సిటీ, జనవరి 22 : రాష్ట్ర వ్యవసాయం సంక్షోభంలో ఉందని రైతులు ఏ పంట పండించినా కనీస ధరల లభించడం లేదని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ ఎన్.తులసిరెడ్డి అన్నారు. బుధవారం ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూఇతర వర్గాలకు వచ్చిన విధంగా రైతుల ఆదాయం పెరగడం లేదన్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి చేతిక అందుక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 40 సంవత్సరాల కిందట రైతులు సుభిక్షంగా ఉన్నారని అదే నేడు రైతులు కన్నీరు పెడుతున్నారన్నారు. పప్పు శనగకు కనీస మద్దతు ధర క్వింళ్ళు రూ.5వేలు మార్క్‌ఫెడ్ ఇవ్వాలన్నారు. మద్దతు ధర రైతులకు అందేలా ముఖ్యమంత్రితో మాట్లాడుతుమాని తెలిపారు. దేశంలో వ్యవసాయ అభివృద్ధి చెందకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. సిపిఐ రాష్ట్ర నేత రామకృష్ణ మాట్లాడుతూ టమోట, వెరుశెనగ పంటలకు గిట్టుబాటు ధర కోసం ఆందోళనలు చేస్తామన్నారు. పప్పు పంటలకు కనీస ధర ఐదువేల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి జగన్నాథం, రావుల వెంకయ్య, సిపిఐ నాయకుడు రామాంజనేయులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ క్రీడల వైపు
కనె్నత్తి చూడని ఉన్నతాధికారులు
* క్రీడాకారులకు తప్పని తిప్పలు
నంద్యాల అర్బన్, జనవరి 22 : ప్రతిష్టాత్మకంగా దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-19 తైక్వాండో, అండర్-14, 17, 19 బాలికల ఫెన్సింగ్ పోటీలు నిర్వహించే అవకాశం జిల్లాలోని నంద్యాల పట్టణం దక్కించుకోవడం అదృష్టంగా చెప్పవచ్చు. జాతీయ స్కూల్ గేమ్స్‌లో ప్రతిభ చాటిన క్రీడాకారులే రేపటి రోజున దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉంది. స్కూల్‌గేమ్స్ పోటీలలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని క్రీడాకారులకు ప్రోత్సహించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూల్‌గేమ్స్‌కు అండగా నిలవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ అటు మంత్రులు గాని, ఉన్నతాధికారులు గాని కనె్నత్తి చూడకపోవడం విచారకరమని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈపోటీలకు ఇటీవలె నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియంతో పాటు వేల సంఖ్యలో క్రీడాకారిణులకు కట్టుదిట్టమైన భద్రత మధ్య రామకృష్ణ పిజి కళాశాల హాస్టల్‌లో వసతి సౌకర్యం కల్పించగా, దక్షిణ భారతదేశ వంటకాలతో, ఉత్తరభారతదేశ వంటకాలతో క్రీడాకారిణుల, శిక్షకుల, అధికారుల ప్రశంసలు అందుకున్నారు. తైక్వాండో పోటీల్లో క్రీడాకారులకు గాయాలు కావడం సహజం. వారికి అప్పటికప్పుడే ప్రథమ చికిత్స చేయాల్సిన బాధ్యత జిల్లాస్థాయి ఆసుపత్రి వైద్యులుపై ఉంది. నిర్వాహకులు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని డిఎంహెచ్‌ఓను కోరినప్పటికీ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు సహకరించకపోవడంతో పట్టణంలోని ప్రైవేట్ వైద్యులు ముందుకు వచ్చి గాయపడ్డ క్రీడాకారులకు ఉచిత వైద్య సేవలందించారు. అలాగే ఆహ్వాన పత్రికలో చేంతాడంత ఉన్నతాధికారుల జాబితా ఉన్నప్పటికీ కలెక్టర్, ఎస్పీతో పాటు క్రీడల అభివృద్ధి అధికారి నాగరాజు నంద్యాలలో జరుగుతున్న జాతీయ క్రీడల కార్యక్రమానికి ఏ రోజు కూడా హాజరుకాకపోవడం వారికి క్రీడలపై ఏమాత్రం మక్కువ ఉందో లేదన్నది స్పష్టమవుతుంది. అలాగే జాతీయ క్రీడల ప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రికలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి జయసూర్యప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కొండ్రు మురళీమోహన్, న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్‌లు ఇటువైపు కూడా చూడలేదు. అంతేగాక కర్నూలు నగరంలో అత్యున్నత సౌకర్యాలు ఉన్న స్టేడియంలు ఉన్నప్పటికీ జాతీయ క్రీడలు నంద్యాలలో నిర్వహించడమేమిటని ఆహ్వాన పత్రికలు ఇవ్వడానికి వెళ్లిన స్కూల్ గేమ్స్ నిర్వాహకులను చీవాట్లు వేసినట్లు తెలిసింది. తమ నగరంలో జాతీయ క్రీడలు నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ మంత్రి జిల్లాస్థాయి అధికారులను కూడా నంద్యాలకు వెళ్లకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా 19వ తేదీ నంద్యాల పట్టణంలో న్యాయశాఖ మంత్రి పల్స్‌పోలియో కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ క్రీడలు జరుగుతున్న ప్రదేశానికి రాలేదు. అలాగే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ సిఇఓ కూడా ఇటువైపు కనె్నత్తి చూడలేదు. ఈయన పేరు కూడా ఆహ్వానపత్రికలో ఉండడం విశేషం. కాగా స్థానిక ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి కూడా జాతీయస్థాయి పోటీల్లో ఏరోజు కూడా పాల్గొనకపోవడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మిగిలింది. జాతీయస్థాయి పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి, ముగింపు కార్యక్రమానికి డివిజన్‌స్థాయి అధికారులే అండగా నిలిచారు. కాగా మధ్యలో రెండు రోజులు ఎంపి ఎస్పీవై రెడ్డి క్రీడా పోటీల్లో పాల్గొని క్రీడాకారులను అభినందించడం కొసమెరుపు. ఇంతమంది ఉన్నతాధికారులు గైర్హాజరైనా, మంత్రులు రాకపోయినా తెరవెనుక నంద్యాల పట్టణానికి జాతీయ క్రీడలు నిర్వహించే అవకాశం కల్పించిన ఎంఎ గౌస్, అన్ని తానై తైక్వాండో, ఫెన్సింగ్ పోటీల నిర్వాహణలో అధికారులను, క్రీడాకారులను ఆహ్వానించడం, వారికి వసతి, రవాణా సౌకర్యాలు కల్పించడం తదితర పనుల భారాన్ని నెత్తిమీద వేసుకుని క్రీడలు విజయవంతం కావడానికి జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేశ్వరరావు ప్రధానపాత్ర. అలాగే జాతీయ తైక్వాండో, ఫెన్సింగ్ పోటీల నిర్వహణలో తెరముందు నిలిచి అహర్నిశలు కృషి చేసిన జిల్లా ఒలింపిక్ సంఘం చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, ఆతిథ్యం ఇచ్చిన రామకృష్ణా విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి సేవలు మరువలేమని సుదూర ప్రాంతాల నుంచి నంద్యాలకు వచ్చిన అధికారులు, క్రీడాకారుల ప్రశంసలు చేయడం గమనార్హం.

* కనె్నత్తి చూడని కలెక్టర్ * రాజకీయ వేదికగా ‘దుర్వాసన’ * పెరుగుతున్న పేదల బాధలు * బాధితులకు అందని వైద్యం
english title: 
n

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>